ఇంగ్లాండ్ టూర్‌కి పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్, జయంత్ యాదవ్... ముంబై ప్లేయర్‌కి లక్కీ ఛాన్స్...

First Published Jul 24, 2021, 2:11 PM IST

ఇంగ్లాండ్ టూర్‌లో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ప్రారంభం కాకముందే ముగ్గురు ప్లేయర్లు గాయాల కారణంగా దూరం కావడంతో వారి స్థానంలో ముగ్గురు ప్లేయర్లను ఇంగ్లాండ్ టూర్‌కి పంపాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...

ఇంగ్లాండ్ టూర్‌లో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ప్రారంభం కాకముందే ముగ్గురు ప్లేయర్లు గాయాల కారణంగా దూరం కావడంతో వారి స్థానంలో ముగ్గురు ప్లేయర్లను ఇంగ్లాండ్ టూర్‌కి పంపాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...
undefined
ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌తో పాటు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికైన యంగ్ పేసర్ ఆవేశ్ ఖాన్... వామప్ మ్యాచ్‌లో గాయపడ్డారు. వీళ్లు కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని వైద్యులు తేల్చడంతో వారి స్థానంలో ముగ్గురు ప్లేయర్లను ఇంగ్లాండ్ టూర్‌కి పంపాలని నిర్ణయించుకుంది బీసీసీఐ.
undefined
ఈ మధ్య కాలంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న యంగ్ సెన్సేషనల్ ప్లేయర్ పృథ్వీషాతో పాటు అంతర్జాతీయ ఆరంగ్రేటం నుంచి అదరగొడుతున్న సూర్యకుమార్ యాదవ్‌, స్పిన్నర్ జయంత్ యాదవ్‌లను ఇంగ్లాండ్ టూర్‌కి పంపాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...
undefined
పృథ్వీషా, జయంత్ యాదవ్‌లకిఇప్పటికే భారత జట్టు తరుపున టెస్టులు ఆడిన అనుభవం ఉండగా సూర్యకుమార్ యాదవ్‌కు ఇదే మొట్టమొదటి టెస్టు టూర్ కానుంది...
undefined
ఇంగ్లాండ్‌తో సిరీస్ ద్వారా టీ20 ఆరంగ్రేటం చేసిన సూర్యకుమార్ యాదవ్, శ్రీలంకతో సిరీస్ ద్వారా వన్డే ఆరంగ్రేటం చేశాడు. తొలి వన్డే సిరీస్‌‌లోనే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన సూర్యకుమార్ యాదవ్‌కి ఇది సువర్ణ అవకాశమే...
undefined
తొలుత స్వింగ్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహార్‌లను ఇంగ్లాండ్ టూర్‌కి పంపాలని బీసీసీఐ భావించినప్పటికీ, వాళ్లిద్దరి ఫిట్‌నెస్‌పై అనుమానాలు రేగడంతో ఆ లిస్టులోకి పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్, జయంత్ యాదవ్ వచ్చారు.
undefined
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరుపున ఆడుతున్న జయంత్ యాదవ్‌ను స్పిన్ ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఆడించాలని భావిస్తోంది టీమ్ మేనేజ్‌మెంట్...
undefined
‘పృథ్వీసా, జయంత్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్‌ ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లబోతున్నారు. అయితే శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ ముగిసిన తర్వాతే వీళ్లు ఇంగ్లాండ్‌కి వెళ్తారు... త్వరలో అధికారిక ప్రకటన వస్తుంది...’ అంటూ తెలిపారు బీసీసీఐ అధికారి..
undefined
టీమిండియా తరుపున 2016లో టెస్టు ఎంట్రీ ఇచ్చిన జయంత్ యాదవ్, 4 టెస్టుల్లో 228 పరుగులు చేసి 11 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ కూడా ఉండం విశేషం.
undefined
9వ స్థానంలో వచ్చి విరాట్ కోహ్లీకి కలిసి 241 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి సెంచరీ చేసిన మొదటి భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన జయంత్ యాదవ్, ఆ తర్వాత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
undefined
click me!