రాబోయే ఏడేళ్లు కూడా ప్రతీ ఏడాది ఒక్కో ఐసీసీ టోర్నీ జరగబోతోంది. వచ్చే ఏడాది యూఎస్‌ఏ, వెస్టిండీస్ వేదికగా టీ20 వరల్డ్ కప్ టోర్నీ జరగబోతోంది. ఇప్పటికే 2024 టీ20 వరల్డ్ కప్ వేదికలు షార్ట్ లిస్ట్ కాగా, షెడ్యూల్ కూడా ఖరారైపోయింది..
India vs Pakistan Toss
2025లో పాకిస్తాన్‌లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. 2017 తర్వాత ఆగిపోయిన ఛాంపియన్స్ ట్రోఫీ మళ్లీ 8 ఏళ్లకు తిరిగి ప్రారంభం కానుంది. పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సిన ఈ మెగా టోర్నీ, అక్కడే జరుగుతుందా? లేదా తటస్థ వేదికపై జరుగుతుందా? అనేది ఇప్పటికైతే సస్పెన్సే..
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ పాయింట్ల పట్టికలో టాప్ 7లో నిలిచిన జట్లు, నేరుగా ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తాయని ఐసీసీ ఖరారు చేసింది ఐసీసీ. ఆతిథ్య పాకిస్తాన్‌తో కలిసి మొత్తంగా 8 జట్లు, ఛాంపియన్స్ ట్రోఫీకి నేరుగా క్వాలిఫై అవుతాయి..
ప్రస్తుతం ఇంగ్లాండ్, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. మిగిలిన మూడు మ్యాచుల్లో గెలిస్తే ఇంగ్లాండ్, టాప్ 7లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం క్వాలిఫైయర్స్ ఆడక తప్పని పరిస్థితి..
Netherlands vs Bangladesh
క్వాలిఫైయర్స్ నుంచి వచ్చిన శ్రీలంక, మొదటి 5 మ్యాచుల్లో 2 విజయాలు అందుకుంటే, నెదర్లాండ్స్ 6 మ్యాచుల్లో 2 విజయాలు అందుకుంది. ఈ రెండూ మరో రెండు విజయాలు అందుకుంటే... టాప్ 7లో ముగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి..
పాకిస్తాన్‌లో జరగాల్సిన 2023 ఆసియా కప్, హైబ్రీడ్ మోడల్‌లో పాక్, శ్రీలంక దేశాల్లో జరిగింది. మరి 2025 ఛాంపియన్స్ ట్రోఫీ అయినా పాకిస్తాన్‌లో జరుగుతుందా? జరిగితే ఇండియా, పాకిస్తాన్‌లో అడుగు పెడుతుందా? 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత వీటి గురించి చర్చ మొదలవుతుంది.