Virat Kohli, RohitSharma, Gill
1. విరాట్ కోహ్లీ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2024 సీజన్ లో కూడా పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ సీజన్ లో ఒక సెంచరీ కొట్టి కింగ్ కోహ్లీ మొత్తంగా ఐపీఎల్ లో 9 సెంచరీ లు సాధించి టాప్ ప్లేస్ లో ఉన్నాడు.
Rohit Sharma
2. రోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఇప్పటివరకు ఐపీఎల్ లో 8 సెంచరీలు సాధించి అత్యధిక సెంచరీల లిస్టులో రెండో స్థానంలో ఉన్నాడు. అయితే, ఐపీఎల్ 2024 సీజన్ హిట్ మ్యాన్ కు అంతగా కలిసి రాలేదు.
3. రుతురాజ్ గైక్వాడ్ఎంఎస్ ధోని నుంచి చెన్నై కెప్టెన్సీ తీసుకున్న తర్వాత రుతురాజ్ గైక్వాడ్ మరింతగా రెచ్చిపోతూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఐపీఎల్ 2024 లో ఇప్పటికే ఒక సెంచరీ కొట్టిన గైక్వాడ్.. ఇప్పటివరకు ఐపీఎల్ లో మొత్తంగా 6 సెంచరీలు బాదాడు. ఈ లిస్టులో 3వ స్థానంలో ఉన్నాడు.
4. కేఎల్ రాహుల్
ఐపీఎల్ 2024 లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ ఈ సీజన్ లో కూడా మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఐపీఎల్ 2024 లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల లిస్టులో 7వ స్థానంలో ఉన్నాడు. కేఎల్ రాహుల్ మొత్తం ఐపీఎల్ లో 6 సెంచరీలు సాధించాడు.
5. శుభ్ మన్ గిల్
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ గత సీజన్ లో అదరిపోయే ఇన్నింగ్స్ లు ఆడాడు. ఈ సీజన్ లో నెమ్మదిగా ప్రారంభం ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో తుఫాను ఇన్నింగ్స్ తో కేవలం 50 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. మొత్తంగా తన ఐపీఎల్ కెరీర్ లో ఇది 6వ సెంచరీ. గిల్ తో పాటు ముంబై ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ కూడా ఐపీఎల్ లో 6 సెంచరీలు సాధించాడు