IPL, IPL 2024, TATA IPL 2024,
1. మహ్మద్ షమీ
భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ 2023 సీజన్‌లో అత్యధిక వికెట్లు తీశాడు. 2023 వన్డే ప్రపంచకప్ సమయంలో చీలమండ గాయంతో కావడంతో ఇటీవలే లండన్‌లో షమీకి శస్త్రచికిత్స జరిగింది. గుజరాత్ టైటాన్స్ కు ఆడుతున్న షమీ గురించి ప్రకటన రాలేదు కానీ, ఐపీఎల్ 2024కు ఆడటం లేదని బీసీసీఐ ఇచ్చిన సమాచారంతో తెలుస్తోంది.
Matthew Wade
2. మాథ్యూ వేడ్
ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మార్చి 25న టైటాన్స్‌తో జరిగే మొదటి మ్యాచ్‌లో ఆడడు. అతను మార్చి 21 నుండి 25 వరకు టాస్మానియా తరపున షెఫీల్డ్ షీల్డ్ ఫైనల్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అతను ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లకు దూరం కానున్నాడు. అయితే, ఐపీఎల్ 2024కు మొత్తం దూరంగా ఉంటాడని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. గుజరాత్ కు ఇది ఎదురుదెబ్బ అనే చెప్పాలి.
Mark Wood
3. మార్క్ వుడ్
T20 ప్రపంచ కప్, ఇంగ్లాండ్ దేశవాళీ సీజన్‌కు ముందు పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్ 2024 నుంచి వైదొలగాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్లు సూచించడంతో మార్క్ వుడ్ తప్పుకున్నాడు. అతని స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ లోకి వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షమర్ జోసెఫ్ జట్టులోకి వచ్చాడు.
4. ప్రసిద్ధ్ కృష్ణ
ఫిబ్రవరిలో క్వాడ్రిస్ప్స్ స్నాయువు శస్త్రచికిత్స చేయించుకున్న భారత ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ఐపిఎల్ నుండి వరుసగా రెండవ సీజన్‌కు దూరమయ్యాడు. రంజీ ట్రోఫీ సందర్భంగా అతడు గాయపడ్డాడు. అతని స్థానంలో ఎవరిని తీసుకుంటున్నారనే విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ ఇంకా ప్రకటించలేదు.
5. జాసన్ రాయ్
ఇంగ్లాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ జాసన్ రాయ్ వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ 2024 నుండి వైదొలిగాడు. ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ టూ బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్న ఇంగ్లాండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్‌ను అతని స్థానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో చేర్చుకుంది.
6. గుస్ అట్కిన్సన్
ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్‌ను ఈ సంవత్సరం వేలంలో కేకేఆర్ కొనుగోలు చేసింది. అయితే, అతను తన మొదటి ఐపీఎల్ నుండి వైదొలిగాడు. పనిభారాన్ని నిర్వహించడానికి ఈసీబీ అతనికి ఎన్ఓసీ ఇవ్వనందున అట్కిన్సన్ తన పేరును ఉపసంహరించుకున్నాడు. అట్కిన్సన్ స్థానంలో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దుష్మంత చమీరను కేకేఆర్ జట్టులోకి తీసుకుంది.
7. డెవాన్ కాన్వే
న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ డెవాన్ కాన్వే ఇటీవల బొటనవేలు గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అతను కోలుకోవడానికి ఎనిమిది వారాల వరకు ఆటకు దూరంగా ఉంటాడని భావిస్తున్నారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ మరో ఆటగాడిని టీమ్ లోకి తీసుకోనుందని సమాచారం.
8. హ్యారీ బ్రూక్
ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూప్ ఐపీఎల్ 2024 నుండి తన పేరును ఉపసంహరించుకున్నాడు. భారత్‌తో జరగనున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ నుంచి కూడా తన పేరును ఉపసంహరించుకున్నాడు. ఈ స్టార్ ప్లేయర్ అమ్మమ్మ చనిపోయిందనీ, తన కుటుంబంతో ఉండాలనుకున్నాడని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ అతని స్థానంలో వచ్చే ప్లేయర్ ను ఇంకా ప్రకటించలేదు.