ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్‌లో వీరి ఆట‌ను చూడాల్సిందే..

First Published | May 21, 2024, 7:42 PM IST

IPL 2024 : ఐపీఎల్ 2024లో కోల్ క‌తా, హైద‌రాబాద్, రాజ‌స్థాన్, బెంగ‌ళూరు జ‌ట్లు ప్లేఆఫ్‌కు అర్హత సాధించాయి. ప్ర‌స్తుతం ఐపీఎల్ లో అద్భుత‌మైన బ్యాటింగ్ తో అద‌ర‌గొడుతున్న ప్లేయర్లలో కింగ్ కోహ్లీ, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, సునీల్ నరైన్, రియన్ పరాగ్, సంజూ శాంసన్ ల ఆటను చూడాల్సిందే.. 

Photo Credit: X@KKRiders, @RCBTweets, @SunRisers (Sunil Narine,Virat Kohli, Abhishek Sharma, IPL 2024)

IPL 2024 :  ఐపీఎల్ 2024 లో లీగ్ మ్యాచ్‌లు ముగిసిన త‌ర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు టోర్నీలో నాకౌట్ దశకు చేరుకున్నాయి. క్వాలిఫయర్-1లో టాప్ లో ఉన్న‌ కోల్‌కతా నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్‌తో తలపడనుంది. బుధవారం అదే వేదికపై రాజస్థాన్, బెంగళూరు ఎలిమినేటర్‌లో తలపడనున్నాయి. అయితే, నాకౌట్ మ్యాచ్‌లలో సునామీ ఇన్నింగ్స్ లు ఆడ‌టానికి సిద్ధంగా ఉన్న ఈ ఐదురుగు ప్లేయ‌ర్ల ఆట‌ను చూడాల్సిందే..!

1. విరాట్ కోహ్లీ

టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ ప్ర‌స్తుతం ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. గ‌తేడాది వన్డే ప్రపంచకప్ నుంచి అద్భుతమైన ఫామ్ లో ఉన్న ఈ స్టార్ ప్లేయ‌ర్.. ఐపీఎల్ టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. ప్ర‌స్తుత ఐపీఎల్ 2024 లోనూ అద్భుత‌మైన ఫామ్ తో ఉన్న కోహ్లీ.. 14 మ్యాచ్ ల్లో ఐదు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీతో సహా 708 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్ లో ఉన్నాడు. ఆర్సీబీ బ్యాటింగ్ విభాగానికి వెన్నెముకగా నిలిచాడు.


2. అభిషేక్ శ‌ర్మ‌

స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ర‌ఫున ఆడుతున్న ఈ యంగ్ ప్లేయ‌ర్ త‌న భీక‌ర ఫామ్ తో ప్రత్య‌ర్థి బౌల‌ర్ల‌ను చెడుగుడు ఆడుకుంటున్నాడు. 23 ఏళ్ల ఓపెనర్ అభిషేక్ శర్మ రాబోయే సంవత్సరాల్లో భారత టీ20 జట్టులో కీలక పాత్ర పోషించే టాలెంట్,  త‌న స‌త్తాను ఐపీఎల్ 2024 చూపించాడు. హైదరాబాద్ తరఫున 13 మ్యాచుల్లో 467 పరుగులు చేశాడు. ప్రస్తుత సీజన్ లో అభిషేక్ శర్మ మూడు హాఫ్ సెంచరీలు సాధించి 209.41 స్ట్రైక్ రేట్ తో పరుగులు చేశాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో 28 బంతుల్లో 66 పరుగులు చేసి పాయింట్ల పట్టికలో హైద‌రాబాద్ ను రెండో స్థానంలోకి తీసుకువ‌చ్చాడు.

3. ట్రావిస్ హెడ్

ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో అద్భుత‌మైన ఇన్నింగ్స్ లు ఆడి ఐపీఎల్ లోకి ఏంట్రీ ఇచ్చిన ఈ ఆస్ట్రేలియన్ స్ట్రార్ ప్ర‌స్తుత ఐపీఎల్ లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ర‌ఫున ఆడుతున్నాడు. ఈ సీజ‌న్ లో 12 మ్యాచ్ లు ఆడిన ట్రావిస్ హెడ్ 48.45 స‌గటు, 201.13 స్ట్రైక్ రేటుతో 533 ప‌రుగులు చేశాడు. ట్రావిస్ హెడ్ మొద‌టి 10 ఓవ‌ర్లు క్రీజులో వుంటే స‌న్ రైజ‌ర్స్ ను ఆప‌డం ప్ర‌త్య‌ర్థుల‌కు క‌ష్ట‌మే. 

Sunil Narine

4. సునీల్ నరైన్ 

వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ సునీల్‌ నరైన్ ఐపీఎల్ 2024 లో బ్యాటింగ్, బౌలింగ్ లో అద‌ర‌గొడుతూ కేకేఆర్ కు కీల‌క ప్లేయ‌ర్ గా మారాడు.  అత‌ను ఏ జట్టు తరఫున ఆడినా మ్యాచ్‌ బ్యాలెన్స్‌ని ఒంటిచేత్తో మార్చగల ప్లేయ‌ర్. 35 ఏళ్ల సునీల్ నరైన్ ఈ సీజన్‌ను అత్యంత సద్వినియోగం చేసుకుని ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలతో 461 పరుగులు చేశాడు. అలాగే, బౌలింగ్ విభాగంలో న‌రైన్ 13 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీశాడు.

5. రియాన్ ప‌రాగ్ 

2019లో అరంగేట్రం చేసినప్పటి నుండి రియాన్ పరాగ్ ప్ర‌తి సీజ‌న్ లో మెరుగ‌వుతున్నాడు. ఈ సీజన్ అత్యుత్తమంగా కొన‌సాగిస్తున్నాడు. రాజస్థాన్ తరఫున రియాన్ పరాగ్ 13 మ్యాచ్‌ల్లో నాలుగు హాఫ్ సెంచరీలతో సహా 531 పరుగులు చేశాడు. రియాన్ పరాగ్ సీజన్ అంతటా బ్యాట్‌తో నిలకడగా రాణిస్తున్నాడు. ఫ్రాంచైజీకి ముఖ్యమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఐపీఎల్ 2024 లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్ల జాబితాలో టాప్-4లో ఉన్నాడు. 

Latest Videos

click me!