వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన‌ టాప్-10 భార‌త ప్లేయ‌ర్లు

First Published | Aug 6, 2024, 8:35 PM IST

Team India's top-10 ODI cricketers : పురుషుల  వ‌న్డే క్రికెట్ చరిత్ర‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్ల లిస్టులో లెజెండ‌రీ ప్లేయ‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్, ర‌న్ మిష‌న్ విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని వంటి ప్లేయ‌ర్లు ఉన్నారు. అలాగే, భారత క్రికెట్ జట్టు ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను అధిగమించించాడు. వ‌న్డే క్రికెట్ లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన టాప్-10 భార‌త‌ ప్లేయ‌ర్ల వివ‌రాలు గ‌మ‌నిస్తే.. 
 

Virat Kohli, MS Dhoni, Sachin Tendulkar

సచిన్ టెండూల్కర్

సచిన్ టెండూల్కర్ తన వ‌న్డే కెరీర్‌లో 452 ఇన్నింగ్స్‌లు ఆడాడు. అత్యధిక స్కోరు 200*తో 18,426 పరుగులు చేశాడు. స‌చిన్ 44.83 బ్యాటింగ్ సగటుతో 49 సెంచరీలు సాధించాడు. 
 

విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ తన ప్రస్తుత కెరీర్‌లో 282 ఇన్నింగ్స్‌లు ఆడి 13,886 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 183 ప‌రుగులు. 58.34 సగటుతో ప‌రుగుల వ‌ర‌ద పారించిన ఈ ప్లేయ‌ర్ 50 సెంచ‌రీల‌ను పూర్తి చేశాడు. 


సౌరవ్ గంగూలీ

సౌరవ్ గంగూలీ 297 ఇన్నింగ్స్‌లు ఆడాడు. అత‌ని అత్యధిక స్కోరు 183 ప‌రుగులు. త‌న వ‌న్డే కెరీర్ లో మొత్తం 11,221 పరుగులు చేశాడు. 40.95 బ్యాటింగ్ సగటుతో 22 సెంచరీలు సాధించాడు. 

Rohit Sharma, cricket

రోహిత్ శర్మ

రోహిత్ శర్మ 256 ఇన్నింగ్స్‌లు ఆడాడు. మొత్తంగా వ‌న్డే క్రికెట్ లో 10,831 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 264. అతను బ్యాటింగ్ సగటు 49.23 కాగా, ఇప్ప‌టివ‌ర‌కు 31 సెంచరీలు  సాధించాడు. 

రాహుల్ ద్రవిడ్

రాహుల్ ద్రావిడ్ 314 ఇన్నింగ్స్‌లు ఆడాడు. 10,768 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 153 పరుగులు. అతను 39.15 బ్యాటింగ్ సగటుతో త‌న వ‌న్డే కెరీర్ లో 12 సెంచరీలు చేశాడు.

MS Dhoni

ఎంఎస్ ధోని

ఎంఎస్ ధోని భార‌త విజ‌య‌వంత‌మైన కెప్టెన్. ధోని 294 వ‌న్డే ఇన్నింగ్స్‌ల‌లో అత్యధిక స్కోరు 183* ప‌రుగులు కాగా, మొత్తం 10,599 పరుగులు చేశాడు. అతను 50.23 బ్యాటింగ్ సగటుతో 9 సెంచరీలు సాధించాడు. 

మహ్మద్ అజారుద్దీన్

మహ్మద్ అజారుద్దీన్ 308 ఇన్నింగ్స్‌లు ఆడి 9,378 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 153* ప‌రుగులు. అతని బ్యాటింగ్ సగటు 36.92 కాగా, 7 సెంచరీలు కూడా చేశాడు.

Yuvraj Singh -Dhoni

యువరాజ్ సింగ్

యువరాజ్ సింగ్ 275 ఇన్నింగ్స్‌లు ఆడాడు. 8,609 పరుగులు చేశాడు, అత్యధిక స్కోరు 150 ప‌రుగులు. ఈ స్టార్ ఆల్ రౌండ‌ర్ బ్యాటింగ్ సగటు 36.47. వ‌న్డేల్లో 14 సెంచరీలు చేశాడు.

వీరేంద్ర సెహ్వాగ్

టీమిండియా డాషింగ్ ఒపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 235 ఇన్నింగ్స్‌లు ఆడాడు. 7,995 పరుగులు చేశాడు.  అత్యధిక స్కోరు 219 ప‌రుగులు. అతను బ్యాటింగ్ సగటు 35.37తో 15 సెంచరీలు కూడా చేశాడు.

శిఖర్ ధావన్

శిఖర్ ధావన్ 164 ఇన్నింగ్స్‌లు ఆడాడు. వ‌న్డేల్లో 6,793 పరుగులు చేశాడు.  అత్యధిక స్కోరు 143 ప‌రుగులు. అతను 44.11 బ్యాటింగ్ సగటుతో వ‌న్డేల్లో 17 సెంచరీలు కూడా చేశాడు.

Latest Videos

click me!