IPL 2024 ట్రోఫీ గెలవడానికి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఒక్క‌టే స‌రిపోదు.. ఏబీ డివిలియర్స్ హాట్ కామెంట్స్

First Published | Mar 14, 2024, 12:29 PM IST

Tata IPL 2024: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2024లో ముంబై జట్టు టైటిల్ ను గెలుచుకోవాలంటే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఒక్క‌టే సరిపోదని దిగ్గ‌జ క్రికెట‌ర్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. రోహిత్ శ‌ర్మ‌ను త‌ప్పించి హార్దిక్ కు ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్సీ ఇవ్వ‌డాన్ని ఎత్తిచూపాడు. 
 

Hardik-Rohit

AB de Villiers' hot comments on Hardik Pandya: 2008 ప్రారంభ‌మైన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ ఈ ఏడాది 17వ ఐపీఎల్ 2024 సీజ‌న్ కు సిద్ధ‌మైంది. 10 జట్లు పాల్గొంటున్న ఈ మెగా క్రికెట్ లీగ్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై-బెంగళూరు జట్లు త‌ల‌ప‌డ‌బోతున్నాయి. చెన్నైలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ లో చెన్నై, ముంబై జట్లు చెరో 5 సార్లు ట్రోఫీలు గెలుచుకున్నాయి. ఈ సారి ఈ రెండు జ‌ట్లు ట్రోఫీ గెలుచుకోవ‌డానికి భారీగా మార్పులు చేసుకున్నాయి. 

Hardik Pandya Mumbai

ముంబై ఇండియ‌న్స్ అయితే, జ‌ట్టును ఐదు సార్లు ఛాంపియ‌న్ గా నిలిపిన హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌ను త‌ప్పించి హార్దిక్ పాండ్యాకు ప‌గ్గాలు అప్ప‌గించింది. ఇప్పటికే దీనిపై పలువురు ముంబై అభిమానులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీంతో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించినట్లు ముంబై మేనేజ్‌మెంట్ ప్రకటించింది. అయిన‌ప్ప‌టికీ శాంతించ‌కుండా ఒక్కరోజులోనే 6 లక్షల మందికి పైగా ముంబై అభిమానులు టీమ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అయితే, హార్దిక్ పాండ్యా సారథిగా తొలి ఏడాది గుజరాత్ ట్రోఫీ గెలిచినట్లే ముంబైకి టైటిల్ గెలుస్తాడన్న అంచనాలు నెలకొన్నాయి.


ఇదే క్ర‌మంలో సౌతాఫ్రికా స్టార్ ప్లేయ‌ర్ ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించడమే కాకుండా మంచి ఫాస్ట్ బౌలర్‌గా కూడా వ్యవహరిస్తేనే ముంబై ఇండియన్స్ జట్టు ట్రోఫీని గెలుస్తుందని అన్నాడు. కెప్టెన్సీ ఒక్క‌టే స‌రిపోద‌ని పేర్కొన్నాడు. మిగ‌తా ప్లేయ‌ర్ల ఆట‌తీరుపై కూడా ఇది ఆధార‌ప‌డి ఉంటుంద‌న్నాడు. గాయం కారణంగా గ‌త ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన జస్ప్రీత్ బుమ్రా మళ్లీ ముంబై తరఫున ఆట‌ను చూడ‌టానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు.

"ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా పునరాగమనం చాలా అవసరం. కాకపోతే వారు బలంగా కనిపిస్తున్నారు కానీ నిజానికి వారి జట్టులో బ్యాలెన్స్ లేదు. ఈసారి హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణిస్తాడని నేను భావిస్తున్నాను. ముంబై ఇండియన్స్‌కు ఆల్‌రౌండర్‌గా అతని అవసరం మరింత ఎక్కువ. కెప్టెన్సీ ఒక్క‌డే కాదు.. కెప్టెన్ గా, మంచి ఫాస్ట్ బౌలర్ రాణిస్తేనే ముంబై ట్రోఫీని గెలుస్తుంది. ఈసారి బుమ్రా బౌలింగ్ కోసం ఎదురు చూస్తున్నాను. ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్‌ తరఫున అద్భుతంగా రాణించాడు. ముంబైకి అత‌ని సేవ‌లు కీల‌కంకానున్నాయి" అని ఏబీ డివిలియ‌ర్స్ పేర్కొన్నాడు. 

Latest Videos

click me!