
ఐపీఎల్ అంటేనే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత క్రేజ్ ఉన్న ఈ టీ20 లీగ్ ఎంతో మంది గ్రేటెస్ట్ మ్యాచ్ విన్నర్లను మనకు పరిచయం చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ లాంటి లెజెండరీ క్రికెటర్లు ప్రెషర్ సిట్యుయేషన్స్‌లో అద్భుతమైన పర్ఫార్మెన్స్‌లు ఇచ్చారు.
తమ టీమ్స్‌కు సూపర్ విక్టరీలను అందించారు. అదిరిపోయే సెంచరీలు బ్యాటర్లు, మ్యాచ్‌లను మలుపు తిప్పే బౌలింగ్ స్పెల్స్‌తో బౌలర్లు ఐపీఎల్ హిస్టరీలోనే కన్సిస్టెంట్‌గా డామినేట్ చేస్తూ వస్తున్నారు. మరి ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక సార్లు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులు సొంతం చేసుకున్న ఆ టాప్ 5 ప్లేయర్స్ ఎవరు? వారి రికార్డులు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధికంగా 25 సార్లు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులు గెలుచుకుని సౌతాఫ్రికా సూపర్ స్టార్ ఏబీ డివిలియర్స్ టాప్ లో నిలిచాడు. డివిలియర్స్ 2008 నుంచి 2021 మధ్య ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ తరఫున మొత్తం 184 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు.
తన సరికొత్త షాట్లతో, మ్యాచ్‌లను ఒంటిచేత్తో ముగించే ఫినిషింగ్ స్కిల్స్‌తో మిస్టర్ 360గా పేరు తెచ్చుకున్న ఏబీడీ.. ఐపీఎల్‌లో 39.71 సగటుతో 5,162 రన్స్ స్కోర్ చేశాడు. 2015లో ముంబై ఇండియన్స్‌పై కేవలం 59 బాల్స్‌లోనే 133 రన్స్ బాదిన ఇన్నింగ్స్ ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ ఐకానిక్ ఇన్నింగ్స్‌గా నిలిచిపోయింది. అతని కన్సిస్టెన్సీ, మ్యాచ్ విన్నింగ్ ఎబిలిటీ అతన్ని ఐపీఎల్ హిస్టరీలోనే గ్రేటెస్ట్ ఎంటర్‌టైనర్‌గా మార్చాయి.
వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ 22 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులతో ఈ లిస్ట్‌లో రెండో స్థానంలో ఉన్నాడు. గేల్ 2009 నుంచి 2021 వరకు కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ తరఫున ఆడాడు.
ఐపీఎల్‌లో 39.72 యావరేజ్‌తో 4,965 రన్స్ చేశాడు. లీగ్‌లోనే మోస్ట్ ఫియర్డ్ హిట్టర్‌గా గేల్ పేరు తెచ్చుకున్నాడు. 2013లో పూణే వారియర్స్ ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో గేల్ కేవలం 66 బాల్స్‌లో నాటౌట్‌గా చేసిన 175 రన్స్ రికార్డు.. ఇప్పటికీ ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉంది. టీ20 క్రికెట్ హిస్టరీలోనే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ నాక్ అని చెప్పాలి.
టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ తన ఐపీఎల్ కెరీర్ మొత్తంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కు మాత్రమే ఆడుతూ 21 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు. కోహ్లీ ఇప్పటివరకు 280కి పైగా మ్యాచ్‌లు ఆడి, 9,200 కంటే ఎక్కువ రన్స్‌తో ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్‌గా టాప్‌లో కొనసాగుతున్నాడు.
ఈ టోర్నమెంట్‌లో 9,000 రన్స్ మార్కును దాటిన మొదటి బ్యాటర్ కూడా కోహ్లీనే. విరాట్ కన్సిస్టెన్సీ, ఛేజింగ్ పవర్, లీడర్‌షిప్ క్వాలిటీస్ అతన్ని ఐపీఎల్ గ్రేటెస్ట్ ఐకాన్‌గా మార్చాయి. టఫ్ ఛేజింగ్స్‌లో టీమ్‌ను ముందుండి నడిపించడం, మ్యాచ్ విన్నింగ్ సెంచరీలు చేయడంలో కోహ్లీ ఎప్పుడూ ముందే ఉంటాడు.
ఐపీఎల్‌లో 21 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్న రోహిత్ శర్మ, ఈ లీగ్‌లోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్లలో ఒకడిగా, బెస్ట్ బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. రోహిత్ మొదట డెక్కన్ చార్జర్స్ టీమ్‌కు ఆడాడు, ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌కు లెజెండ్‌గా మారిపోయాడు.
మొత్తం 279 మ్యాచ్‌ల్లో 7,300 కంటే ఎక్కువ రన్స్ చేశాడు. ఇందులో 109 నాటౌట్ అతని హయ్యెస్ట్ స్కోర్. రోహిత్ క్లాసిక్ షాట్లకు, ప్రెషర్ టైమ్‌లో కూల్‌గా ఉంటూ టీమ్‌ను నడిపించే కెప్టెన్సీకి అభిమానులు ఫిదా అవుతారు. రోహిత్ కెప్టెన్సీలోనే ముంబై ఇండియన్స్ టీమ్ ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ డామినేటింగ్ టీమ్‌గా మారి అత్యధిక టైటిళ్లను గెలిచిన టీమ్ గా నిలిచింది.