Dinesh Karthik , Rohit Sharma, Sunil Narine
5. రషీద్ ఖాన్: 14 సార్లు
అప్ఘనిస్తాన్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఐపీఎల్ లోనూ అనేక రికార్డులు సృష్టలించారు. ఇదే సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టారీలో అత్యధిక సార్లు డకౌట్ అయిన టాప్-5 ప్లేయర్ల జాబితాలో 5వ స్థానంలో ఉన్నాడు. తన ఐపీఎల్ కెరీర్ లో 109 మ్యాచ్ లను ఆడి 443 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 139 వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్ లో 14 సార్లు డకౌట్ అయ్యాడు.
4. మన్‌దీప్ సింగ్
కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన ఈ స్టార్ ప్లేయర్ 15 స్లార్లు ఐపీఎల్ లో డకౌట్ అయ్యాడు. తన ఐపీఎల్ కెరీర్ లో 111 మ్యాచ్ లు ఆడి 1706 పరుగులు కొట్టగా, 77* తన వ్యక్తిగతంగా అత్యధిక స్కోరు.
Sunil Narine
3. సునీల్ నరైన్
బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొట్టే ఈ వెస్టిండీస్ స్టార్ ఐపీఎల్ చరిత్రలో 15 సార్లు డకౌట్ అయ్యాడు. కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తరఫున ఆడుతున్న సునీల్ నరైన్ తన ఐపీఎల్ కెరీర్ లో కెరీర్ 162 మ్యాచ్ లను ఆడి 1046 పరుగులు కొట్టాడు. అలాగే, 163 వికెట్లు తీసుకున్నాడు.
Rohit Sharma
2. రోహిత్ శర్మ
టీమిండియా స్టార్ ప్లేయర్, ఐపీఎల్ లో విజయవంతమైన కెప్టెన్ గా ఉన్నాడు. ముంబై ఇండియన్స్ జట్టుకు ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ ను అందించాడు. రోహిత్ శర్మ తన ఐపీఎల్ కెరీర్ లో ఇప్పటివరకు 16 సార్లు డకౌట్ అయి ఈ లిస్టులో 2 స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ లో రోహిత్ శర్మ ఇప్పటివరకు 243 మ్యాచ్ లను ఆడి 6211 పరుగులు సాధించాడు. 109* పరుగులు వ్యక్తిగతంగా అత్యధిక స్కోరు.
1. దినేష్ కార్తీక్
ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు అత్యధిక సార్లు డకౌట్ అయిన ప్లేయర్ గా భారత స్టార్ ప్లేయర్ దినేష్ కార్తీక్ ఉన్నాడు. ఇప్పటివరకు 17 సార్లు డకౌట్ అయ్యాడు. దినేష్ కార్తీక్ తన ఐపీఎల్ కెరీర్ లో ఇప్పటివరకు 242 మ్యాచ్ లను ఆడి 4516 వికెట్లు తీసుకున్నాడు. 97* పరుగులు వ్యక్తిగతంగా అత్యధిక స్కోరు.