టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్టే! బుమ్రా అయినా భువీ అయినా... టీ20 వరల్డ్ కప్‌లోనూ...

First Published Sep 26, 2022, 6:19 PM IST

క్రికెట్‌లో పిచ్, వాతావరణ పరిస్థితులు, టాస్... ఇలా చాలా విషయాలు మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేస్తాయి. అయితే ఇందులో టాస్ ప్రభావం ఎంత? అనే దాని గురించి చాలా చర్చ జరిగింది. టీ20లకు ముందు టాస్, ఆటను కేవలం 5-10 శాతం మాత్రమే ప్రభావితం చేసేది. అయితే ఇప్పుడు సీన్ మారింది...

యూఏఈ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో టాస్ గెలిచిన జట్లే మెజారిటీ మ్యాచుల్లో గెలిచాయి. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ప్రతీ జట్టు, లక్ష్యాన్ని ఛేదించి విజయ ఢంకా మోగించింది. ఆఫ్ఘాన్, స్కాట్లాండ్ వంటి చిన్న జట్లు మాత్రమే టాస్‌ని సరిగా వినియోగించుకోలేకపోయాయి...

ఆ తర్వాత ఏడాది జరిగిన ఆసియా కప్ 2022 టోర్నీలోనూ టాస్ కీలక పాత్ర పోషించింది. గ్రూప్ స్టేజీ నుంచి ఫైనల్ మ్యాచ్‌ వరకూ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న జట్లే విజయాలు అందుకున్నాయి. ఇందులోనూ హంకాంగ్, ఆఫ్ఘాన్ మాత్రమే టాస్ ఫ్యాక్టర్‌ని సరిగ్గా వాడుకోలేకపోయాయి...

ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నప్పటికీ పాకిస్తాన్, పరాజయం చెందింది. అక్కడ పిచ్ కంటే ఫైనల్ ఫోబియా పాకిస్తాన్‌ని తీవ్రంగా దెబ్బ తీసింది. ఇప్పుడు స్వదేశంలో ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరిగిన టీ20 సిరీస్‌లోనూ ఇదే జరిగింది...

తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఊదేయగా ఆ తర్వాత రెండు మ్యాచుల్లో రోహిత్ శర్మ టాస్ గెలవడంతో భారత జట్టును విజయం వరించింది. లేదంటే సీన్ మారిపోయి ఉండేది...

Team India

ఆసియా కప్ 2022 టోర్నీలో టాస్ ప్రభావం గురించి రోహిత్ శర్మ వాపోయాడు. టాస్ గెలిచిన టీమ్స్‌యే మ్యాచులు గెలుస్తూ ఉంటే... ఇంక ఆడడం ఎందుకనట్టుగా నిరాశ వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్‌లో టాస్ ఎంతవరకు ప్రభావం చూపిస్తుందనే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది...

టాస్ గెలిచి జట్టు ఫీల్డింగ్ ఎంచుకుని, 200+ పరుగుల లక్ష్యాన్ని కూడా ఈజీగా ఛేదిస్తూ ఉంటే... బౌలర్లకు పెద్దగా పని ఉండదు. ఇప్పటికే బాల్‌పై బంతి ఆధిక్యం పెరిగింది. ఇప్పుడు టాస్ కూడా కీ ఫ్యాక్టర్‌గా మారితే... బుమ్రా, భువనేశ్వర్ కుమార్ కూడా 50+ పరుగులు సమర్పించుకోవడం తప్ప చేసేదేమీ ఉండదు...

click me!