ఆ ఇద్దరూ టీమ్‌లో ఎందుకున్నారో అర్థం కాలేదు, తీసి పారేయండి... వీరేంద్ర సెహ్వాగ్ ఫైర్

Published : Jul 24, 2021, 05:32 PM IST

శ్రీలంక టూర్‌లో భారత బీ జట్టు అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చింది. వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకున్న శిఖర్ ధావన్ టీమ్, ఆఖరి వన్డేలో పోరాడి ఓడింది. అయితే జట్టులో ఇద్దరు ప్లేయర్లు ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయారు...

PREV
110
ఆ ఇద్దరూ టీమ్‌లో ఎందుకున్నారో అర్థం కాలేదు, తీసి పారేయండి... వీరేంద్ర సెహ్వాగ్ ఫైర్

యువకులతో నిండిన జట్టులో సీనియర్లుగా చోటు దక్కించుకున్న మనీశ్ పాండే, ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాల పర్ఫామెన్స్‌పై తీవ్రంగా మండిపడ్డారు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్..

210

‘భారత జట్టులో రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న మనీశ్ పాండే, హార్ధిక్ పాండ్యాలకు ఇది చాలా పెద్ద అవకాశం. అయితే వీళ్లిద్దరి పర్ఫామెన్స్ నన్ను తీవ్రంగా నిరాశపరిచింది...

310

ముఖ్యంగా పాండే, మూడు మ్యాచుల్లోనూ బ్యాటింగ్ చేశాడు, అయినా ఓ సీనియర్‌గా చేయాల్సినన్ని పరుగులు మాత్రం చేయలేకపోయాడు...

410

మనీశ్ పాండే అయితే మళ్లీ టీమిండియా తరుపున ఆడేందుకు ఛాన్స్ దక్కించుకుంటాడని నేను అనుకోవడం లేదు. ఒకవేళ పాండే రీఎంట్రీ ఇచ్చినా, దానికోసం చాలాకాలం వేచి చూడాల్సిందే...

510

ఈ ఇద్దరినీ పక్కనబెట్టి, పూర్తిగా కొత్త కుర్రాళ్లతో ఆడించినా బాగుండేది. దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి యంగ్‌స్టర్స్ టీమ్‌లో చోటు కోసం ఎదురుచూస్తున్నారు..

610

సీనియర్లకంటే కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ పర్ఫామెన్స్ నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. ఈ ఇద్దరూ మిడిల్ ఆర్డర్‌లో చక్కగా రాణించగలమని నిరూపించుకున్నారు...

710

పృథ్వీషా బ్యాటింగ్ కూడా చాలా చక్కగా సాగింది. అతనికి రెండు మ్యాచుల్లో మంచి ఆరంభం దక్కినా, దాన్ని భారీ స్కోరుగా మార్చలేకపోయాడు. దీనికి కారణం అతను గేమ్‌ను సరిగ్గా రీడ్ చేయలేకపోవడమే...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.

810

మూడో వన్డేలో 19 బంతులాడి 11 పరుగులు మాత్రమే చేసిన మనీశ్ పాండే, ఫీల్డింగ్‌లో రెండు క్యాచులు జారవిడిచాడు. ఈ క్యాచుల కారణంగా భారత జట్టు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

910

హార్ధిక్ పాండ్యాకి మొదటి వన్డేలో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. రెండో వన్డేలో డకౌట్ అయిన హార్ధిక్ పాండ్యా, మూడో వన్డేలో 17 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

1010

బౌలింగ్‌లోనూ పెద్దగా ప్రభావం చూపించలేకపోయిన హార్ధిక్ పాండ్యా, ఓ వికెట్ తీసినా 5 ఓవర్లలో 43 పరుగులు సమర్పించుకుని నిరాశపరిచాడు...

click me!

Recommended Stories