Bumrah-Shami-Siraj
IPL 2025 - Mayank Yadav : ప్రస్తుతం భారత క్రికెట్ కు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ లతో కూడిన బలమైన ఫాస్ట్ బౌలింగ్ విభాగం ఉంది. వీరికి తోడుగా మరో యంగ్ ప్లేయర్ భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. 150 కిలో మీటర్ల వేగం.. బుల్లెట్ల లాంటి బౌలింగ్ తో దేశవాళీ క్రికెట్ లో అదరగొట్టి ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఐపీఎల్ లో గత సీజన్ లో వేగవంతమైన బౌలింగ్ గణాంకాలను నమోదుచేసి ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. అతనే భారత క్రికెట్ భవిష్యత్ బౌలింగ్ స్పీడ్ గన్ మయాంక్ యాదవ్. మయాంక్ యాదవ్ ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) తరఫున ఆడాడు.
Mayank Yadav
తన మెరుపు వేగంతో కూడిన బౌలింగ్.. 150kmph వేగంతో డెలివరీల కచ్చితత్వంతో అదరగొట్టాడు. అతని బౌలింగ్ దెబ్బకు స్టార్ బ్యాటర్లు సైతం పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు.
అయితే, దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న మయాంక్ ఏప్రిల్ 30న ముంబై ఇండియన్స్‌తో లక్నోలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ తర్వాత ఏ పోటీ మ్యాచ్‌ల్లో పాల్గొనలేదు.
మయాంక్ గాయం, పొత్తికడుపు లోయర్ స్ట్రెయిన్ నొప్పితో బాధపడ్డాడు. ఐపీఎల్ 2024 ప్రారంభ భాగంలో గాయంతో బాధపడ్డాడు కానీ, ఆ తర్వాత కోలుకుని ఐపీఎల్ లో ఆడాడు. ఆ తర్వాత మరోసారి నొప్పి కారణంగా క్రికెట్ కు దూరం అయ్యాడు.
Mayank Yadav
అప్పటి నుండి, మయాంక్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో వైద్యుల బృందంతో కలిసి కోచ్ ల పర్యవేక్షణలో శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే, అతను దులీప్ ట్రోఫీకి ఎంపిక కాలేదు.
అలాగే, ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL)ని కూడా మిస్ అయ్యాడు. దీంతో అతని భవిష్యత్తు ప్రణాళికలు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.
Who is Mayank Yadav
మయాంక్‌ను ఈ స్థాయికి తీసుకువచ్చిన సొనెట్ క్లబ్ కోచ్ దేవేంద్ర శర్మ మాట్లాడుతూ.. ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ కు ఎన్సీఏ లో పూర్తి శిక్షణ షెడ్యూల్ ఉందని చెప్పాడు. గతంలో జస్ప్రీత్ బుమ్రా, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, ప్రసిద్ధ్ కృష్ణ, రిషబ్ పంత్‌లకు పునరావాస శిక్షణను అందించిన స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ రజనీకాంత్ శివజ్ఞానం పర్యవేక్షణలో మయాంక్ ఉన్నారు.
అందరూ ఆటగాళ్లలాగే అతను ప్రతి రోజూ ఉదయం కొంత సమయం బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తారు. తర్వాత పునరావాస సెషన్, వ్యాయామ దినచర్య ఉంటుంది. దీని తర్వాత, అతను మళ్లీ నెట్స్‌లో తన బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తారని కూడా తెలిపారు.
"అతను రోజూ ఎనిమిది-పది ఓవర్లు బౌలింగ్ చేస్తాడు. దులీప్ ట్రోఫీ స్క్వాడ్స్‌లో ఎందుకు పేరు పెట్టలేదని నేను అతనిని అడిగాను. దీనికి, మయాంక్ బదులిస్తూ 'సర్, నేను నా శరీరంపై ఎక్కువ భారం వేయలేను. వైట్-బాల్ క్రికెట్‌పై దృష్టి పెట్టలేను కాబట్టి దానిలోకి వెళ్లవద్దని అనుకున్నానని' దేవేంద్ర తెలిపినట్టు ఐఏఎన్ఎస్ నివేదించింది.
Mayank Yadav, Anrich Nortje
ఇప్పుడు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా ఉన్న భారత మాజీ పేసర్ టీఏ శేఖర్ మాట్లాడుతూ.. మయాంక్ బౌలింగ్ టెక్నిక్ తనను గాయపడేలా చేస్తుందని భావిస్తున్నారు. "అతనికి తక్కువ గాయాలు ఉండే విధంగా అతని టెక్నిక్ చక్కగా ట్యూన్ చేయబడాలి, ఎందుకంటే ఎవరైనా 156 kmph వేగంతో బౌలింగ్ చేస్తే సహజంగానే గాయాలు ఉంటాయి" అని అన్నారు.
అలాగే, అతనొక యంగ్ ప్లేయర్ అనీ, అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు, కానీ ఎక్కువ క్రికెట్ ఆడలేదు. కాబట్టి, వెంటనే అతన్ని టెస్ట్ మ్యాచ్‌లో ఉంచలేమని చెప్పారు. అక్కడ అతను 20 ఓవర్లు బౌలింగ్ చేస్తే అతను మళ్లీ గాయపడతాడు. కాబట్టి కొంత సమయం పొట్టి ఫార్మాట్ లోనే ఉంచాలని అన్నాడు.
అయితే, బెంగళూరులో కొంతమంది దులీప్ ట్రోఫీ కోసం ఆడుతున్న ప్లేయర్లు కు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో మయాంక్ యశస్వి జైస్వాల్‌కి బౌలింగ్ చేశాడు. ఇది ఈ ఫాస్ట్-బౌలర్ త్వరలో మైదానంలోకి వస్తాడనే ఆశ రేకెత్తించింది. "శుభవార్త ఏమిటంటే, మయాంక్ ప్రస్తుతం బౌలింగ్ చేస్తున్నాడు.
అతను ఎన్సీఏలో చాలా డెలివరీలను పంపుతున్నందున భవిష్యత్ జట్ల కోసం పరిగణించబడవచ్చు. ఎందుకంటే 'సర్ నేను ఫిట్‌గా, నొప్పి లేకుండా ఉన్నాను, అలాగే రోజూ ఎనిమిది నుండి పది ఓవర్లు బౌలింగ్ చేస్తాను' అని మాయాంక్ చెప్పాడు. రాబోయే సీజన్లలో మళ్లీ గ్రౌండ్ లోకి దిగుతాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను” అని దేవేంద్ర చెప్పారు.