ట్రావిస్ హెడ్ : ప్రస్తుతం ఐపిఎల్ లో అత్యంత ప్రమాదకరమైన జట్టు ఏదంటే టక్కున సన్ రైజర్స్ హైదరాబాద్ పేరు వినిపిస్తోంది... మరి భయంకరమైన ప్లేయర్ అనగానే ట్రావిస్ హెడ్ పేరు వినిపిస్తుంది. ఈ ఆస్ట్రేలియన్ క్రికెటర్ గత ఐపిఎల్ లో చేసిన విధ్వంసాన్ని చూసాం... అది మామూలు మాస్ ఆట కాదు. కానీ ఈ సీజన్ లో హెడ్ మరింత ఊరమాస్ గా కనిపిస్తున్నాడు. బౌలర్ బంతివేసిందే తడవు అది బౌండరీలైన్ అవతల ఉంచడమే ఇతడికి తెలిసింది. ఈ హెడ్ క్రీజులో ఉన్నంతసేపు ప్రత్యర్ధి టీంకు హెడెక్ తప్పదు.
మీరు చాలామంది విధ్వంసకర ఓపెనర్లను చూసుంటారు.... హెడ్ తీరే వేరు. క్రీజులో అడుగుపెట్టగానే బాదుడు ప్రారంభిస్తాడు... కుదురుకోవడం, ప్రత్యర్థుల బౌలింగ్ ను అర్థం చేసుకోవడం ఇవేం ఉండవు. బంతి వచ్చింది.... దాన్ని బౌండరీకి తరలించామా.. పరుగులు వచ్చాయి ఇదే లెక్క. బంతి వచ్చింది, కొట్టాడు, వెళ్లింది.. మళ్ళీ వచ్చింది, కొట్టాడు, వెళ్ళింది. అతడు ఉన్నంతసేపు ఇదు పరిస్థితి.
హెడ్ హిటింగ్ బౌలర్లను భయపెడితే ఫ్యాన్స్ కు మాత్రం కిక్ ఇస్తుంది. హెడ్ ఆరంభంలోనే పరుగుల సునామీ సృష్టిస్తే మిగతా టీం దాన్ని కొనసాగిస్తుంది. అందువల్లే హైదరాబాద్ టీం ఐపిఎల్ లో హయ్యెస్ట్ రన్స్ రికార్డులు నమోదుచేస్తోంది. వారి రికార్డులు వారే బద్దలుగొట్టుకుంటున్నారు.