హార్ధిక్ పాండ్యా ప్లాన్ అదే... టీ20 వరల్డ్ కప్‌ 2024లోనూ ఉమ్రాన్ మాలిక్, పృథ్వీ షాలకు నో ఛాన్స్...

First Published | Jan 30, 2023, 1:26 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా ఓ క్లియర్ ప్లాన్‌తో బరిలో దిగింది. అనుకున్న ఓ 15 మంది ప్లేయర్లను వరుసగా ఆడిస్తూ సంజూ శాంసన్, ఉమ్రాన్ మాలిక్ వంటి ప్లేయర్లను పక్కనబెడుతూ వచ్చింది. ఫలితం సెమీ ఫైనల్‌లో ఓటమి...

Image credit: PTI

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ వంటి సీనియర్లు.. టీ20 ఫార్మాట్‌‌కి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఐపీఎల్ 2023 తర్వాత వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఆడే భారత జట్టు, నేరుగా వన్డే వరల్డ్ కప్ 2023 ట్రోఫీ ఆడుతుంది...

Image credit: PTI

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ వంటి సీనియర్లు.. పొట్టి ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలంటే అద్భుతం జరగాల్సిందే. స్వదేశంలో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ సేన టైటిల్ గెలవడంలో ఫెయిల్ అయితే సీనియర్లు, పొట్టి ఫార్మాట్‌ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే...


Image credit: PTI

హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో టీ20 సిరీస్‌లు ఆడుతున్న భారత జట్టు, వరుసగా ఫెయిల్ అవుతున్నా కొందరు ప్లేయర్లకు అనేక అవకాశాలు ఇస్తూ ప్రోత్సాహిస్తోంది. ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి వంటి బౌలర్లను సరిగా వాడుకునేందుకు హార్ధిక్ పాండ్యా ఇంట్రెస్ట్ చూపించడం లేదు...
 

సంజూ శాంసన్ గాయంతో జట్టుకి దూరమైతే పృథ్వీ షా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. చూస్తుంటే హార్ధిక్ పాండ్యా కూడా రోహిత్ శర్మ మాదిరిగానే టీమ్‌పైన తన ముద్ర వేసుకునేందుకు కొందరు ప్లేయర్లను కావాలని పక్కనబెడుతున్నాడని అంటున్నారు అభిమానులు..
 

Image credit: PTI

పృథ్వీ షా, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి, సంజూ శాంసన్ వంటి ప్లేయర్లు వచ్చే టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో చోటు దక్కించుకోవడం కూడా కష్టమేనని రెండేళ్లకు ముందే తేల్చేస్తున్నారు.. 

Image credit: PTI

విరాట్ కోహ్లీ తయారుచేసిన టీమ్‌తో టీ20 వరల్డ్ కప్ 2022 ఆడితే క్రెడిట్, అతనికే పోతుందని రోహిత్ శర్మ భావించి...  ప్రయోగాలతో అనవసర మార్పులు చేసి చేతులు కాల్చుకున్నాడని హార్ధిక్ పాండ్యా తీరు కూడా అలాగే కనిపిస్తోందని అంటున్నారు నెటిజన్లు.. 

Latest Videos

click me!