గ్రౌండ్‌లో ఎన్ని గొడవలు ఉన్నా, చివరికి మిగిలేది అదొక్కటే! కోహ్లీ - నవీన్ ఉల్ హక్ ఎపిసోడ్‌పై రవిశాస్త్రి

Chinthakindhi Ramu | Published : Oct 12, 2023 2:56 PM
Google News Follow Us

ఐపీఎల్ 2023 టోర్నీలో లక్నో సూపర్ జెయింట్స్, ఆర్‌సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మొత్తం 2023 సీజన్‌లోనే హాట్ టాపిక్‌గా నిలిచిన గొడవ ఇదే.. ఈ గొడవ అక్కడితో ఆగలేదు..
 

19
గ్రౌండ్‌లో ఎన్ని గొడవలు ఉన్నా, చివరికి మిగిలేది అదొక్కటే! కోహ్లీ - నవీన్ ఉల్ హక్ ఎపిసోడ్‌పై రవిశాస్త్రి
Naveen Ul haq

ఆర్‌సీబీ ఓడిపోతున్న మ్యాచ్‌ని పోస్ట్ చేసిన నవీన్ ఉల్ హక్, ‘మామిడి పండ్లు బాగున్నాయ్’ అంటూ కాప్షన్ ఇవ్వడంతో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌ అతన్ని శత్రువుగా భావించారు. నవీన్ ఉల్ హక్‌ని ట్రోల్ చేస్తూ అనేక పోస్టులు చేశారు..

29

నవీన్ ఉల్ హక్ పోస్టులకు, విరాట్ కోహ్లీ పోస్టులు కూడా మ్యాచ్ అవ్వడంతో ఈ ఇద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా సైలెంట్ వార్ నడిచింది. అభిమానులు కూడా ఈ విషయం గురించి తెగ చర్చించుకున్నారు..
 

39

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆఫ్ఘాన్ మ్యాచ్‌ని చాలా మంది విరాట్ కోహ్లీ వర్సెస్ నవీన్ ఉల్ హక్ మ్యాచ్‌గా చూశారు. అయితే అసలు మ్యాచ్‌లో జరిగింది వేరు..
 

Related Articles

49
Virat Kohli-Naveen-ul-Haq

నవీన్ ఉల్ హక్‌ని ఢిల్లీ ఫ్యాన్స్ తీవ్రంగా ట్రోల్ చేయడాన్ని గమనించిన విరాట్ కోహ్లీ, వద్దని చేతులు ఊపుతూ వారిని వారించాడు. ఈ సంఘటన తర్వాత విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్ చేతులు కలుపుతూ కౌగిలించుకుని, గొడవకు ముగింపు పలికారు..

59

‘ఆటలో గొడవలు కూడా ఓ భాగమే. గతం ఎలా ఉన్నా, దాన్ని వదిలి ముందుకు వెళ్లాల్సిందే. సమయం కంటే గొప్ప వైద్యుడు లేడు. ఆటలో అన్నీ మనకి అనుకూలంగా జరగకపోవచ్చు.. అయితే ఆశించిన ఫలితం రానప్పుడు కూడా స్వాగతించాలి..

69
Kohli and Naveen

విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్ కౌగిలించుకున్న దృశ్యం, పెద్ద స్క్రీన్ మీద రావడం చాలా గొప్పగా అనిపించింది. ఎందుకంటే గ్రౌండ్‌లో ఎన్ని గొడవలు ఉన్నా, చివరికి క్రీడా స్ఫూర్తి గెలవాలి.. 

79

కోపం వచ్చినప్పుడు ఆవేశంలో అందరూ నోరు జారుతారు. తిట్టుకుంటారు. అయితే ఆటలో జరిగిన విషయాలను కొనసాగించడం కరెక్ట్ కాదు. అందుకే ఇలాంటివి చూసినప్పుడు మంచిగా అనిపిస్తుంది...
 

89
Virat Kohli-Naveen Ul Haq Fight

ఆరు నెలలు గడిచాయి. ఈ గొడవకు ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని ఇద్దరూ గుర్తించి ఉంటారు. అన్నింటినీ హృదయానికి తీసుకోకూడదు.

99
Virat Kohli-Naveen Ul Haq

డ్రెస్సింగ్ రూమ్‌లో కాకుండా గ్రౌండ్‌లో అందరూ చూస్తుండగా ఈ గొడవకు ముగింపు పలకడం చాలా గొప్ప విషయం...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి.. 

Recommended Photos