Bhagwat Chandrasekhar, Pragyan Ojha, Chris Martin
5. జాక్ సాండర్స్ (ఆస్ట్రేలియా)
జాన్ విక్టర్ సాండర్స్ అని కూడా పిలువబడే ఈ మాజీ ఆస్ట్రేలియన్ లెఫ్టార్మ్ స్పిన్నర్ 1902లో ఇంగ్లాండ్ పై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్ తన బౌలింగ్‌కు అనుకూలమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు అత్యంత కఠినమైన బౌలర్. ఆస్ట్రేలియా తరపున అతని ఆరేళ్ల కెరీర్‌లో, సాండర్స్ కేవలం 14 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. అతను 79 వికెట్లు తీయగా, 39 పరుగులు చేశాడు. సాండర్స్ బంతితో 22.73 సగటు కలిగివుండగా, 12 సార్లు ఒక ఇన్నింగ్స్‌లో నాలుగు కంటే ఎక్కువ వికెట్లు తీశాడు.
Pragyan Ojha
4. ప్రజ్ఞాన్ ఓజా (భారత్)
భారత మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా నవంబర్ 2009లో శ్రీలంకతో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశాడు. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ భారత అత్యుత్తమ స్పిన్నర్‌లలో ఒకరిగా గుర్తింపు సాధించాడు. ప్రజ్ఞాన్ ఓజా టెస్ట్ క్రికెట్‌లో ముఖ్యంగా భారత్ లో జరిగిన మ్యాచ్ లలో అద్భుత ప్రదర్శనతో చెలరేగాడు. 24 టెస్టుల్లో ఓజా 113 వికెట్లు పడగొట్టాడు. అయితే, టెస్టుల్లో కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు.
Bruce Reid
3. బ్రూస్ రీడ్ (ఆస్ట్రేలియా)
ఆస్ట్రేలియాకు చెందిన ఈ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ డిసెంబరు 1985లో అడిలైడ్‌లో భారత్‌తో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశాడు. 1990లో మెల్‌బోర్న్‌లో ఇంగ్లాండ్ పై 13 వికెట్లు పడగొట్టి, టెస్టు క్రికెట్‌లో అతని పీక్ మూమెంట్ వచ్చింది. ఏడాది తర్వాత ఇదే వేదికపై భారత్‌పై 12 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. 27 టెస్టు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రూస్ రీడ్ 24.63 సగటుతో 113 వికెట్లు పడగొట్టాడు. తన టెస్టు కెరీర్‌లో 93 పరుగులు మాత్రమే చేశాడు.
Chris Martin
2. క్రిస్ మార్టిన్ (న్యూజిలాండ్)
న్యూజిలాండ్ పేస్ బౌలర్ క్రిస్ మార్టిన్ 71 టెస్టుల్లో 233 వికెట్లతో ఈ లిస్టులో రెండో స్థానంలో నిలిచాడు. 2000ల సమయంలో, క్రిస్ మార్టిన్ న్యూజిలాండ్‌కు ప్రధాన బౌలర్లలో ఒకడు. క్రిస్ మార్టిన్ కెరీర్‌లో 104 ఇన్నింగ్స్‌లలో 123 పరుగులు మాత్రమే చేసాడు. అంటే తాను ఆడిన టెస్టు మ్యాచ్ కెరీర్ లో తాను చేసిన పరుగుల కంటే ఎక్కువగా వికెట్లను తీసుకున్నాడు.
1. భగవత్ చంద్రశేఖర్ (భారత్)
భారత టెస్ట్ చరిత్రలో స్పిన్ బౌలింగ్ లో దిగ్గజ ప్లేయర్ భగవత్ చంద్రశేఖర్. 1960-1970లలో ఎరపల్లి ప్రసన్న, ఎస్. వెంకట్రాఘవన్, బిషెన్ సింగ్ బేడీలతో కూడిన భారతదేశ స్పిన్ క్వార్టెట్‌లో గొప్ప భారతీయ క్రికెటర్ సభ్యుడుగా భగవత్ చంద్రశేఖర్ గర్తింపు సాధించారు. అతను 80 ఇన్నింగ్స్‌లలో 167 పరుగులు చేయగా, తన అద్భుతమైన టెస్ట్ కెరీర్‌లో 58 మ్యాచ్‌లలో 29.74 సగటుతో 242 వికెట్లు తీసుకున్నాడు.