Indian cricketer, mridula jadeja, mridula ,
Top 10 expensive houses of Indian cricketers: భారత క్రికెటర్లలో అత్యంత ఖరీదైన ఇల్లు ఎవరికి వుందనే ప్రస్తావన వస్తే సాధారణంగా వినిపించే ప్లేరు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ. ఈ స్టార్ ప్లేయర్లు దాదాపు రూ.100 కోట్ల విలువ చేసే ఇంట్లో నివాసముంటున్నారు. అయితే, వీరిని మించి అత్యంత ఖరీదైన ఇంట్లో నివాసముంటున్నారు ఒక భారత క్రికెటర్.. ఆమె టీమిండియా క్రికెట్ క్వీన్ మృదుల జడేజా.
మృదుల జడేజా ఒక భారతీయ మహిళా క్రికెటర్. ఆమె 2006 నుండి గుజరాత్ సౌరాష్ట్ర జట్టు కోసం క్రికెట్ ఆడుతోంది. ఆల్ రౌండర్ గా తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
Mridula Jadeja
నిజానికి మృదుల రాజ్‌కోట్ యువరాణి అని చెప్పాలి. మృదులా జడేజా గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో నివసిస్తున్నారు. అతని తండ్రి మంధాత సింగ్ రాజ్‌కోట్‌కు చెందిన రాజ వంశీయుడు. ఆయన కుమార్తె మృదుల జడేజా.
mridula jadeja
మృదులకు.. జాడేజాకు అంటే టీమిండియా స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజాకు సంబంధీకులు అనుకునేరు. జడ్డూ భాయ్ తో మృదుల జడేజాకు ఎలాంటి సంబంధమూ లేదు. ఆమె సచిన్, ధోని, విరాట్ కోహ్లీ కంటే ఖరీదైన ఇంట్లో నివాసముంటున్నారు.
Mridula Jadeja
భారత లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇంటి విలువ 100 కోట్లు. దిగ్గజ ప్లేయర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ దాదాపు రూ. 80 కోట్ల విలువైన ఇంట్లో నివసిస్తున్నారు. అయితే, వీరిని మించి మృదుల అత్యంత ఖరీదైన ఇంట్లో నివాసముంటున్నారు. మృదుల నివాసముంటున్న తమ పూర్వీకుల భవనం రూ. 4000 కోట్ల కంటే ఎక్కువ ఖరీదైనది.
mridula jadeja
మృదుల రాజ్‌కోట్‌లోని రంజిత్ విలాస్ ప్యాలెస్‌లో నివసిస్తున్నారు. 225 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ ఇంట్లో 100 కంటే ఎక్కువ గదులు ఉన్నాయి. ఈ రాజుల నివాసమున్న ప్యాలెస్ 100 సంవత్సరాలకు పైగా పురాతనమైనది కావడం విశేషం.
mridula jadeja
మృదులా జడేజా నివాసముంటున్న ఈ రాజ భవనాన్ని ఠాకూర్ సాహెబ్ బావ్జీ రాజ్ 1870లో నిర్మించారు, ఇందులో అందమైన శిల్పాలు, ఇటాలియన్ స్తంభాలు, అద్భుతమైన కళతో కూడిన గొప్ప దేవాలయాలు, అనేక పాతకాలపు కార్లు, ఇతర వాహనాలు ఉన్నాయి.
mridula jadeja
మృదులా జడేజా కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్. రైట్-మీడియం బౌలర్. సౌరాష్ట్ర జట్టు తరఫున 36 టీ20 మ్యాచ్ లు, 46 లిస్టే ఏ వన్డే మ్యాచ్ లను ఆడారు. ఆల్ రౌండర్ గా గుర్తింపు సాధించారు.
Mridula Kumari Jadeja
క్రికెట్ క్వీన్ మృదులా జడేజా 17 సంవత్సరాల వయస్సు నుండి ఆల్ రౌండర్‌గా సౌరాష్ట్ర తరపున క్రికెట్ ఆడుతున్నారు. ఆమె వెస్ట్ జోన్‌కు కూడా ప్రాతినిధ్యం వహించాడు. 2021లో మహిళల సీనియర్ వన్డే క్రికెట్ ట్రోఫీలో ఆమె నాలుగు అర్ధ సెంచరీలు సాధించింది.