IPL 2025: ఐపీఎల్ టాప్-5 యంగెస్ట్ ప్లేయ‌ర్లు వీరే

Published : Mar 20, 2025, 04:35 PM IST

IPL 2025 top 5 youngest players: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025 మార్చి 22 నుంచి ఘ‌నంగా ప్రారంభం కానుంది. అయితే, ఐపీఎల్ లో సీనియ‌ర్ ప్లేయ‌ర్ల‌తో పాటు యంగ్ ప్లేయ‌ర్లు కూడా ఆడనున్నారు. ఐపీఎల్ 2025లో ఆడ‌నున్న అతిపిన్న వ‌య‌స్కులైన టాప్-5 ప్లేయ‌ర్లు ఎవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం.   

PREV
16
IPL 2025: ఐపీఎల్ టాప్-5 యంగెస్ట్ ప్లేయ‌ర్లు వీరే
Top 5 youngest cricketers in Indian Premier League IPL

IPL 2025 top 5 youngest players: జెడ్డాలో జరిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు 13 ఏళ్ల యంగ్ ప్లేయ‌ర్ వైభవ్ సూర్యవంశీ కోసం కోటీ రూపాయ‌ల‌కు పైగా ఖ‌ర్చు చేసి ద‌క్కించుకుంది. ఈ యంగ్ ప్లేయ‌ర్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బిడ్డింగ్ వార్ ను న‌డిపాయి. చివ‌ర‌కు రాయల్స్ అతన్ని రూ.1.1 కోట్లకు ద‌క్కించుకుంది. దీంతో అత‌ను ఐపీఎల్ లో అత్యంత పిన్న వ‌య‌స్కుడైన ప్లేయ‌ర్ గా రికార్డు సాధించాడు. అయితే, ఐపీఎల్ 2025లో ఆడ‌నున్న టాప్-5 యంగెస్ట్ ప్లేయ‌ర్లు ఎవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం.

26
Top 5 youngest cricketers in Indian Premier League IPL

1. వైభవ్ సూర్యవంశీ

కేవలం 13 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ ఎంట్రీకి సిద్ధంగా ఉన్నాడు. ఐపీఎల్ వేలంలో ఎంపికైన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సాధించాడు. బీహార్‌కు చెందిన అతన్ని రాజస్థాన్ రాయల్స్ ₹1.1 కోట్లకు కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా అండర్ 19 టీమ్ పై సెంచరీ సహా టీమిండియా అండర్-19 జట్టు తరపున అనేక అద్భుత‌మైన ఇన్నింగ్స్ ల‌ను ఆడాడు.

36
Top 5 youngest cricketers in Indian Premier League IPL

2. ఆండ్రీ సిద్ధార్థ్

తమిళనాడుకు చెందిన 18 ఏళ్ల యంగ్ ప్లేయ‌ర్ ఆండ్రీ సిద్ధార్థ్ 2025లో ఐపీఎల్ ఎంట్రీ చేయ‌నున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అత‌న్ని చెన్నై సూపర్ కింగ్స్ ₹30 లక్షలకు కొనుగోలు చేసింది. అండర్-19 ఆసియా కప్‌లో అద్భుతమైన ప్రదర్శనతో పాటు దేశ‌వాళీ క్రికెట్ లో సూప‌ర్ ఇన్నింగ్స్ ల‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు.

46
Top 5 youngest cricketers in Indian Premier League IPL

3. క్వేనా మాఫకా

దక్షిణాఫ్రికా యంగ్ పేసర్ క్వేనా మాఫ‌కా ఐపీఎల్ 2025లో ఎంట్రీ ఇస్తున్న మూడో అతిపిన్న వ‌య‌స్కుడైన ప్లేయ‌ర్. 18 ఏళ్ల కుర్రాడిని రాజస్థాన్ రాయల్స్ వేలంలో 1.5 కోట్ల రూపాయ‌ల‌కు దక్కించుకుంది. డిసెంబర్ 2024లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చి తొలి మ్యాచ్ లోనే బాబర్ ఆజం వంటి స్టార్ ప్లేయ‌ర్ల‌ను ఔట్ చేసి గుర్తింపు సాధించాడు. సౌతాఫ్రికా దేశ‌వాళీ క్రికెట్ లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చాడు. 

56
Top 5 youngest cricketers in Indian Premier League IPL

4. ముషీర్ ఖాన్

భార‌త క్రికెట‌ర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ 19 ఏళ్ల ఆల్ రౌండర్. ఐపీఎల్ మెగా వేలంలో అత‌న్ని పంజాబ్ కింగ్స్ ద‌క్కించుకుంది. రంజీ ట్రోఫీలో డబుల్ సెంచరీతో సహా దేశీయ క్రికెట్‌లో ముంబై తరపున అద్భుతమైన ఇన్నింగ్స్ ల‌ను ఆడాడు. దీంతో వేలంలో అత‌ని కోసం పంజాబ్ టీమ్ ₹30 లక్షల రూపాయ‌లు వెచ్చించింది.

66
Top 5 youngest cricketers in Indian Premier League IPL

5. స్వస్తిక్ చికారా

19 ఏళ్ల వయసులో ఐపీఎల్ 2025లో ఆడ‌బోతున్న మ‌రో యంగ్ ప్లేయ‌ర్ స్వస్తిక్ చికారా. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అత‌న్ని 30 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు ఐపీఎల్ మెగా వేలంలో ద‌క్కించుకుంది. తన దూకుడు బ్యాటింగ్ శైలితో గుర్తింపు పొందిన ఈ యంగ్ ప్లేయ‌ర్ అద్భుత‌మైన ఇన్నింగ్స్ ల‌ను ఆడాడు.  గోరఖ్‌పూర్‌లోని ACE క్రికెట్ అకాడమీతో జరిగిన 40 ఓవర్ల మ్యాచ్‌లో 167 బంతుల్లో 55 ఫోర్లు, 52 సిక్సర్లతో 585 పరుగులతో వెలుగులోకి వ‌చ్చాడు. ఇప్పుడు ఐపీఎల్ లో దుమ్మురేప‌డానికి సిద్ధంగా ఉన్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories