U19 World Cup: చ‌రిత్ర సృష్టించిన భార‌త్.. ఈసారి క‌ప్పు మ‌న‌దే అంటున్న యంగ్ ఇండియా

First Published Feb 6, 2024, 10:06 PM IST

India U19 vs South Africa U19: డిఫెండింగ్‌ ఛాంపియన్ గా బ‌రిలోకి దిగిన యంగ్ ఇండియా అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్ లో జైత్ర‌యాత్ర‌ను కొన‌సాగిస్తోంది. ఉదయ్‌ సహారన్‌ నేతృత్వంలోని భారత్ జ‌ట్టు సెమీ ఫైనల్ లో ద‌క్షిణాఫ్రికాను చిత్తు చేసి 9వ సారి ఫైన‌ల్ కు చేరుకుని చ‌రిత్ర సృష్టించింది. 
 

U19 india, U19WorldCup, India, cricket

India U19 vs South Africa U19, Semi-Final: అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ సెమీ ఫైన‌ల్స్ లో సౌతాఫ్రికాను భార‌త్ జ‌ట్టు చిత్తు చేసింది. సౌతాఫ్రికాపై గెలుపుతో యంగ్ ఇండియా 9వ సారి అండ‌ర్-19 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఫైనల్ చేరి స‌రికొత్త రికార్డు సృష్టించింది. విల్లోమూర్ పార్క్, బెనోని వేదిక‌గా జ‌రుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భార‌త్ బౌలింగ్ ఎంచుకుంది.
 

U19 india, U19WorldCup, India, cricket

ఐసీసీ అండ‌ర్-19 ప్ర‌పంచ క‌ప్ లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన భారత్.. మంగళవారం బెనోనిలో జరిగిన దక్షిణాఫ్రికాను రెండు వికెట్ల తేడాతో ఓడించి తొమ్మిదోసారి ఫైనల్‌కు చేరుకుంది. స్కిప్పర్ ఉదయ్ సహారన్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో 81 పరుగులు  చేసి జ‌ట్టును ముందుకు న‌డిపించాడు. మ‌రో భార‌త యంగ్ ప్లేయ‌ర్ సచిన్ దాస్ 96 పరుగులతో జ‌ట్టు విజ‌యంలో త‌న‌దైన ముద్ర వేశాడు. 

Latest Videos


U19 india, U19WorldCup, India, cricket

గత మ్యాచ్‌లో నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 200-ప్లస్ భాగ‌స్వామ్యం నెలకొల్పిన వీరిద్దరూ ఈసారి ఐదో వికెట్‌కు 187 బంతుల్లోనే 171 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో పేస్ ద్వయం క్వేనా మఫాకా (3/32), ట్రిస్టన్ లూస్ (3/37) రాణించారు.

U19 india, U19WorldCup, India, cricket

అంతకుముందు, భారత బౌలర్లు బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్ పై భారీ స్కోర్ చేయ‌కుండా ద‌క్షిణాఫ్రికాను అడ్డుకున్నారు.ఈ బ్యాటింగ్ అనుకూల పిచ్ పై క్రమశిక్షణతో కూడిన భార‌త‌ బౌలింగ్ ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను 244/7కి పరిమితమైంది. వికెట్ కీపర్-బ్యాటర్ లువాన్-డ్రే ప్రిటోరియస్ 76 పరుగులు, రిచర్డ్ సెలెట్స్‌వేన్ 64 పరుగులు చేశారు.  భార‌త బౌల‌ర్ల‌లో రాజ్ లింబాని 3 వికెట్లు, ముషీర్ ఖాన్ 2 వికెట్లు తీసుకున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కు అండ‌ర్ 19 ప్ర‌పంచ క‌ప్ లో యంగ్ ఇండియా తిరుగులేని విజ‌యాల‌తో ఐసీసీ మెగా టోర్నీలో జైత్ర‌యాత్ర‌ను కొన‌సాగిస్తోంది. ఉదయ్‌ సహారన్‌ నేతృత్వంలోని భారత్ జ‌ట్టు ఐసీసీ అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో ఆడిన 5 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి సెమీస్‌లోనూ ఫేవరెట్‌గా నిలిచింది. గ్రూప్ దశలో 3 మ్యాచ్‌లు, సూపర్-6 దశలో 2 మ్యాచ్‌ల్లో భార‌త్ తిరుగులేని విజ‌యాలు సాధించింది. ఇప్పుడు సెమీ ఫైన‌ల్స్ లో ద‌క్షిణాఫ్రికాపై విజ‌యం సాధించి 9వ సారి ఫైన‌ల్ కు చేరుకుంది. ఈ సారి క‌ప్పు మ‌న‌దే అంటూ యంగ్ ఇండియా ముందుకు సాగుతోంది.. ! 

click me!