IPL 2026 Playoff: ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన బెంగళూరు.. పంజాబ్ కొంపముంచిన ఓటమి, చెన్నైకి బూస్ట్!

Published : May 18, 2026, 07:21 AM IST

IPL 2026 Playoff Scenario: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా ఆర్సీబీ రికార్డ్ సాధించింది. శ్రేయాస్ అయ్యర్ టీమ్ పంజాబ్ ఓటమితో చెన్నై, రాజస్థాన్ జట్లకు ప్లేఆఫ్స్ అవకాశాలు పెరిగాయి.

PREV
15
ప్లేఆఫ్స్ చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సత్తా చాటింది. ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరిన మొదటి జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీ.. ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌ల్లో 9 మ్యాచ్‌లు గెలిచి టాప్-4లో తన స్థానాన్ని పక్కా చేసుకుంది. 

గ్రూప్ స్టేజ్‌లో బెంగళూరు తన చివరి మ్యాచ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడనుంది. ప్రస్తుత ఫామ్ చూస్తుంటే పాయింట్ల పట్టికలో ఆర్సీబీ టాప్-2లో ముగించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.

25
పంజాబ్‌కు షాక్.. శ్రేయాస్ అయ్యర్ టెన్షన్

ఆదివారం ధర్మశాలలో జరిగిన కీలక పోరులో పంజాబ్ కింగ్స్‌పై బెంగళూరు 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో పంజాబ్ కింగ్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వరుసగా 6 మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టెన్షన్ పీక్స్‌కు చేరింది.

ఇప్పుడు పంజాబ్ కింగ్స్ భవిష్యత్తు వారి చేతుల్లో లేదు. పంజాబ్ తన చివరి మ్యాచ్ గెలిచినా కూడా 15 పాయింట్లకు మాత్రమే చేరుకుంటుంది. మరి ఈ పాయింట్లు ప్లేఆఫ్స్‌కు సరిపోతాయా లేదా అనేది మిగిలిన జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.

35
సీఎస్కే, రాజస్థాన్ జట్లకు లక్ కుదిరింది

బెంగళూరు చేతిలో పంజాబ్ కింగ్స్ ఓడిపోవడం చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లకు బాగా కలిసి వచ్చింది. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇది ఒక లైఫ్ లైన్ అని చెప్పాలి. ప్రస్తుతం చెన్నై ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి. 

సీఎస్కే ఆడబోయే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే ఈజీగా 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ రేసులో ముందుంటారు. కానీ పంజాబ్ మాత్రం చివరి మ్యాచ్ గెలిచినా 15 పాయింట్లే వస్తాయి కాబట్టి, టాప్-4 రేసులో పంజాబ్ అవకాశాలు తక్కువే. చెన్నైకి ఛాన్స్ పెరిగింది.

45
రేసులో ఎవరున్నారు? ఎవరు అవుట్?

ఈ సీజన్ ప్లేఆఫ్స్ లెక్కలు చూస్తే.. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుండి తప్పుకున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు ఇంకా ఆశలు ఉన్నప్పటికీ, వారు ముందుకు వెళ్లాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే. 

ప్రస్తుతానికి ప్లేఆఫ్స్‌లో మిగిలిన 3 స్థానాల కోసం 5 జట్ల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ రేసులో ఉన్నాయి.

55
రాబోయే రోజుల్లో అసలైన తడాఖా

బెంగళూరు సీటు కన్ఫర్మ్ కావడంతో మిగిలిన మూడు సీట్ల కోసం అసలైన ఫైట్ మొదలైంది. ఐపీఎల్ 2026లో రాబోయే రెండు, మూడు రోజులు క్రికెట్ అభిమానులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ. జరిగే ప్రతి మ్యాచ్ ఫలితం ప్లేఆఫ్స్ సమీకరణాలను పూర్తిగా మార్చేసేలా ఉంది. ప్రస్తుతానికైతే బెంగళూరుతో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ రేసులో ముందంజలో ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories