బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ లో ఆస్ట్రేలియాను కంగారెత్తించే టాప్-5 భారత ప్లేయ‌ర్లు, వీరి ఆట‌ను చూడాల్సిందే

First Published | Sep 6, 2024, 3:44 PM IST

Border-Gavaskar Trophy: భారత్-ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక టెస్ట్ క్రికెట్ సిరీస్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ. మ‌రో 100 రోజులలోపు ప్రారంభం కానుంది. యాషెస్‌తో సమానమైన బ‌ల‌మైన పోటీ క‌నిపించే ఈ సిరీస్ లో స్టార్ సీనియ‌ర్ క్రికెట‌ర్ల‌తో పాటు యంగ్ ప్లేయ‌ర్లు భారత్‌ను ఉన్న‌త స్థితిలో ఉంచుతార‌ని సునీల్ గవాస్కర్ అన్నారు. 

Rohit Sharma, Virat Kohli, Yashasvi Jaiswal

Border-Gavaskar Trophy:  రాబోయే సీజ‌న్ లో భార‌త్ దాదాపు 10కి పైగా టెస్టు మ్యాచ్ ల‌ను ఆడ‌నుంది. బంగ్లాదేశ్, న్యూజిలాండ్ దేశాల‌తో టెస్టు సిరీస్ తో పాటు ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో త‌ల‌ప‌డ‌నుంది.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని యాషెస్‌తో సమానంగా చూస్తారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రతిష్టాత్మక టెస్ట్ క్రికెట్ సిరీస్ ఇంది. దీనికి క్రికెట్ లెజెండ్స్ అలన్ బోర్డర్-సునీల్ గవాస్కర్ పేరు పెట్టారు. టెస్ట్ సిరీస్ తీవ్రమైన పోటీని ప్రదర్శించడమే కాకుండా, టెస్టు క్రికెట్ లో ఆటగాళ్ల అద్భుతమైన నైపుణ్యాలను చూసే అవకాశాన్ని కల్పిస్తుంది. 

ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లతో ఇది రెండు దేశాల మధ్య తీవ్రమైన క్రికెట్ పోటీని చూపిస్తుంది. ఈ మెగా సిరీస్ కు 100 రోజుల కంటే తక్కువ సమయం ఉండటంతో ఇప్పటినుంచే క్రికెట్ వర్గాల్లో దీనిపై హాట్ హాట్ చర్చ సాగుతోంది. అయితే, ఈ సిరీస్ లో స్టార్ సీనియ‌ర్ క్రికెట‌ర్ల‌తో పాటు యంగ్ ప్లేయ‌ర్లు భారత్‌ను ఉన్న‌త స్థితిలో ఉంచుతార‌ని సునీల్ గవాస్కర్ అన్నారు. ఇందులో ఉన్న టాప్-5 ప్లేయ‌ర్ల‌ను గ‌మ‌నిస్తే.. 

Yashasvi Jaiswal

యశస్వి జైస్వాల్

ముంబైకి చెందిన ఈ యంగ్ ప్లేయ‌ర్ అద్బుత‌మైన ఆట‌తో భార‌త జ‌ట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. జ‌ట్టులోని మూడు ఫార్మాట్ల‌కు ఆడుతున్న జైస్వాల్.. టీ20, టెస్టు క్రికెట్ లో అద్భుతమైన ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చాడు. ప్రత్య‌ర్థి బౌలింగ్ పై ఆట ఆరంభం నుంచే ఎదురుదాడి చేయ‌గ‌ల క్రికెట‌ర్. 

ఇంగ్లండ్ జ‌రిగిన సిరీస్‌లో 700 పరుగులకు పైగా స్కోర్ చేసిన జైస్వాల్.. రాబోయే సిరీస్ ల‌తో పాటు ఆస్ట్రేలియాపై భార‌త్ ను పై చేయి సాధించే ఇన్నింగ్స్ ల‌ను ఆడాల‌ని చూస్తున్నాడు. 

Latest Videos


రిషబ్ పంత్

రిషబ్ పంత్ భారత జ‌ట్టులో కీల‌క‌మైన ప్లేయ‌ర్. టీమిండియా మిడిల్ ఆర్డర్‌కు స్థిరత్వాన్ని అందిస్తాడు. సిరీస్‌లో మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు భారత్ త్వరగా వికెట్లు కోల్పోతే అతని అటాకింగ్ విధానం జట్టుకు స‌హ‌కారం అందిస్తుంది. 

చాలా సార్లు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ల‌ను ఆడాడు. గ‌బ్బాలో 2021లో ఆస్ట్రేలియాపై ఆడిన‌ మ్యాచ్ విన్నింగ్ 89* ప‌రుగుల ఇన్నింగ్స్ భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో ఎప్ప‌టికీ గుర్తుంటుంది. ఈసారి కూడా రిషబ్ పంత్ అలాంటి అద్భుత‌మైన ఇన్నింగ్స్ ల‌ను ఆడాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నాడు.

Rohit Sharma, Jasprit Bumrah

జస్ప్రీత్ బుమ్రా

భార‌త ఫేస్ బౌలింగ్ అటాక్ భారాన్ని మోస్తున్న స్టార్ బౌల‌ర్ జస్ప్రీత్ బుమ్రా. ప్రస్తుతం ప్రపంచ అత్యుత్తమ ఆల్-ఫార్మాట్ బౌలర్. భార‌త్ కు అనేక అద్భుత‌మైన విజ‌యాలు అందించాడు. 

ఆస్ట్రేలియాతో ఈ టెస్టు సిరీస్‌ను భారత్ గెలవాలంటే జస్ప్రీత్ బుమ్రా భారీ పాత్ర పోషించాలి. అతని ఉనికి ఆస్ట్రేలియాలోని బౌన్స్ ట్రాక్‌లలో భారత్‌కు ఊపునిస్తుంది. కాబ‌ట్టి టీమిండియా బుమ్రాపై భారీ అంచ‌నాలే పెట్టుకుంది. అందుకే అత‌నికి కీల‌క మ్యాచ్ ల ముందు విశ్రాంతి ఇస్తున్నారు. 

విరాట్ కోహ్లీ

ర‌న్ విష‌న్ విరాట్ కోహ్లీ అంత‌ర్జాతీయ క్రికెట్ లో అనేక రికార్డులు సృష్టించాడు. ఆస్ట్రేలియాతో జ‌రిగిన అనేక మ్యాచ్ ల‌లో భార‌త్ ఒంటిచేత్తో విజ‌యాలు అందించాడు. బ‌ల‌మైన ఆసీస్‌పై 16 అంతర్జాతీయ సెంచరీలు సాధించిన ఆటగాడు విరాట్ కోహ్లి. 

కింగ్ కోహ్లి ఆస్ట్రేలియాతో ఆడినప్పుడు అత్యుత్తమ ప్రదర్శనలు ఇస్తుంటారు. రాబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కూడా మ‌రోసారి స‌త్తా చాటాల‌ని భార‌త్ కోరుకుంటోంది.

ఆసీస్ తో విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్ గణాంకాలు:

2011-2024 మధ్య కాలంలో విరాట్ కోహ్లీ కంగారు జట్టుతో 25 టెస్టు మ్యాచ్ లను ఆడాడు. 47.48 యావరేజ్ తో 2042 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 186 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోరు.  

Mayank Yadav

మయాంక్ యాదవ్

ప్ర‌స్తుతం భార‌త క్రికెట్ కు జస్ప్రీత్ బుమ్రా, మ‌హ్మ‌ద్ ష‌మీ, మ‌హ్మ‌ద్ సిరాజ్ ల‌తో కూడిన బ‌ల‌మైన ఫాస్ట్ బౌలింగ్ విభాగం ఉంది. వీరికి తోడుగా మ‌రో యంగ్ ప్లేయ‌ర్ భార‌త జ‌ట్టులోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. అతనే మయాంక్ యాదవ్. దేశవాళీ క్రికెట్ లో సత్తా చాటి అద్భుతమైన ప్రదర్శనలతో ఐపీఎల్ లోకి అడుగుపెట్టాడు. 

ఐపీఎల్ లో ఏకంగా 150 కిలో మీట‌ర్ల కంటే ఎక్కువ వేగంలో అద్భుత‌మైన బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో ఆక‌ట్టుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజ‌న్ లో అత్య‌ధిక వేగ‌వంత‌మైన టాప్-5 బంతులు వేసిన ఒకేఒక్క బౌల‌ర్ మ‌యాంక్ యాద‌వ్.

ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్ట్ సిరీస్‌లో ఎంపికయ్యే అవకాశం ఉన్న అగ్రశ్రేణి పోటీదారులలో మయాంక్ యాదవ్ ఒకడు. ఆస్ట్రేలియా బ్యాటర్లను ఇబ్బంది పెట్టే అతని రా పేస్ కారణంగా అతను భార‌త క్రికెట్ భ‌విష్య‌త్తుకు బ‌ల‌మైన ఫాస్ట్ బౌల‌ర్ గా మార‌గ‌ల‌డు. 

click me!