ఉమేశ్‌కి గాయం... ఆస్ట్రేలియాకి కలిసొస్తున్న అంపైర్స్ కాల్ నిర్ణయాలు... సచిన్, షేన్ వార్న్ అసంతృప్తి...

Published : Dec 28, 2020, 09:37 AM IST

బాక్సింగ్ డే టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను స్వల్ప స్కోరుకే కట్టడి చేయాలని భావించిన టీమిండియాకు పెద్దగా అదృష్టం కలిసి రావడం లేదు. 15 ఓవర్లలో రెండు సార్లు రివ్యూ తీసుకున్న టీమిండియాకి అంపైర్ కాల్స్ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో అంపైర్స్ కాల్ నిర్ణయాలపై విమర్శలు వస్తున్నాయి. రెండు వికెట్లు తీసినా అంపైర్స్ కాల్ కారణంగా రెండు సార్లు బౌలర్లకు వికెట్లు దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్, భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా ‘అంపైర్స్ కాల్’ రూల్‌ను మార్చాలని కోరడం విశేషం.

PREV
115
ఉమేశ్‌కి గాయం... ఆస్ట్రేలియాకి కలిసొస్తున్న అంపైర్స్ కాల్ నిర్ణయాలు... సచిన్, షేన్ వార్న్ అసంతృప్తి...

మూడో ఓవర్ మొదటి బంతికే ఆసీస్ ఓపెనర్ జో బర్న్స్‌ను ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీలు చేసింది టీమిండియా... అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు.

215

బుమ్రా మీద ఉన్న నమ్మకంతో రివ్యూ తీసుకున్నాడు కెప్టెన్ అజింకా రహానే. టీవీ రిప్లైలో బంతి వికెట్ల అంచునకు తాకినట్టు కనిపించినా... అంపైర్ కాల్ నిబంధన కింద నాటౌట్‌గా ప్రకటించాడు థర్డ్ అంపైర్.

315

ఆ తర్వాతి ఓవర్‌లోనే జో బర్న్స్‌ను అవుట్ చేసి, ఆస్ట్రేలియాకి తొలి షాక్ ఇచ్చాడు ఉమేశ్ యాదవ్. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో కీపర్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు బర్న్స్.

415

బ్యాటుకి బంతి తగిలినా జో బర్న్స్, రివ్యూ తీసుకోవడం విశేషం. రిప్లైలో అతని బ్యాటుకి బంతి తగిలినట్టు స్పష్టంగా కనిపించడంతో ఆసీస్ ఓ రివ్యూ కోల్పోయింది...

515

ఆ తర్వాత 15వ ఓవర్‌లో సిరాజ్ బౌలింగ్‌లో లబుషేన్ అవుట్ కోసం అప్పీలు చేసింది టీమిండియా. మళ్లీ సేమ్ సీన్. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడంతో రివ్యూకి వెళ్లాల్సి వచ్చింది...

615

రిప్లైలో బంతి వికెట్ల అంచుకి తాకడంతో అంపైర్ కాల్ కింద లబుషేన్ బతికిపోయాడు... ఆస్ట్రేలియాకి రెండు సార్లు లాభం జరిగింది, రెండుసార్లు రివ్యూ తీసుకున్నా టీమిండియాకు లాభం చేకూరలేదు.

715

దీంతో బంతి వికెట్లను తాకినప్పుడు అవుట్‌గా ప్రకటించాలని, అంపైర్ కాల్‌గా ప్రకటించడం వల్ల బౌలర్లకు నష్టం కలుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్.

815

సచిన్ టెండూల్కర్ కూడా అంపైర్ కాల్ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘అంపైర్ ఇచ్చిన నిర్ణయంతో అసంతృప్తి కలగడం వల్లే ప్లేయర్లు రివ్యూకి వెళతారు. రివ్యూ సిస్టమ్‌లో ఎలాంటి లోపాలు ఉండకూడదు. ముఖ్యంగా అంపైర్స్ కాల్ విషయంలో ఐసీసీ మరోసారి ఆలోచించాలి...’ అంటూ ట్వీట్ చేశాడు సచిన్ టెండూల్కర్.

915

అంపైర్ కాల్ కారణంగా బతికిపోయిన లబుషేన్... అశ్విన్ బౌలింగ్‌లో రహానేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 42 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా...

1015

49 బంతుల్లో ఓ ఫోర్‌తో 28 పరుగులు చేసిన లబుషేన్... మాథ్యూ వేడ్‌తో కలిసి రెండో వికెట్‌కి 38 పరుగులు జోడించాడు.

1115

రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో రహానే క్యాచ్ అందుకోవడం ఇది 27వ సారి... అనిల్ కుంబ్లే- రాహుల్ ద్రావిడ్ (55 సార్లు),  హర్భజన్ సింగ్ - రాహుల్ ద్రావిడ్ (51 సార్లు) మాత్రమే ఈ ఇద్దరి కంటే ముందున్నారు.

1215

అత్యధిక టెస్టు క్యాచులు అందుకున్న భారత ఫీల్డర్‌గా కోహ్లీని అధిగమించాడు అజింకా రహానే. కోహ్లీ 84 క్యాచులు అందుకోగా, రహానే అందుకున్న క్యాచ్ 85వది. ద్రావిడ్ (209) క్యాచ్‌లతో టాప్‌లో ఉండగా లక్ష్మణ్, సచిన్, గవాస్కర్, అజారుద్దీన్, సెహ్వాగ్... రహానే కంటే ముందున్నారు.

1315

అంపైర్ కాల్స్ కారణంగా రెండు సార్లు నష్టపోయిన టీమిండియా... లబుషేన్ అవుటైన తర్వాతి ఓవర్‌లోనే మరోసారి రివ్యూకి వెళ్లింది...

1415

సిరాజ్ బౌలింగ్‌లో మాథ్యూ వేడ్‌ అవుట్ కోసం అప్పీలు చేసిన టీమిండియా... రివ్యూ తీసుకున్నా లాభం లేకపోయింది. రిప్లైలో బంతి వికెట్లకు చాలా దూరంగా వెళ్తున్నట్టు స్పష్టంగా కనిపించింది.

1515

జో బర్న్స్ వికెట్ తీసిన ఉమేశ్ యాదవ్... బౌలింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డాడు. మూడు బంతులు వేసిన తర్వాత ఉమేశ్ యాదవ్ బౌలింగ్ చేయలేకపోవడంతో అతని ఓవర్‌ను సిరాజ్ పూర్తి చేశాడు.
 
click me!

Recommended Stories