విరాట్ కోహ్లీకి కూడా టెండూల్కర్‌లా మారే టైం వచ్చింది... పాక్ మాజీ క్రికెటర్ షాహిదీ ఆఫ్రిదీ..

First Published Jan 18, 2022, 4:14 PM IST

దాదాపు ఏడేళ్ల తర్వాత మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు విరాట్ కోహ్లీ. తొలుత టీ20ల నుంచి ఆ తర్వాత వన్డే, టెస్టుల్లో కెప్టెన్సీల నుంచి తప్పుకున్న విరాట్, సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌ ద్వారా మళ్లీ ఓ సాధారణ ప్లేయర్‌గా బరిలో దిగబోతున్నాడు...

2014లో ఎమ్మెస్ ధోనీ నుంచి టెస్టు కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్న తర్వాత దాదాపు ఏడున్నరేళ్లకు సాధారణ ప్లేయర్‌గా క్రికెట్ ఆడబోతున్నాడు విరాట్ కోహ్లీ...

టెస్టు సారథిగా ఉన్న సమయంలోనే వన్డే, టీ20ల్లో వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన విరాట్ కోహ్లీ... ఇప్పుడు పూర్తిగా కెప్టెన్సీకి దూరమయ్యాడు...

తన సారథ్యంలో మూడు ఫార్మాట్లలో ఎంట్రీ ఇచ్చిన కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ ఎలా ఆడతాడనేది క్రికెట్ ఫ్యాన్స్‌కి ఆసక్తికరంగా మారింది...

‘విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ఎందుకు వదిలేశాడనేది నా దృష్టిలో అనవసరం. ఎందుకంటే అతను ఇప్పటికే దాదాపు ఏడేళ్లు జట్టును విజయవంతంగా నడిపించాడు...

ఇప్పుడు కరెక్ట్ సమయంలో కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ ఒత్తిడిని తట్టుకునే స్తోమత తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి కెప్టెన్సీకి దూరంగా ఉండడం మంచిదే...

ఇప్పుడు విరాట్ కోహ్లీ, టీమ్ పర్ఫెమెన్స్‌ గురించి, గేమ ప్లాన్ గురించి, మిగిలిన విషయాల గురించి ఆలోచిస్తూ బుర్ర పాడుచేసుకోవాల్సిన అవసరం లేదు...

ఓ కెప్టెన్‌గా టీమ్‌కి కావాల్సిన దానికంటే ఎక్కువే సాధించాడు విరాట్. టీమిండియాని టాప్ టీమ్‌గా మలచడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు.

ఇప్పుడు విరాట్ కేవలం బ్యాటింగ్‌పైన ఫోకస్ పెడితే చాలు. క్రికెట్‌ని ఎంజాయ్ చేస్తూ సచిన్ టెండూల్కర్‌లా మారాల్సిన సమయం వచ్చింది...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ కెప్టెన్, ఆల్‌రౌండర్ షాహిదీ ఆఫ్రిదీ...

click me!