Pakistan Cricket Board Faces Financial Crisis After 700 Crore Loss In Champions Trophy
Pakistan Cricket Board Faces Financial Crisis: ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించిన పాకిస్తాన్ టోర్నీతో భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూసింది. పాక్ క్రికెట్ మండలి(పీసీబీ) ఈ టోర్నీతో 700 కోట్ల రూపాయలకు పైగా నష్టపోయింది. దీంతో ప్లేయర్ల ఫీజులు, సౌకర్యాలు తగ్గించేందుకు సిద్ధమైంది.
Pakistan Cricket Board Faces Financial Crisis After 700 Crore Loss In Champions Trophy
నివేదికల ప్రకారం, టోర్నీకి ముందు పీసీబీ ₹500 కోట్లు ఖర్చు చేసి 3 స్టేడియాలను పునరుద్ధరించింది. పునరుద్ధరణ ఖర్చు అంచనా వేసిన బడ్జెట్ కంటే 50% ఎక్కువైంది. అంతేకాదు, టోర్నీ కోసం ₹340 కోట్లు వెచ్చించింది. మొత్తం మీద ₹869 కోట్లు ఖర్చు చేసింది.
Pakistan Cricket Board Faces Financial Crisis After 700 Crore Loss In Champions Trophy
టికెట్ ఫీజులు, ఇతర మార్గాల ద్వారా పాకిస్తాన్ అందుకున్నది 52 కోట్ల రూపాయలు మాత్రమే. దీంతో టోర్నీలో పెట్టిన పెట్టుబడిలో పాకిస్తాన్ 85% నష్టపోయింది అని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
Pakistan Cricket Board Faces Financial Crisis After 700 Crore Loss In Champions Trophy
అందుకే పాక్ జాతీయ టీ20 ఛాంపియన్‌షిప్‌లో మ్యాచ్ ఫీజును 90% వరకు, రిజర్వ్ ప్లేయర్ల చెల్లింపు ఫీజును 87.5%కి తగ్గించాలని నిర్ణయించింది. అంతేకాదు, ప్లేయర్లకు ఉన్న ఫైవ్ స్టార్ వసతి సౌకర్యాన్ని తగ్గించి ఎకానమీ హోటళ్లకు మార్చింది.