సెమీస్ గురించి, ఫైనల్ గురించి ఆలోచించి ఆడకండి! టీమిండియాకి సునీల్ గవాస్కర్ సలహా..

First Published | Oct 29, 2023, 5:18 PM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచిన ఏకైక జట్టుగా నిలిచింది టీమిండియా. మరో మ్యాచ్ గెలిస్తే టీమిండియా సెమీ ఫైనల్ బెర్త్ దాదాపు కన్ఫార్మ్ అయిపోతుంది. అయితే టీమిండియా ఇప్పటిదాకా గెలిచిన మ్యాచులన్నీ ఛేదించి గెలిచినవే..
 

‘ప్రతీ ఒక్కరికీ గెలవడమే కావాలి. అయితే సెమీస్, ఫైనల్ గురించి ఆలోచిస్తూ బుర్రలు బద్ధలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కో మ్యాచ్ గురించి ఆలోచిస్తూ ముందుకు వెళితే మంచిది..
 

తర్వాతి మ్యాచ్ ఎలా గెలవాలనేది మాత్రమే ఆలోచించాలి. నాకౌట్ మ్యాచుల్లో ఎలా ఆడాలి? ఎలా గెలవాలనే విషయాల గురించి అతిగా ఆలోచిస్తే రిజల్ట్ తేడా కొట్టేస్తుంది. ప్రెషర్ పెరిగిపోతుంది..
 

Latest Videos


ఇంగ్లాండ్ జట్టు, వన్డే వరల్డ్ కప్‌ 2023 టోర్నీని సరిగ్గా మొదలెట్టలేకపోయింది. ఆ టీమ్‌లో ఏ బ్యాటర్ కూడా సరైన ఫామ్‌లో లేడు. మొదటి 10 ఓవర్లలో రెండు వికెట్లు తీస్తే చాలు, ఇంగ్లాండ్‌ని ప్రెషర్‌లోకి నెట్టేయొచ్చు...
 

సౌతాఫ్రికా, న్యూజిలాండ్ విషయంలోనూ అంతే. ఏ టీమ్‌తో ఆడుతుంటే, దానికి తగ్గట్టుగా ప్లాన్స్ మార్చుకుంటూ ముందుకు సాగాలి.. అప్పుడే అనుకున్న రిజల్ట్ వస్తుంది..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్..
 

2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత 2015, 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో సెమీ ఫైనల్‌లో ఓడింది భారత జట్టు. అయితే ఈసారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా, ప్రపంచ కప్ గెలిచి తీరుతుందని బలంగా నమ్ముతున్నారు ఫ్యాన్స్.. 

click me!