క్రికెట్ అన్ని ఫార్మాట్లలో ధోని మొత్తం 195 స్టంపింగ్ లతో టాప్ లో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలో లెజెండరీ ప్లేయర్, శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర 139 స్టంపింగ్ లు చేశాడు. అలాగే, రొమేష్ కలువితారణ 101, బంగ్లాదేశ్ ప్లేయర్ ముష్ఫికర్ రహీమ్ 101, పాకిస్తాన్ క్రికెటర్ మొయిన్ ఖాన్ 93 స్టంపింగ్ లతో ధోనితో కలిపి టాప్-5 బెస్ట్ వికెట్ కీపర్ అత్యధిక స్టంపింగ్ లు చేసిన వారిలో ఉన్నారు.