1. రవిశాస్త్రి
భారత మాజీ కెప్టెన్, కోచ్ రవిశాస్త్రి ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన మొదటి భారతీయ బ్యాటర్. అతను అంతర్జాతీయ క్రికెట్ లో కాకుండా బరోడాపై 1985 రంజీ ట్రోఫీలో ఈ ఘనతను సాధించాడు. రవిశాస్త్రి ముంబై తరఫున ఆడుతూ.. స్పిన్నర్ తిలక్ రాజ్ వేసిన ఒక ఓవర్‌లో వరుసగా ఆరు సిక్స్‌లతో విధ్వంసం చేశాడు. దీంతో క్రికెట్ లో ఒకే ఓవర్ లో 6 సిక్సర్లు బాదిన రెండవ బ్యాటర్‌గా నిలిచాడు. తన ఇన్నింగ్స్ లో 123 బంతుల్లోనే డబుల్ సెంచరీని సాధించాడు. ఇది ఫస్ట్ క్లాస్ (FC) క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీగా రికార్డు సృష్టించింది.
Yuvraj Singh
2. యువరాజ్ సింగ్
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2007లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ సునామీ ఇన్నింగ్స్ ను ఎవరు మరచిపోగలరు. యువరాజ్ 12 బంతుల్లో ఫిఫ్టీ కొట్టాడు. ఇది ఇప్పటికీ టీ20Iలలో రెండవ అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఆండ్రూ ఫ్లింటాఫ్‌తో వాగ్వాదం తర్వాత స్టువర్ట్ బ్రాడ్ వేసిన బౌలింగ్ తను ఉతికిపారేశాడు. వరుసగా ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్‌లతో టీ20 క్రికెట్ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. యువరాజ్ 16 బంతుల్లో 58 పరుగులతో తన ఇన్నింగ్స్ ను ముగించాడు. ఈ మ్యాచ్ లో భారత్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ബി ടീം
3. రుతురాజ్ గైక్వాడ్
ఆరు సిక్సర్లు కొట్టడం చాలా అరుదు, కానీ ఒక ఓవర్లో ఏడు కొట్టడం చాలా అరుదైన సంఘటన. విజయ్ హజారే ట్రోఫీ 2022లో ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్రకు నాయకత్వం వహిస్తున్న సమయంలో భారత స్టార్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ఈ ఘనత సాధించాడు. అతను 49వ ఓవర్‌లో స్పిన్నర్ శివ సింగ్ బౌలింగ్ లో ఈ ఘనత సాధించాడు. ఏడు సిక్సర్లు (ఒకటి నో బాల్‌లో వచ్చింది) కొట్టాడు. గైక్వాడ్ 43 పరుగులు చేసి లిస్ట్ A క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్రపంచ రికార్డును సృష్టించాడు. తన ఇన్నింగ్స్ లో 159 బంతుల్లో 16 సిక్సర్లు, 10 ఫోర్లతో 220 పరుగులు చేశాడు.
Vamsi Krishna, M Vamsi Krishna, six sixes
4. వంశీ కృష్ణ:
ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన నాల్గవ భారతీయ బ్యాటర్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన అండర్ 23 క్రికెటర్ వంశీ కృష్ణ . వైఎస్ రాజా రెడ్డి ఏసీపీ క్రికెట్ స్టేడియంలో రైల్వేస్‌తో జరిగిన కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ 2023-24 మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు. అతను రైల్వేస్ స్పిన్నర్ దమన్‌దీప్ సింగ్ బౌలింగ్ ను ఉతికిపారేస్తూ వంశీకృష్ణ ఒక ఓవర్‌లో 6 సిక్సర్లతో 36 పరుగులు చేసి 64 బంతుల్లో 110 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.