బాబర్ ఆజమ్ నెం.1 బ్యాటర్ ఎలా అయ్యాడో అర్థం కావట్లే! దానికోసమే కోసం ఆడుతున్నాడు - వీరేంద్ర సెహ్వాగ్...

Published : Oct 29, 2023, 04:27 PM IST

ఐసీసీ నెం.1 వన్డే బ్యాటర్‌ స్టేటస్‌ని కొన్ని నెలలుగా అనుభవిస్తున్నాడు బాబర్ ఆజమ్. నేపాల్, నెదర్లాండ్స్, శ్రీలంక, జింబాబ్వే వంటి అసోసియేట్ దేశాలతో చెలరేగిపోయే బాబర్ ఆజమ్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో వరుసగా మూడు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు బాదాడు..

PREV
18
బాబర్ ఆజమ్ నెం.1 బ్యాటర్ ఎలా అయ్యాడో అర్థం కావట్లే! దానికోసమే కోసం ఆడుతున్నాడు - వీరేంద్ర సెహ్వాగ్...
Babar Azam

ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న శుబ్‌మన్ గిల్, నెం.1 ర్యాంకుకి చాలా చేరువగా వచ్చిన తర్వాత ఫెయిల్ అవుతున్నాడు. దీంతో నెం.1 ర్యాంకులో ఉన్న బాబర్ ఆజమ్, తన ర్యాంకును కాపాడుకోగలుగుతున్నాడు..

28
Babar Azam

‘బాబర్ ఆజమ్ కెప్టెన్సీ, అతని బ్యాటింగ్ ఏదీ నాకు కరెక్టుగా ఉన్నట్టు కనిపించడం లేదు. గత ఆరు మ్యాచుల్లో అతను మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. అతను నెం.1 వన్డే బ్యాటర్‌గా ఎందుకు ఉన్నాడో నాకైతే అర్థం కావడం లేదు..
 

38
Babar Azam

గత రెండేళ్లలో బాబర్ ఆజమ్ ఎన్నో పరుగులు చేశాడు. 19 సెంచరీలు బాదాడు. అయితే అతని రికార్డులు, ర్యాంకింగ్స్ అన్నీ కూడా ఓవర్ రేటేడ్. నెం.1 ప్లేయర్‌కి ఉండాల్సిన అర్హతలు ఏవీ బాబర్ ఆజమ్‌లో నాకు కనిపించడం లేదు..

48
Babar Azam

గొప్ప ప్లేయర్ అనేవాడు పరుగులు చేయడమే కాదు,  మ్యాచులను గెలిపించగలగాలి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఒంటి చేత్తో మ్యాచులు గెలిపించారు.

58

బాబర్ ఆజమ్ మూడు సార్లు 50+ స్కోర్లు చేస్తే, పాకిస్తాన్ మాత్రం ఒకే ఒక్కసారి 300+ స్కోరు దాటగలిగింది..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్..
 

68

‘పాకిస్తాన్ వెంటవెంటనే 2 వికెట్లు కోల్పోయిన తర్వాత బాధ్యతగా ఆడి, ఇన్నింగ్స్ నిర్మించాల్సిన బాధ్యత బాబర్ ఆజమ్ చేతుల్లో ఉంటుంది. నెం.3 బ్యాటర్ 50 చేసిన తర్వాత దాన్ని సెంచరీగా మార్చడానికి చూస్తాడు..
 

78

బాబర్ ఆజమ్ కూడా చాలా సార్లు ఇలా చేశాడు. అయితే అవన్నీ కూడా చిన్న చిన్న జట్లపైనే వచ్చాయి. మరికొన్ని పాకిస్తాన్‌లో ఆడిన మ్యాచుల్లోనే వచ్చాయి... 

88

బాబర్ ఆజమ్ ఆట చూస్తుంటే అతను నెం.1 ర్యాంకును కాపాడుకోవడానికి మాత్రమే ఆడుతున్నట్టుగా ఉంది..’ అంటూ కామెంట్లు చేశాడు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. 
 

click me!

Recommended Stories