ఐసీసీ ట్రోఫీ కాదు, కోహ్లీ ఇప్పటిదాకా ఐపీఎల్ టైటిల్ కూడా గెలవలేదు... - సురేష్ రైనా

First Published Jul 12, 2021, 11:59 AM IST

భారత జట్టు తరుపున ఎలా ఆడినా, ఐపీఎల్‌లో మాత్రం అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తాడు సురేష్ రైనా. ‘మిస్టర్ ఐపీఎల్’గా గుర్తింపు తెచ్చుకున్న సురేష్ రైనా, ధోనీతో పాటు అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా విరాట్ కోహ్లీ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు రైనా...

‘విరాట్ కోహ్లీ నెం.1 బ్యాట్స్‌మెన్ మాత్రమే కాదు, నెం.1 కెప్టెన్ కూడా. ఇప్పటికే అతను ఎన్నో విజయాలు సాధించాడు. అతని రికార్డులను అందుకోవడం అంత ఈజీ కాదు...
undefined
అందరూ ఐసీసీ ట్రోఫీ గురించి మాట్లాడుతున్నారు, కానీ విరాట్ కోహ్లీ ఇప్పటిదాకా ఐపీఎల్ టైటిల్ కూడా గెలవలేకపోయాడు. నాకు తెలిసి అతనికి మరికొంత సమయం కావాలి...
undefined
ఈ మూడేళ్లలో రెండు, మూడు వరల్డ్‌కప్ టోర్నీలు జరగబోతున్నాయి. రెండు టీ20 వరల్డ్‌కప్‌లు, ఓ వన్డే వరల్డ్‌కప్... ఫైనల్ చేరడం అంత తేలికయ్యే పనికాదు.
undefined
కొన్నిసార్లు చిన్న చిన్న తప్పిదాల కారణంగా టైటిల్స్‌ను కోల్పోవాల్సి ఉంటుంది... అయితే ఐసీసీ టైటిల్ లేనంత మాత్రాన విరాట్ కోహ్లీ గొప్ప కెప్టెన్ కాకుండా పోడు...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ సురేష్ రైనా...
undefined
‘భారత జట్టుకి ఇప్పటికే 1983 వరల్డ్‌కప్, 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్ ఉన్నాయి. కాబట్టి మనం ఎవ్వరికంటే తక్కువేం కాదు...
undefined
భారత జట్టులోని ప్రతీ ప్లేయర్ కూడా ఎంతో కఠినంగా శ్రమిస్తున్నారు. కాబట్టి ఈ మూడు వరల్డ్‌కప్‌ల్లో భారత జట్టు సత్తా చాటుతుందని అనుకుంటున్నా. మనం ఎప్పటికీ చోకర్స్ కాదు..’ అంటూ కామెంట్ చేశాడు సురేష్ రైనా..
undefined
భారత జట్టులో చోటు కోసం ఏళ్ల పాటు ఎదురుచూసిన సురేష్ రైనా, మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటన చేసిన వెంటనే ‘నేను నీ వెంటే నడుస్తా’ నంటూ అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలికాడు...
undefined
వ్యక్తిగత కారణాల వల్ల 2020 ఐపీఎల్ సీజన్‌లో పాల్గొనలేకపోయిన సురేష్ రైనా, మహేంద్ర సింగ్ ధోనీ వచ్చే సీజన్ ఆడకపోతే, తాను కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి తప్పుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
undefined
click me!