T20 World Cup: క్రికెట్‌లో వేగవంతమైన ఫార్మాట్ అయిన టీ20లో ఒక ఇన్నింగ్స్‌లో 200 పరుగులు చేయడం పెద్ద విషయం. కానీ టీ20 ప్రపంచకప్ చరిత్రలో కొన్ని జట్లు 220–260 పరుగుల వరకు భారీ స్కోర్లు నమోదు చేశాయి. చరిత్రలో అత్యధిక జట్టు స్కోర్లలో టాప్ 10 జట్లు ఇవే.
టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక స్కోరు 2007లో నమోదైంది. కెన్యాపై శ్రీలంక 6 వికెట్లకు 260 పరుగులు చేసింది. సనత్ జయసూర్య 44 బంతుల్లో 88 పరుగులు చేయగా, మహేళ జయవర్ధనే 27 బంతుల్లో 65 పరుగులు చేశారు. లక్ష్య ఛేదనలో కెన్యా 88 పరుగులకు ఆలౌట్ అయింది. శ్రీలంక 172 పరుగుల భారీ తేడాతో గెలిచింది.
29
వెస్టిండీస్ vs జింబాబ్వే (2026) – 254/6
ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 6 వికెట్లకు 254 పరుగులు చేసింది. ఇది ప్రపంచకప్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు. షిమ్రోన్ హెట్‌మేయర్ 34 బంతుల్లో 85 పరుగులు చేయగా, రోవ్‌మన్ పావెల్ 35 బంతుల్లో 59 పరుగులు చేశారు. జింబాబ్వే 147 పరుగులకు ఆలౌట్ అయింది. వెస్టిండీస్ 107 పరుగుల తేడాతో విజయం సాధించింది.
39
ఐర్లాండ్ vs ఒమాన్ (2026) – 235/5
ఈ ప్రపంచకప్‌లో ఒమాన్‌పై ఐర్లాండ్ 5 వికెట్లకు 235 పరుగులు చేసింది. లోర్కాన్ టకర్ 51 బంతుల్లో 94 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. గారెత్ డెలానీ 56 పరుగులు, జార్జ్ డాక్‌రెల్ 9 బంతుల్లో 35 పరుగులు చేశారు. ఒమాన్ 139 పరుగులకు ఆలౌట్ అయింది.
2016 టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా-ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నాలుగో, ఐదో అత్యధిక టీమ్ స్కోర్లు నమోదయ్యాయి. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. హషీమ్ ఆమ్లా, జేపీ డుమినీ, క్వింటన్ డికాక్ అర్ధ సెంచరీలు చేశారు. అయితే, ఇంగ్లండ్ మరో 2 బంతులు మిగిలి ఉండగానే ఈ పరుగుల కొండను ఛేదించింది. జో రూట్ (44 బంతుల్లో 83), జేసన్ రాయ్ (16 బంతుల్లో 43) ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. స్కోర్
ఇంగ్లండ్ - 230/8 (19.4)
దక్షిణాఫ్రికా - 229/4 (20)
59
శ్రీలంక vs ఒమన్ (2026)
ఈ ప్రపంచకప్‌లో ఒమన్‌పై శ్రీలంక 5 వికెట్లకు 225 పరుగులు చేసింది. ఇది చరిత్రలో 6వ అత్యధిక టీమ్ టోటల్. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తరఫున కుశాల్ మెండిస్ (61), పవన్ రత్నాయకే (60), దసున్ షనక (50) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఈ భారీ స్కోరును ఛేదించే క్రమంలో ఒమన్ పోరాటం 9 వికెట్లకు 120 పరుగుల వద్ద ముగిసింది. శ్రీలంక 105 పరుగుల తేడాతో గెలిచింది.
69
ఇండియా vs ఇంగ్లండ్ (2007)
టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక టీమ్ టోటల్స్‌లో భారత్ 7వ స్థానంలో ఉంది. 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లోనే ఈ చారిత్రక మ్యాచ్ జరిగింది. ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టింది ఈ మ్యాచ్‌లోనే. భారత్ 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. గౌతమ్ గంభీర్ (58), వీరేందర్ సెహ్వాగ్ (68), యువరాజ్ సింగ్ (58) అద్భుతంగా ఆడారు. బదులుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 6 వికెట్లకు 200 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.
79
వెస్టిండీస్ vs అఫ్గానిస్థాన్ (2024)
2024 టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌పై వెస్టిండీస్ 5 వికెట్లకు 218 పరుగులు చేసింది. ఇది జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉంది. నికోలస్ పూరన్ (53 బంతుల్లో 98) అద్భుత ప్రదర్శనతో విండీస్‌కు భారీ స్కోరు అందించాడు. ఛేదనలో అఫ్గానిస్థాన్ 16.2 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌట్ అయింది. వెస్టిండీస్ 104 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
89
దక్షిణాఫ్రికా vs కెనడా (2026)
ఈ ప్రపంచకప్‌లో కెనడాపై దక్షిణాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ఇది ఈ జాబితాలో 9వ స్థానంలో ఉంది. ఎయిడెన్ మార్‌క్రమ్ 32 బంతుల్లో 59 పరుగులు చేయగా, డేవిడ్ మిల్లర్ (39*), ట్రిస్టన్ స్టబ్స్ (34*) నాటౌట్‌గా నిలిచారు. 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కెనడా బాగానే పోరాడింది. కెనడా ఇన్నింగ్స్ 8 వికెట్లకు 156 పరుగుల వద్ద ముగిసింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 57 పరుగుల తేడాతో గెలిచింది.
99
దక్షిణాఫ్రికా vs స్కాట్లాండ్ (2009)
2009 టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌పై దక్షిణాఫ్రికా 5 వికెట్లకు 211 పరుగులు చేసింది. ఈ జాబితాలో ఇది పదో స్థానంలో ఉంది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా తరఫున ఏబీ డివిలియర్స్ 34 బంతుల్లో 79 పరుగులు బాదేశాడు. జాక్వెస్ కలిస్ (31 బంతుల్లో 48) ప్రదర్శన కూడా కీలకమైంది. బదులుగా బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ పేకమేడలా కూలిపోయింది. 15.4 ఓవర్లలో 81 పరుగులకే ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా 130 పరుగుల భారీ తేడాతో గెలిచింది.