ఐపీఎల్ లో రికార్డుల మోత మోగిస్తున్న ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ

First Published | May 10, 2024, 7:55 PM IST

Virat Kohli : ఐపీఎల్ 2024 లో ఆర్సీబీ స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. ప్రస్తుత  ఐపీఎల్ సీజ‌న్ లో కింగ్ కోహ్లీ ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడి మొత్తం 634 పరుగులు చేసి 4వ సారి ఐపీఎల్ లో 600 పరుగులు దాటిన రెండో ప్లేయ‌ర్ గా ఘ‌న‌త సాధించాడు.
 

భార‌త్ లో ఐపీఎల్ క్రికెట్ పండుగ సందడిగా సాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో మార్చి 22న ప్రారంభమైన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 2వ మ్యాచ్‌లో గెలిచిన ఆర్సీబీ  తర్వాతి 6 మ్యాచ్‌ల్లో వరుసగా ఓడిపోయి విమర్శల పాలైంది. స్టార్ ప్లేయ‌ర్లు ఉన్నా ఓట‌మిపాలు కావ‌డంపై క్రికెట్ ల‌వ‌ర్స్ సైతం విస్మ‌యానికి గుర‌య్యారు.

ఆ తర్వాత గత 3 మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ వరుసగా హ్యాట్రిక్‌ విజయాలు సాధించింది. ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 7 ఓటములతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల ప్రకారం విరాట్ కోహ్లీ 11 ఇన్నింగ్స్‌లు ఆడి 542 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ధ సెంచరీలు, సెంచరీలు సాధించాడు.


ఆ త‌ర్వాత పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన ఐపీఎల్ 58వ లీగ్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ దుమ్మురేపే ఇన్నింగ్స్ ఆడాడు. కేవ‌లం 47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 92 పరుగుల సూప‌ర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్ తో అనేక రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాడు. 

ఈ మ్యాచ్ తో ఐపీఎల్ 2024 లో 12 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ మొత్తం 634 పరుగులతో టాప్ స్కోర‌ర్ గా ఉన్నాడు. ఈ సీజన్‌లో 600కు పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా ఐపీఎల్ లీగ్ లో 4వ సారి 600కు పైగా పరుగులు సాధించాడు. గతంలో కేఎల్ రాహుల్ 4 సార్లు 600కి పైగా పరుగులు చేశాడు. 

అలాగే, క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్ 3 సార్లు 600 కంటే ఎక్కువ పరుగులు చేశారు. ఫాబ్ డు ప్లెసిస్ రెండుసార్లు 600కి పైగా పరుగులు చేశాడు. ఈ రికార్డులు మాత్ర‌మే కాకుండా విరాట్ కోహ్లీ పంజాబ్ కింగ్స్‌పై 1000 పరుగులు పూర్తి చేశాడు. 

పంజాబ్ టీమ్ తో పాటు చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జ‌ట్ల‌పై కూడా విరాట్ కోహ్లీ 1000 పైగా పరుగులు సాధించాడు. మొత్తంగా ఐపీఎల్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ర‌ఫున విరాట్ కోహ్లీ 7897 పరుగులు చేయడం విశేషం.

Latest Videos

click me!