ఇదేం షెడ్యూల్‌ రా బాబోయ్! చచ్చేలా ఉన్నాం... ఇంగ్లాండ్‌ కెప్టెన్ జోస్ బట్లర్ ఫ్రస్టేషన్‌...

First Published Jan 30, 2023, 1:53 PM IST

ప్రస్తుత క్రికెట్‌లో ఎక్కువ మ్యాచులు ఆడే టీమ్ ఏందంటే అది ఆస్ట్రేలియానే. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 సీజన్‌లో ఇంగ్లాండ్ ఇప్పటికే 22 టెస్టులు ఆడేసింది. ఆ తర్వాతి ప్లేస్ ఆస్ట్రేలియాదే. ఆస్ట్రేలియా 15, ఇండియా, పాకిస్తాన్ టీమ్స్ 14 టెస్టులు ఆడాయి... వన్డేల విషయంలోనూ అంతే! 

నవంబర్‌లో టీ20 వరల్డ్ కప్ 2022 టైటిల్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు, ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లి మూడు వన్డేలు ఆడింది. వర్లడ్ కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత 4 రోజుల గ్యాప్‌లో జరిగిన ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది ఇంగ్లాండ్ జట్టు...

Image credit: Getty

ఆ తర్వాత పాకిస్తాన్‌పై టెస్టు సిరీస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు, ప్రస్తుతం సౌతాఫ్రికా టూర్‌లో వన్డే సిరీస్ ఆడుతోంది. తొలి రెండు వన్డేల్లో ఓడిన ఇంగ్లాండ్, ఆఖరి మ్యాచ్‌లో అయినా గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది...

Jos Buttler-Alex Hales

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ తర్వాత న్యూజిలాండ్ పర్యటనకి వెళ్లే ఇంగ్లాండ్ జట్టు అక్కడ 2 టెస్టులు ఆడుతుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌కి వెళ్లి మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులు ఆడుతుంది...

‘ఇలాంటి బిజీ షెడ్యూల్‌తో మూడు ఫార్మాట్లు ఆడాలంటే అయ్యే పని కాదు. నేను కుర్రాడిగా ఉన్నప్పుడు ఇలాంటి టైట్ షెడ్యూల్ లేదు. ఈ బిజీ షెడ్యూల్‌తో ఫ్రస్టేషన్ పెరిగిపోయి పిచ్చి ఎక్కుతోంది...

Image credit: Getty

స్వేచ్ఛగా తిరిగే పావురాన్ని, పంజరంలో బంధించినట్టుగా తీరిక లేకుండా అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి అంటూ దేశాలు తిరగాల్సి వస్తోంది. ఓ దేశానికి వెళ్లి, అక్కడి వాతావరణానికి అలవాటు పడేలోపు, మరో దేశానికి వెళ్లాల్సి వస్తోంది.. ఇలాంటి షెడ్యూల్ వల్ల ప్లేయర్లు ఫ్రీగా ఆడలేకపోతున్నారు...

ఇప్పుడు ఒకే ఒక్క ఆప్షన్ ఉంది. సిరీస్‌ పోతే పోయిందని కొందరు ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చి, ప్రయోగాలు చేయాలి. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ప్లేయర్లను మానసికంగా, శారీరకంగా సిద్ధం చేయాలి... 

Jos Buttler

ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, కాస్త ప్లేయర్లను కూడా దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్ తయారుచేస్తే బెటర్... ఎందుకంటే మ్యాచులు ఆడడం కంటే గెలవడం కూడా చాలా ముఖ్యం...’ అంటూ చెప్పుకొచ్చాడు ఇంగ్లాండ్ వైట్ బాల్ కెప్టెన్ జోస్ బట్లర్...

click me!