టాప్ 10లో ఆరుగురు భారతీయులే... ధోనీ, రోహిత్‌లకు అందనంత ఎత్తులో విరాట్ కోహ్లీ...

First Published Jul 12, 2021, 3:09 PM IST

సోషల్ మీడియా ఫాలోయింగ్‌లో విరాట్ కోహ్లీ క్రేజ్, రేంజ్ వేరే లెవెల్. ఆ క్రేజ్‌కి తగ్గట్టే ఆదాయం ఆర్జించడంలో ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు టీమిండియా కెప్టెన్ ‘కింగ్’ కోహ్లీ... 2021 సంవత్సరంలో అత్యధిక ఆదాయం అందుకుంటున్న టాప్ 10 క్రికెటర్లు వీరే... 

టాప్ 10 సురేష్ రైనా: భారత మాజీ వైస్ కెప్టెన్ సురేష్ రైనా, అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. అయితే ఐపీఎల్‌లో కొనసాగుతున్న రైనా, కొన్ని బ్రాండ్లకి అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. వీటి ద్వారా ఈ ఏడాదిలో రూ.22.34 కోట్లు ఆర్జించాడు సురేష్ రైనా...
undefined
టాప్ 9 ప్యాట్ కమ్మిన్స్: టెస్టుల్లో నెంబర్ 1 బౌలర్‌గా ఉన్నాడు ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమ్మిన్స్. ఐపీఎల్ 2020 మెగా వేలంలో రూ.15.50 కోట్లకు అమ్ముడుపోయిన కమ్మిన్స్, ఈ ఏడాది కాలంలో రూ.22.40 కోట్ల ఆదాయం ఆర్జించాడు.
undefined
టాప్ 8 ఏబీ డివిల్లియర్స్: అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుని మూడేళ్లు కావస్తున్నా, ‘మిస్టర్ 360’ ఏబీ డివిల్లియర్స్ ఆటలో ఏ మార్పు రాలేదు. కొన్ని బ్రాండ్లతో పాటు ఐపీఎల్‌లో రాణిస్తున్న ఏబీ డివిల్లియర్స్, ఈ ఏడాది కాలంలో రూ.22.50 కోట్ల ఆదాయం సంపాదించాడు.
undefined
టాప్ 7 జస్ప్రిత్ బుమ్రా: భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా, బీసీసీఐ కాంట్రాక్ట్ ద్వారా రూ.7 కోట్లు పొందుతున్నాడు. ఐపీఎల్, కొన్ని బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరించడం ద్వారా మొత్తంగా ఏటా రూ.31 కోట్ల 65 లక్షల ఆదాయం పొందుతున్నాడు బుమ్రా...
undefined
టాప్ 6 స్టీవ్ స్మిత్: ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్, ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో కేవలం రూ.2 కోట్లు మాత్రమే దక్కించుకున్నాడు. అయితే వివిధ బ్రాండ్ల ప్రమోషన్ ద్వారా ఏటా రూ.55.86 కోట్లు ఆర్జిస్తూ టాప్ 6లో చోటు దక్కించుకున్నాడు స్మిత్...
undefined
టాప్ 5 హార్ధిక్ పాండ్యా: ముంబై ఇండియన్స్, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా బ్రాండ్ ప్రమోషన్స్‌, ఐపీఎల్, బీసీసీఐ కాంట్రాక్ట్స్ ద్వారా ఏడాది కాలంలో రూ.59.59 కోట్లు సంపాదించాడు...
undefined
టాప్ 4 బెన్ స్టోక్స్: ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ 2020-21 ఏడాది కాలంలో క్రికెట్ కాంట్రాక్ట్, బ్రాండ్ ప్రమోషన్, సోషల్ మీడియా ద్వారా రూ.60 కోట్లు ఆర్జించాడు...
undefined
టాప్ 3 రోహిత్ శర్మ: భారత ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ... ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్. ఐపీఎల్‌లో ఐదు టైటిల్స్ అందించిన రోహిత్ శర్మ, ముంబై ఇండియన్స్ నుంచి ఏటా రూ.15 కోట్లు పొందుతున్నాడు.
undefined
ఇది కాకుండా బీసీసీఐ కాంట్రాక్ట్ ద్వారా రూ.7 కోట్లు, బ్రాండ్ల ప్రమోషన్ల ద్వారా రూ.74.49 కోట్ల ఆదాయం ఆర్జించి, టాప్ 3లో చోటు దక్కించుకున్నాడు...
undefined
టాప్ 2 ఎమ్మెస్ ధోనీ: టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ, క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినా అతని క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు.. బ్రాండ్ ప్రమోషన్‌లో కోహ్లీ తర్వాతి స్థానంలో ఉన్న ధోనీ, ఈ ఏడాది రూ.108.28 కోట్లు ఆర్జించాడు..
undefined
టాప్ 1 విరాట్ కోహ్లీ: భారత సారథి విరాట్ కోహ్లీ బీసీసీఐ కాంట్రాక్ట్ ద్వారా రూ.7 కోట్లు ఆర్జిస్తున్నాడు. ఇది కాకుండా ఐపీఎల్‌లో అత్యధిక మొత్తం ఆర్జిస్తున్న క్రికెటర్‌గా ఉన్న కోహ్లీ, ఆర్‌సీబీ నుంచి ఏటా రూ.17 కోట్లు పొందుతున్నాడు...
undefined
అనేక బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్న విరాట్ కోహ్లీ, సోషల్ మీడియాలో ప్రమోషన్ పోస్టులకు కూడా రూ.5 కోట్ల దాకా ఆర్జిస్తున్నాడు. ఈ ఏడాది కోహ్లీ సంపాదన రూ.208.56 కోట్లకు పైనే...
undefined
click me!