ICC Cricket World Cup 2023 : హిట్ మ్యాన్ దెబ్బకు రికార్డులన్నీ ఫట్టే... రోహిత్ మాస్టర్ బ్లాస్టర్ నే దాటేసాడుగా

First Published Oct 12, 2023, 11:11 AM IST

వరల్డ్ కప్ లో టీమిండియా తలపడిన తొలి మ్యాచ్ లో తడబడిన రోహిత్ ఆ తర్వాతి మ్యాచ్ బౌలర్ల తాటతీసాడు. అద్భుత సెంచరీతో అప్ఘాన్ బౌలర్లకు చుక్కలు చూపించడమే కాదు రికార్డుల మోత మోగించాడు. 

Rohit Sharma

న్యూడిల్లీ : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను క్రికెట్ ఫ్యాన్స్ 'హిట్ మ్యాన్' అని అభిమానంతో పిలుచుకుంటారు. అతడి బ్యాటింగ్ ను చూసినవారు ఎవరైనా ఆ పేరు అతడికి సరిగ్గా సరిపోతుందని ఒప్పుకోక తప్పదు. తనదైన రోజున బ్యాట్ తో ఆకాశమే హద్దుగా చెలరేగడం రోహిత్ స్టైల్. ఇలా ఐసిసి వన్డే వరల్డ్ కప్ 2023 లో భాగంగా నిన్న పసికూన అప్ఘానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ మరోసారి విశ్వరూపం చూపించాడు. న్యూడిల్లీలో పరుగుల సునామీ సృష్టించి టీమిండియాకు ఘన విజయాన్ని అందించడమే కాదు తన ఖాతాలో అరుదైన రికార్డులు వేసుకున్నారు రోహిత్. 
 

sachin tendulkar rohit sharma

ఇంతకాలం వన్డే వరల్డ్ కప్ లో అత్యధిక సెంచరీల రికార్డ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట వుండేది. నిన్నటి సెంచరీతో ఆ రికార్డును బద్దలుగొట్టాడు రోహిత్... అదికూడా సచిన్ కంటే తక్కువ ఇన్నింగ్స్ లోనే. సచిన్ ఆరు ప్రపంచ కప్ టోర్నీల్లో ఆరు సెంచరీలు చేస్తే రోహిత్ కేవలం మూడో వరల్డ్ కప్ లోనే ఆ ఫీట్ సాధించాడు. అప్ఘానిస్తాన్ పై సాధించిన సెంచరీ ద్వారా రోహిత్ వరల్డ్ కప్ సెంచరీల సంఖ్య ఏడుకు చేరుకుంది. ఇలా 1992, 1996, 1999, 2003, 2007, 2011 వరల్డ్ కప్స్ ఆడితేకానీ దిగ్గజ క్రికెటర్ సచిన్ కు సాధ్యంకాని రికార్డును ఇంకా మూడో వరల్డ్ ఆరంభంలోనే బద్దలుగొట్టి ఇది కదా అసలు హిట్ మ్యాన్ షో అని నిరూపించుకున్నాడు రోహిత్. 

Kohli Rohit

కేవలం సచిన్ సెంచరీల రికార్డుతో పాటు మరికొన్ని రికార్డులను సైతం ఈ సూపర్ సెంచరీ ద్వారా బద్దలుగొట్టాడు టీమిండియా కెప్టెన్. అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లు సచిన్, కోహ్లీ సరసన తాజాగా రోహిత్ చేరాడు. సచిన్ 49 సెంచరీలతో మొదటి స్థానంలో, కోహ్లీ 47  సెంచరీలతో రెండో స్థానంలో వుంటే ఆ తర్వాత మూడో స్థానంలో రోహిత్ నిలిచాడు. తాజా సెంచరీకి ముందుకు ఆసిస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (30 సెంచరీలు) తో కలిసి ఈ స్థానాన్ని పంచుకున్నారు రోహిత్. ఇప్పుడు 31 సెంచరీలతో పాంటింగ్ ను నాలుగో స్థానానికి నెట్టాడు. ఇలా వన్డే చరిత్రలో అత్యధిక సెంచరీలతో టాప్ లో నిలిచిన ముగ్గురూ టీమిండియా క్రికెటర్లే కావడం విశేషం. 

Rohit Sharma

ఇక వన్డే ప్రపంచకప్ లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన భారత క్రికెటర్ గా రోహిత్ నిలిచాడు. మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ 72 బంతుల్లో సెంచరీ చేస్తే రోహిత్ కేవలం 63 బంతుల్లో సెంచరీ చేసి ఆ రికార్డును బద్దలుగొట్టాడు. మొత్తంగా ప్రపంచ కప్ టోర్నీలో రోహిత్ ది ఆరో ఫాస్టెస్ట్ సెంచరీ.  

Rohit Sharma

అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సిక్సర్ల రికార్డును కూడా రోహిత్ బ్రేక్ చేసాడు. అప్ఘాన్ తో జరిగిన మ్యాచ్ లో హిట్టింగ్ ద్వారా రోహిత్ సిక్సుల సంఖ్య 556 కు చేరుకుంది. దీంతో క్రిస్ గెల్ 553 హయ్యెస్ట్ సిక్సర్ల రికార్డ్ బద్దలయి రోహిత్ పేరిట నమోదయ్యింది. 

click me!