ఢిల్లీలో ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది టీమిండియా. వరుస రెండు విజయాలతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది భారత్.. మొదటి రెండు మ్యాచుల్లో భారీ విజయాలు అందుకున్న న్యూజిలాండ్, టాప్‌లో కొనసాగుతోంది...
డెంగ్యూతో బాధపడుతూ టీమిండియా ఆడిన మొదటి రెండు మ్యాచుల్లో ఆడలేకపోయిన శుబ్‌మన్ గిల్, పూర్తిగా కోలుకున్నాడు. రెండో మ్యాచ్ కోసం టీమిండియా, చెన్నై నుంచి ఢిల్లీ వెళ్లింది..
అయితే శుబ్‌మన్ గిల్ మాత్రం చెన్నైలోనే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్నాడు. పూర్తిగా కోలుకోవడంతో మూడో మ్యాచ్ కోసం అహ్మదాబాద్ చేరుకున్న శుబ్‌మన్ గిల్, అక్టోబర్ 12 నుంచి ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొనబోతున్నాడు..
అక్టోబర్ 14న పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ ఆడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మొదటి రెండు మ్యాచుల్లో ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్ కిషన్, తీవ్రమైన ఒత్తిడితో ఆడుతున్నట్టు స్పష్టంగా కనిపించింది..
ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో డకౌట్ అయిన ఇషాన్ కిషన్, ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. శుబ్‌మన్ గిల్ కోలుకోవడంతో ఇషాన్ కిషన్ రిజర్వు బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది..
సొంతరాష్ట్రమైన అహ్మదాబాద్‌లో శుబ్‌మన్ గిల్‌కి అదిరిపోయే రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన 10 మ్యాచుల్లో 87.25 సగటుతో 698 పరుగులు చేశాడు శుబ్‌మన్ గిల్. ఇందులో 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి..