
క్రిస్ గేల్ 175 (2013)*
యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ క్రికెట్ లెజెండ్ క్రిస్ గేల్ ఐపీఎల్ చరిత్రలో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు కొట్టింది క్రిస్ గేల్. అతను ఒకే ఇన్నింగ్స్‌లో 17 సిక్సర్లు, 265.15 స్ట్రైక్ రేట్ తో 175* పరుగుల అజేయ ఇన్నింగ్స్ ను ఆడాడు.
1. Brendon McCullum lights up IPL in style (2008)
బ్రెండన్ మెకల్లమ్ 158 (2008)*
తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్ కేవలం 73 బంతుల్లోనే 158 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అద్భుతమైన సెంచరీతో అజేయంగా నిలిచాడు. ఇది ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యుత్తమ స్కోర్‌లలో ఒకటిగా నిలిచింది.
రింకు సింగ్ సిక్సర్ల మోత (2023)
భారత యంగ్ ప్లేయర్ రింకూ సింగ్ కేకేఆర్ తరఫున అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడాడు. అయితే, 2023లో ఐపీఎల్ లో కేకేఆర్ ఓడిపోయే మ్యాచ్ ను వరుస సిక్సర్లు బాది గెలిపించాడు. చివరి ఓవర్లో రింకు సింగ్ వరుసగా 5 సిక్సర్లు కొట్టి కోల్ కతా నైట్ రైడర్స్ కు విజయాన్ని అందించాడు.
ముంబై ఇండియన్స్ అద్భుతం చేసింది ! (2014)
ఆదిత్య తారే చివరి బంతికి సిక్సర్ కొట్టి ముంబై ఇండియన్స్ కు కేవలం 14.3 ఓవర్లలో 190 పరుగుల టార్గెట్ ను అందుకునేలా చేశాడు. 2014లో జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై, రాజస్థాన్ తలపడ్డాయి. రాజస్థాన్ 20 ఓవర్లలో 189/4 పరుగులు చేసింది. ముంబై జట్టు ఫ్లే ఆఫ్ రేసులో నిలవాలంటే 14.3 ఓవర్లలో టార్గెట్ ను అందుకోవాలి. ముంబై అద్భుతమైన బ్యాటింగ్ తో టార్గెట్ ను అందుకుని నెట్ రన్ రేటుతో ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. ముంబై తరఫున కొరీ అండర్సన్ 95*(44 బంతులు) పరుగుల అజేయ అన్నింగ్స్ ఆడాడు. చివరి బంతికి అదిత్య తారే సిక్సర్ తో మ్యాచ్ ను ముగించాడు. ఈ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత థ్రిల్లింగ్ మ్యాచ్‌లలో ఒకటిగా నిలిచింది.
చెన్నై సూపర్ కింగ్స్ పై రెండేళ్ల నిషేధం (2015)
ఎంఎస్ ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టు యజమాని గురునాథ్ మెయ్యప్పన్ అక్రమ బెట్టింగ్‌కు పాల్పడిన కారణంగా ఆ జట్టుపై రెండేళ్ల నిషేధం విధించారు. ఈ సంఘటనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ జట్టు అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఒకే మ్యాచ్‌లో రెండు సూపర్ ఓవర్లు (2020)
క్రికెట్ మ్యాచ్ లో సూపర్ ఓవర్లు చాలా అరుదుగా వస్తుంటాయి. కానీ, 2020లో ఒకే మ్యాచ్‌లో రెండు సూపర్ ఓవర్లు వచ్చాయి. ముంబై ఇండియన్స్ - కోల్ కతా నైట్ రైడర్స్ ఈ మ్యాచ్ లో రెండు సూపర్ ఓవర్లను ఆడాయి. ఇది క్రికెట్ చరిత్రలో మొదటిసారి.
పొలార్డ్ టేప్ తో నిరసన (2015)
వెస్టిండీస్ మాజీ స్టార్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అనేక అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడాడు. అయితే, ఒక మ్యాచ్ సమయంలో పొలార్డ్ తన నోటిపై డక్ట్ టేప్ పెట్టుకున్నాడు. ఈ మ్యాచ్ ముగిసే వరకు అంపైర్ల తీరుకు నిరసనగా తన మూతిని టేప్ తో మూసివేశాడు.
విరాట్ కోహ్లీ vs గౌతమ్ గంభీర్ బిగ్ ఫైట్ (2023)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) vs లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మ్యాచ్ సందర్భంగా టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ-గౌతమ్ గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇద్దరు కొట్టుకునే వరకు వెళ్లారు.
ఐపీఎల్ లో బౌలింగ్ తో ఆడమ్ గిల్‌క్రిస్ట్ కు వికెట్
ప్రపంచ క్రికెట్ లో ఆసీస్ స్టార్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ గొప్ప వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్. అయితే, ఈ లెజెండరీ ప్లేయర్ కీపింగ్ చేస్తూనే బౌలింగ్ చేసి తన ఐపీఎల్ కెరీర్ లో ఏకైక వికెట్ ను సాధించాడు.
మిలియన్ డాలర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ (2013)
క్రికెట్ లో గ్లెన్ మ్యాక్స్ వెల్ విధ్వంసం మాములుగా ఉండదు. అయితే, గ్లెన్ మాక్స్వెల్ ను $1 మిలియన్ కు కొనుగోలు చేశారు. అయితే, అతను కేవలం కేవలం మూడు మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. దీంతో ముంబై ఇండియన్స్ ఆప్షన్ స్ట్రాటజీపై అనేక ప్రశ్నలు తలెత్తాయి.