సూర్యకుమార్ యాదవ్ రాణిస్తే, శ్రేయాస్ అయ్యర్‌ రీఎంట్రీ కష్టమే... మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...

Published : Jul 12, 2021, 01:45 PM IST

లేటుగా ఎంట్రీ ఇచ్చినా, అతి తక్కువ కాలంలో టీమిండియాలో కీలక ప్లేయర్‌గా మారిపోయాడు సూర్యకుమార్ యాదవ్. ఈ సెన్సేషనల్ ప్లేయర్, లంక సిరీస్‌లో రాణిస్తే... శ్రేయాస్ అయ్యర్ రీఎంట్రీ ఇవ్వడం కష్టమేనని అంటున్నాడు మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా...

PREV
19
సూర్యకుమార్ యాదవ్ రాణిస్తే, శ్రేయాస్ అయ్యర్‌ రీఎంట్రీ కష్టమే... మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...

ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో గాయపడకముందు వరకూ శ్రేయాస్ అయ్యర్, నాలుగో నెంబర్ బ్యాట్స్‌మెన్‌గా నిరూపించుకున్నాడు. నిలకడగా రాణిస్తూ, ఫ్యూచర్ కెప్టెన్ రేసులో కూడా నిలిచాడు...

29

అయితే ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో శ్రేయాస్ అయ్యర్ గాయపడడం, అదే సిరీస్‌లో ఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్... వన్డే, టీ20ల్లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇవ్వడం జరిగిపోయాయి... 

39

గాయం నుంచి కోలుకోవడానికి నాలుగు నెలల సమయం తీసుకున్న శ్రేయాస్ అయ్యర్, శ్రీలంక టూర్‌లో కెప్టెన్‌గా వ్యవహరించే అరుదైన అవకాశాన్ని కోల్పోయాడు... దీంతో టీమిండియాలోకి అతని రీఎంట్రీ కష్టమేనని అంటున్నాడు మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా...

49

‘ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శ్రేయాస్ అయ్యర్ రీఎంట్రీ ఇవ్వాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇప్పటికే లంక సిరీస్‌కి ఎంపకైన సూర్యకుమార్ యాదవ్, ఆ టూర్‌లో రాణిస్తే టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు సంపాదించుకోవడం పక్కా...

59

రోహిత్ శర్మతో విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తే, సూర్యకుమార్ యాదవ్ వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్‌గా ఉంటాడు. అలా కాకుండా రోహిత్, కెఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తే సూర్యకుమార్ యాదవ్ టూ డౌన్‌లో, కెఎల్ రాహుల్ త్రీ డౌన్‌లో వస్తారు...

69

కెఎల్ రాహుల్‌ను తీయలేం. అలాగని సూర్యకుమార్ యాదవ్‌ని తప్పించలేం. వీళ్లు కాకుండా మిగిలిన స్థానాలలో రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఫిక్స్ అయిపోయారు...

79

వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్‌లకు కూడా అవకాశం దక్కొచ్చు. ఎలా చూసినా ఇప్పుడు శ్రేయాస్ అయ్యర్ రీఎంట్రీ ఇవ్వాలంటే ఐపీఎల్ 2021 సీజన్‌లో అతను అదిరిపోయే పర్ఫామెన్స్ ఇవ్వాలి...

89

లేదంటే అయ్యర్‌ను ఈజీగా తీసి పక్కనపెట్టేస్తారు. ఒకవేళ టీ20 వరల్డ్‌కప్ టూర్‌కి ఎంపికైనా తుదిజట్టులో అతనికి చోటు దక్కడం అనుమానమే... 

99

అయ్యర్‌కి అనుభవం ఉంది, ఐపీఎల్‌లో కెప్టెన్సీ చేసిన అనుభవమూ ఉంది. అయితే గాయం తర్వాత తిరిగి ఎంట్రీ ఇవ్వాలంటే అతను మళ్లీ తనని తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా...

click me!

Recommended Stories