బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా ఆలౌట్... మొదటి ఇన్నింగ్స్‌లో 131 పరుగుల ఆధిక్యం...

First Published Dec 28, 2020, 7:13 AM IST

బాక్సింగ్ డే టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 326 పరుగులకి ఆలౌట్ అయ్యింది. సెంచరీతో అదరగొట్టిన అజింకా రహానే అవుటైన తర్వాత 32 పరుగుల తేడాతో ఐదు వికెట్లు కోల్పోయింది టీమిండియా. రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత జట్టుకి 131 పరుగుల ఆధిక్యం దక్కింది. 

ఓవర్‌నైట్ స్కోరు 2775 వద్ద ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా... మరో 17 పరుగులు జోడించిన తర్వాత తొలి వికెట్ కోల్పోయింది...
undefined
223 బంతుల్లో 12 ఫోర్లతో 112 పరుగులు చేసిన అజింకా రహానే... టెస్టు కెరీర్‌లో తొలిసారి రనౌట్ అయ్యాడు...
undefined
టెస్టుల్లో సెంచరీ పూర్తిచేసుకున్న తర్వాత రనౌట్ అయిన మూడో భారత కెప్టెన్‌గా అజింకా రహానే...ఇంతకుముందు 1951లో విజయ్ హాజరే, 2006లో రాహుల్ ద్రావిడ్... టెస్టు సెంచరీల తర్వాత రనౌట్ అయ్యారు.
undefined
ఐదో వికెట్‌కి రవీంద్ర జడేజా, అజింకా రహానే కలిసి 121 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు...
undefined
159 బంతుల్లో 3 ఫోర్లతో 57 పరుగులు చేసిన రవీంద్ర జడేజా... స్టార్క్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి కమ్మిన్స్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...
undefined
ఉమేశ్ యాదవ్ 19 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసి నాథన్ లియాన్ బౌలింగ్‌లో స్మిత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
undefined
అదే స్కోరు వద్ద 42 బంతుల్లో 14 పరుగులు చేసిన రవిచంద్రన్ అశ్విన్కూడా హజల్‌వుడ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...
undefined
జస్పిత్ బుమ్రా పరుగులేమీ చేయకుండా మొదటి బంతికే డకౌట్ కావడంతో 326 పరుగుల వద్ద భారత తొలి ఇన్నింగ్స్ ముగిసింది.
undefined
ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3, నాథన్ లియాన్ మూడు వికెట్లు తీశారు. ప్యాట్ కమ్మిన్స్ రెండు వికెట్లు తీయగా, హజల్‌వుడ్‌కి ఓ వికెట్ దక్కింది..
undefined
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫీల్డర్లు ఆరు క్యాచులను జారవిరచడం విశేషం. ఈ దశాబ్దకాలంలో ఆసీస్ నుంచి ఇదే చెత్త ప్రదర్శన.
undefined
click me!