బౌలింగ్-బ్యాటింగ్ లో అద‌ర‌గొట్టి బంగ్లాదేశ్ ను ఓడించిన భార‌త్ - హార్దిక్ పాండ్యా సూపర్ ఫినిష్

First Published Oct 6, 2024, 10:28 PM IST

IND vs BAN : భారత్-బంగ్లాదేశ్ మధ్య 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆదివారం (అక్టోబర్ 6) ప్రారంభమైంది. బౌలింగ్, బ్యాటింగ్ లో అద‌ర‌గొట్టిన భార‌త్ తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించింది. బౌలింగ్ లో రాణించిన హార్ధిక్ పాండ్యా సూపర్ బ్యాటింగ్ తో మ్యాచ్ ను ఫినిష్ చేశాడు.  
 

team India, cricket, IND

IND vs BAN : రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ముగిసిన త‌ర్వాత భార‌త్-బంగ్లాదేశ్ లు 3 టీ20 మ్యాచ్ ల సిరీస్ ను ఆడుతున్నాయి. ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో టెస్టు సిరీస్ ను సొంతం చేసుకున్న భార‌త్ జ‌ట్టు టీ20 సిరీస్ లో  కూడా శుభారంభం చేసింది. భారత్-బంగ్లాదేశ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ ఆదివారం జ‌రిగింది. తొలి మ్యాచ్ గ్వాలియర్‌లోని న్యూ మాధవరావు సింధియా క్రికెట్ స్టేడియంలో జ‌ర‌గ్గా.. భార‌త్ బ్యాటింగ్ బౌలింగ్ లో సూప‌ర్ షో చూపించింది. బంగ్లాదేశ్ కు ఎక్క‌డ కూడా ఛాన్స్ ఇవ్వ‌కుండా సూప‌ర్ విక్ట‌రీ అందుకుంది. 
 

team India, cricket, IND

టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ గ్వాలియర్‌లోని న్యూ మాధవరావు సింధియా క్రికెట్ స్టేడియంలో జరిగింది. ఈ మైదానంలో ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్‌. ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. టాస్ గెలిచిన కెప్టెన్ సూర్యకుమార్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 

దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్‌ను భారత్ 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ చేసింది. స్వ‌ల్ప ల‌క్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 11.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసి విజయం సాధించింది.

Latest Videos


team India, cricket, IND

భార‌త్ క‌ట్టుదిట్ట‌మైన బౌలింగ్

తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ టీమ్ ను భార‌త బౌల‌ర్లు పెద్ద‌గా ప‌రుగులు చేయ‌కుండా అడ్డుకున్నారు. నిప్పులు చెరిగే బౌలింగ్ లో అద‌ర‌గొట్టారు. దీంతో బంగ్లా టీమ్ 127 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. బంగ్లాదేశ్ తరఫున మెహదీ హసన్ మిరాజ్ అత్యధికంగా అజేయంగా 35 పరుగులు చేశాడు. కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో 27 పరుగులు చేశాడు. 

భారత్‌ తరఫున అర్ష్‌దీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. హార్దిక్‌ పాండ్యా, మయాంక్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌లు ఒక్కొక్కరు ఒక్కో వికెట్ సాధించారు. ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ త‌ర‌ఫున‌ ప్రకంపనలు సృష్టించిన మయాంక్ యాద‌వ్.. ప్రపంచ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన వెంటనే తుఫాను సృష్టించాడు. ఐపీఎల్‌లో గంటకు 157 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసిన ఈ బౌలర్.. గ్వాలియర్‌లోనూ అదే జోరు చూపించాడు. అతను తన అంతర్జాతీయ కెరీర్‌లో తొలి ఓవర్‌లో ఒక్క ప‌రుగు ఇవ్వ‌కుండా మెయిడిన్ ఓవ‌ర్ వేశాడు. 

team India, cricket, IND

బ్యాటింగ్ లో స‌మిష్టిగా రాణించిన భార‌త్ 

స్వ‌ల్ప టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన భార‌త్ కు మంచి శుభారంభం ల‌భించింది. హార్దిక్ పాండ్యా 16 బంతుల్లో 39 పరుగులతో చివ‌రి వ‌ర‌కు క్రీజులో ఉండి జ‌ట్టుకు విజ‌యాన్ని అందించాడు. సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు. హార్దిక్ తన ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. అతనికి తోడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ చెరో 29 ప‌రుగులు చేశారు. అభిషేక్ శర్మ 16 పరుగుల వ‌ద్ద  ర‌నౌట్ అయ్యాడు. అరంగేట్రం ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి కూడా 16 పరుగులతో అజేయంగా నిలిచాడు.

team India, cricket, IND

భార‌త్ త‌ర‌ఫున మయాంక్, నితీష్ అరంగేట్రం 

భారత కొత్త బౌలింగ్ సంచలనం మయాంక్ యాదవ్‌కు ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ఐపీఎల్ లో తుఫాను బౌలింగ్ చేసిన మయాంక్ పై మొద‌టి నుంచి అందరి చూపు ఉంది. అతనితో పాటు ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని బంగ్లాదేశ్ తో జ‌రిగిన తొలి టెస్టు మ్యాచ్ తో అంత‌ర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్‌లో నితీశ్ ఆకట్టుకున్నాడు. శివమ్ దూబే గాయపడటంతో అతనికి చోటు దక్కింది. తిలక్ వర్మ, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, జితేష్ శర్మలకు ప్లేయింగ్ 11 లో చోటు ద‌క్క‌లేదు. 

టీమిండియా ప్లేయింగ్-11 : అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, ర్యాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్.

బంగ్లాదేశ్ ప్లేయింగ్-11 : లిటన్ దాస్ (వికెట్ కీపర్), నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, తౌహీద్ హృదయ్, మహ్మదుల్లా, జెకర్ అలీ, మెహదీ హసన్ మిరాజ్, రిషద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, షోరీఫుల్ ఇస్లాం.

click me!