నువ్వేమి చేశావు నేరం.. నిన్నెక్కడంటింది పాపం..!! ఢిల్లీ ఓపెనర్ పై సానుభూతి కురిపిస్తున్న అభిమానులు

Published : Jun 16, 2022, 11:35 AM ISTUpdated : Jun 16, 2022, 11:36 AM IST

India Tour Of Ireland: భారత క్రికెట్ జట్టు ఈ నెలలో దక్షిణాఫ్రికా తో సిరీస్ ముగిసిన తర్వాత ఐర్లాండ్ వెళ్లనుంది. ఈ మేరకు  అక్కడ ఆడబోయే జట్టును ప్రకటించింది. అయితే ఈ జట్టులో ఢిల్లీ ఓపెనర్.. 

PREV
17
నువ్వేమి చేశావు నేరం.. నిన్నెక్కడంటింది పాపం..!! ఢిల్లీ ఓపెనర్ పై సానుభూతి కురిపిస్తున్న అభిమానులు

ఈనెల 26, 28న ఐర్లాండ్ తో రెండు టీ20 మ్యాచులు ఆడబోయే భారత జట్టును బీసీసీఐ ప్రటకించింది. బుధవారం రాత్రి జట్టు సభ్యుల పేర్లను అనౌన్స్ చేసింది. ఈ జట్టుకు  హార్ధిక్ పాండ్యా సారథ్యం వహించనున్నాడు. 

27

అయితే 17 మంది సభ్యుల ఈ జట్టులో ఢిల్లీ ఓపెనర్, ప్రస్తుతం రంజీలలో ముంబైకి సారథిగా  వ్యవహరిస్తున్న  పృథ్వీ షా పేరు లేదు.  గత కొన్నాళ్లుగా నిలకడగా రాణిస్తున్నా షా పేరు లేకపోవడంతో అతడి అభిమానులతో పాటు నెటిజన్లు కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు. 

37

మరో సెహ్వాగ్ అవుతాడని భావిస్తున్న షా కు ఇలా అవకాశాలివ్వకపోవడం దారుణమని ట్విటర్ లో శోకాలు పెడుతున్నారు. భారత జట్టులో చోటు కల్పించకపోవడంపై అతడు చేసిన పాపమేంటని బీసీసీఐని కడిగిపారేస్తున్నారు. 

47

ట్విటర్ వేదికగా పలువురు స్పందిస్తూ.. ‘ఐర్లాండ్ టూర్ లో పృథ్వీ షా ను తీసుకోలేదు. ఇది చాలా దారుణం..’ ‘షా చేసిన తప్పేంటి..? బాగా ఆడటమే అతడి తప్పా చెప్పండి..?’ ‘బాధపడకు షా.. సూర్యుడు తూర్పున ఉదయించక మానడు.. నువ్వు టీమిండియాలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరు..’ అని వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

57

మరికొందరు.. ‘ఈరోజు నీది కాదు. కానీ నీ విలువేంటో వాళ్ల (సెలెక్టర్ల)కు తర్వాత తెలుస్తుంది..’, ‘ఇండియలో ప్రస్తుతం ధాటిగా ఆడే యువ ఆటగాళ్లలో షా ఒకడు. అతడినే పక్కనబెడితే ఎలా..?’ ‘ఇదేం జట్టు ఎంపిక..? షాను ఎంపిక చేయరా..’ అని బీసీసీఐకి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 

67

ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన షా.. 10 మ్యాచులలో  283 పరుగులు చేశాడు. పవర్ ప్లే లో డేవిడ్ వార్నర్ తో కలిసి ధాటిగా ఆడి ఢిల్లీ భారీ స్కోరు చేయడంలో సహకరించాడు. 

77

ఐర్లాండ్‌లో పర్యటించే భారత జట్టు: హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్,  సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్, యజ్వేంద్ర చాహాల్, అక్షర్ పటేల్, రవి భిష్ణోయ్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్

click me!

Recommended Stories