సారా టెండూల్కర్ తో బ్రేకప్? శుభ్‌మన్ గిల్ కొత్త గర్ల్ ఫ్రెండ్?

First Published | Apr 26, 2024, 9:37 AM IST

Shubman Gill - Sara Tendulkar : భార‌త యంగ్ ప్లేయ‌ర్, గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్  శుభ్‌మన్ గిల్ వ్యక్తిగత విష‌యాల‌తో మ‌రోసారి సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. అధికారికంగా చెప్ప‌క‌పోయినా  సారా టెండూల్కర్- శుభ్ మ‌న్ గిల్ ప్రేమాయ‌ణం గురించి మ‌రోసారి సోష‌ల్ మీడియాలో ర‌చ్చ మొద‌లైంది. 
 

Shubman Gill : టీమిండియా యంగ్ ప్లేయ‌ర్ శుభ్‌మన్ గిల్ ప్రేమాయ‌ణం గురించి మ‌రోసారి నెట్టింట చ‌ర్చ మొద‌లైంది. దీంతో మ‌రోసారి గిల్ హాట్ టాపిక్ అయ్యాడు. సారా టెండూల్కర్‌తో పాటు గిల్ పేరు చాలా కాలంగా వినిపిస్తోంది. వీరిద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నార‌ని టాక్ వినిపించింది.

గిల్-సారా ప్రేమాయ‌ణంలో ఇప్పుడు మ‌రో ట్విస్ట్ వార్త‌లు వ‌స్తున్నాయి. క్రికెటర్ శుభ్‌మన్ గిల్ తన వృత్తిపరమైన జీవితంతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పుకార్లతో బాగా ప్రాచుర్యం పొందాడు.  


గిల్-సారా ప్రేమ‌లో ఉన్నారని ఊహాగానాలు నాలుగు సంవత్సరాలుగా ఉన్నాయి, వివిధ ఈవెంట్‌లలో వారికి సంబంధించిన అంశాలు హాట్ టాపిక్ అయ్యాయి. వీరిద్ద‌రూ ఎప్పుడూ కూడా పబ్లిక్‌గా కలిసి కనిపించినప్పటికీ వీరు ప్రేమ‌లో ఉన్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. కానీ, వీరి బంధం అధికారికంగా ధృవీకరించబడలేదు.

అయితే ఇప్పుడు ఈ యంగ్ ప్లేయ‌ర్ గిల్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో బ్రేక‌ప్ చేసుకున్నాడ‌నే టాక్ న‌డుస్తోంది. అత‌ను కొత్త గర్ల్‌ఫ్రెండ్ తో ఉన్నాడ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. స్పానిష్ జాతీయురాలు, అరోయోగ్ తో ప్రేమలో ఉన్నాడ‌ని ప‌లు మీడియా నివేదికలు చెబుతున్నాయి.

ఇటీవల, ఒక రెడిట్ యూజ‌ర్ పోస్టులో గిల్ ఆడిన ఒక మ్యాచ్ కు త‌న కొత్త గ‌ర్ల్ ఫ్రెండ్ హాజ‌రైన‌ట్టు, గిల్ ప్రైవేట్ Instagram ఖాతాను అనుసరిస్తున్నట్లు చూపించే స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసినప్పటి నుండి వారి సంబంధానికి సంబంధించిన ఊహాగానాలు చెలరేగాయి.

Shubman Gill


గుజ‌రాత్-ఢిల్లీ మధ్య ఇటీవల జరిగిన మ్యాచ్‌లో, మారియా స్టాండ్‌ల నుండి గిల్‌ను ఉత్సాహపరుస్తూ కనిపించింది. దీంతో వీరి బంధం గురించి మ‌రింతగా ఊహాగానాలకు ఆజ్యం పోసింది. బిగ్ స్క్రీన్ పై  మారియాకు గిల్ ప్రతిస్పందన వారి సంబంధం గురించి సంచలనాన్ని పెంచింది.

Latest Videos

click me!