IPL 2025 : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025) కోసం ఏర్పాట్లు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి. రాబోయే సీజన్ కు ముందు మెగా వేలం జరగనుంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానులతో బీసీసీఐ చర్చలు జరిపింది.
MS Dhoni, Virat Kohli, Dhoni-Virat, IPL 2024,
తాజా సమాచారం ప్రకారం.. పలు ఐపీఎల్ నిబంధనలలో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశముంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐపీఎల్ ఫ్రాంచైజీలతో చర్చలు జరిపిన బీసీసీఐ అధికారులు ఈసారి పలు మార్పులు తీసుకురావాలని ప్రతిపాదించారు.
తాజాగా ముంబైలో జరిగిన బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీల సమావేశంలో మెగా వేలం, రిటైన్ ప్లేయర్ల విషయంలో చర్చ జరిగింది. ఎంత మంది ఆటగాళ్లను రిటైన్ చేయాలి అనే దాని నుండి మెగా యాక్షన్ రూల్స్ వరకు సుదీర్ఘ చర్చ సాగింది.
ఈ క్రమంలోనే బీసీసీఐ మూడు కీలక మార్పులకు శ్రీలకారం చుట్టిందని చర్చ నడుస్తోంది. రాబోయే ఐపీఎల్ కోసం మెగా వేలానికి ముందు నిబంధనలలో పెద్ద మార్పు చేయనున్నారని సమాచారం. ఐదేళ్లకు పైగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైరైన ఆటగాళ్లను అన్‌క్యాప్డ్ ప్లేయర్లుగా మళ్లీ వర్గీకరించే యోచనలో ఉంది.
అలాగే, స్టార్ ప్లేయర్లు బేస్ ధరను తగ్గించే అవకాశం కూడా ఉందని సమాచారం. దీంతో పాటు ఐపీఎల్ ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల సంఖ్య 7కు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారని క్రికెట్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
Virat Kohli, IPL 2025, IPL ,
ఇలాంటి మార్పులను బీసీసీఐ తీసుకువస్తే ధోని, జడేజా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్ ప్లేయర్లపై ప్రభావం పడనుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ సీనియర్ స్టార్లు టీ20 క్రికెట్ కు గుడ్ బై చెప్పారు.