కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా, రాహుల్ త్రిపాఠికి అవకాశం... ఐర్లాండ్‌ టూర్‌కి భారత జట్టు ఇదే...

Published : Jun 16, 2022, 10:34 AM IST

ఐపీఎల్ 2022 సీజన్ తర్వాత సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతున్న భారత జట్టు, త్వరలో ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు వెళ్లనుంది. ఇప్పటికే ఇంగ్లాండ్ టూర్‌లో టెస్టు మ్యాచ్‌కి జట్టుని ప్రకటించిన భారత క్రికెట్ బోర్డు, తాజాగా ఐర్లాండ్‌లో పర్యటించే జట్టును ఎంపిక చేసింది...

PREV
17
కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా, రాహుల్ త్రిపాఠికి అవకాశం... ఐర్లాండ్‌ టూర్‌కి భారత జట్టు ఇదే...

ఇంగ్లాండ్‌ టూర్‌కి వెళ్లే ప్రధాన జట్టు, అక్కడ జూలై 1 నుంచి ఐదో టెస్టు మ్యాచ్ ఆడనుంది. గత ఏడాది ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్‌కి వెళ్లిన భారత జట్టు నాలుగు టెస్టులు ఆడి 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. అయితే మాంచెస్టర్‌లో జరగాల్సిన ఐదో టెస్టు భారత బృందంలో కరోనా కేసుల కారణంగా వాయిదా పడింది..

27

ఏడాది తర్వాత ఇరు జట్లు కొత్త కెప్టెన్లు, కొత్త హెడ్ కోచ్‌లతో నిర్ణయాత్మక టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ టెస్టు మ్యాచ్ జరుగుతుండగా కౌంటీ క్లబ్‌లతో టీ20 సిరీస్ ప్రాక్టీస్ మ్యాచులు ఆడనుంది భారత జట్టు...

37

సౌతాఫ్రికా సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రిషబ్ పంత్, ఇంగ్లాండ్ టూర్‌లో సభ్యుడిగా ఉంటాడు. దీంతో ఐర్లాండ్ టూర్‌కి హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కి కెప్టెన్‌గా తొలి సీజన్‌లోనే టైటిల్ అందించిన హార్ధిక్ పాండ్యాకి ఇదే స్పెషల్ బోనస్ ఆఫర్...

47
Rahul Tripathi

భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్‌గా ఎంపిక కాగా, ఐపీఎల్‌లో నిలకడగా పర్ఫామెన్స్ ఇస్తూ వస్తున్న యంగ్ బ్యాట్స్‌మెన్ రాహుల్ త్రిపాఠికి తొలిసారి పిలుపునిచ్చారు సెలక్టర్లు. సౌతాఫ్రికా సిరీస్‌ ఆడుతున్న దినేశ్ కార్తీక్, ఐర్లాండ్‌ టూర్‌కి కూడా ఎంపికయ్యాడు...

57

సౌతాఫ్రికా సిరీస్‌కి ఎంపిక కాని సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్‌లకు ఐర్లాండ్ టూర్‌లో అవకాశం కల్పించారు సెలక్టర్లు. అలాగే దీపక్ హుడా, వెంకటేశ్ అయ్యర్‌లకు ఐర్లాండ్‌ టూర్‌లో ఛాన్స్ దక్కింది.

67
Rahul Tripathi

ఐర్లాండ్‌లో పర్యటించే భారత జట్టు ఇదే: హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్,  సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్, యజ్వేంద్ర చాహాల్, అక్షర్ పటేల్, రవి భిష్ణోయ్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్..

77
Image credit: PTI

ఐర్లాండ్ పర్యటనలో జూన్ 26న డబ్లీన్‌లో తొలి టీ20 మ్యాచ్ ఆడే భారత జట్టు, 28న రెండో టీ20 మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్ చేరుకుని జూలై 1న, జూలై 3న కౌంటీ క్లబ్‌లతో ప్రాక్టీస్ మ్యాచులు ఆడుతుంది... 

click me!

Recommended Stories