1983లో ఓరియో ‘బిస్కెట్’ లేదు కదా ధోనీ... గౌతమ్ గంభీర్ నిజంగానే ఇలాంటి ట్వీట్ చేశాడా...

First Published Sep 26, 2022, 4:09 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చేసిన ‘బిస్కెట్’ ప్రమోషన్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వర్షం ఆగడం లేదు. గత ఏడాది టీ20 వరల్డ్ కప్ టోర్నీకి మెంటర్‌గా వ్యవహరించి, కెప్టెన్‌గా ఐసీసీ టైటిల్ గెలవాలనే విరాట్ కోహ్లీ ఆశలపై నీళ్లు చల్లిన మాహీ.. ఈసారి క్రేజీ లెవెల్లో ప్రమోషన్ చేద్దామని ప్రయత్నించి ట్రోలర్స్‌కి టార్గెట్ అయ్యాడు...

2011లో ఇండియాలో ఓరియో లాంఛ్ అయ్యింది, అదే ఏడాది భారత జట్టు వరల్డ్ కప్ గెలిచింది... అంటూ ‘ఓరియో’ బిస్కెట్ కుక్కీస్ ప్రమోషన్ ఈవెంట్‌లో పదే పదే చెప్పాడు మహేంద్ర సింగ్ ధోనీ. బ్రాండ్ ప్రమోషన్‌ని మరో స్థాయికి తీసుకెళ్లాలని మాహీ చూపించిన అత్యుత్సాహాం, ఫ్యాన్స్‌కి తీవ్రంగా హార్ట్ అయ్యేలా చేసింది...

Image Credit: Getty Images

2011 వన్డే వరల్డ్ కప్‌ టోర్నీలో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్ వంటి ప్లేయర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా యువీ, క్యాన్సర్‌ని కూడా లెక్కచేయకుండా ఆడి ‘మ్యాన్ ఆఫ్ సిరీస్’ గెలిచాడు...

Latest Videos


ఫైనల్ మ్యాచ్‌లో టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ వికెట్లను త్వరగా కోల్పోయిన తర్వాత గౌతమ్ గంభీర్ 97 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీ రోల్ పోషించాడు. ఆ తర్వాత మాహీ 91 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించాడు. 

ఇవన్నీ పక్కనబెట్టి, వీళ్ల క్రెడిట్‌ని కొట్టేసి... ‘ఓరియో’ లాంఛ్ అవ్వడం వల్లే టీమిండియా వరల్డ్ కప్ గెలిచిందనేలా ధోనీ చేసిన కామెంట్లు అభిమానులను ఆశ్చర్యపరిచాయి...

తాజాగా మాహీ చేసిన ప్రమోషన్‌పై గౌతమ్ గంభీర్ స్పందించాడంటూ ఓ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘1983లో ఇండియాలో ఓరియో లాంఛ్ అవ్వలేదు కదా ధోనీ... #JustAsking’ అంటూ గౌతమ్ గంభీర్ పేరుతో ఉన్న ఓ ట్వీట్టర్ అకౌంట్ పోస్టు చేసింది. అయితే అది గౌతీ ఒరిజినల్ అకౌంట్ కాదు, ఫేక్ అకౌంట్...

చేసింది గౌతమ్ గంభీర్ కాదని తెలిసినా... ఆ ట్వీట్‌లో వాస్తవం ఉండడంతో దాన్ని పట్టుకుని మాహీని మరోసారి ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియా జనాలు. 2007లో టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఏ ‘బిస్కెట్’ లాంఛ్ అయ్యిందో కూడా చెప్పాలంటూ మాహీని కోరుతున్నారు...

Image credit: MS DhoniFacebook

మరికొందరైతే ఆస్ట్రేలియాపై మూడో టీ20లో టీమిండియా గెలవడానికి కూడా ఓరియోనే కారణమంటున్నారు. ‘ఈరోజు మ్యాచ్ ఎందుకు గెలిచామో తెలుసా... ఓరియో లాంఛ్ అయ్యింది కాబట్టి’ అంటూ మాహీని ట్రోల్ చేస్తూ మీమ్స్ వైరల్ చేస్తున్నారు. 2020 ఐపీఎల్ సమయంలో కుర్రాళ్లల్లో స్పార్క్ లేదని ట్రోల్స్ ఎదుర్కొన్న మహేంద్రుడు, చాలారోజుల తర్వాత మళ్లీ మీమర్స్‌కి టార్గెట్ అయ్యాడు..

click me!