లేటు వయసులో ఘాటు రొమాన్స్... టెన్నిస్ స్టార్ లియండర్ పేస్‌తో యువరాజ్ మాజీ ప్రేయసి...

Published : Jan 18, 2022, 02:19 PM IST

బాలీవుడ్ హీరోయిన్‌గా కిమ్‌ శర్మకి వచ్చిన క్రేజ్ కంటే భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రేయసిగా మంచి పాపులారిటీయే ఎక్కువ. నాలుగేళ్లపాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన యువీ, కిమ్ శర్మ... ఆ తర్వాత విడిపోయారు... ఇప్పుడు కిమ్ శర్మ, టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్‌తో డేటింగ్‌లో ఉంది...

PREV
114
లేటు వయసులో ఘాటు రొమాన్స్... టెన్నిస్ స్టార్ లియండర్ పేస్‌తో యువరాజ్ మాజీ ప్రేయసి...

ప్రస్తుతం బాలీవుడ్ హాట్ బ్యూటీ కిమ్ శర్మ, టెన్నిస్ స్టార్ ప్లేయర్ లియాండర్ పేస్‌తో డేటింగ్ చేస్తోంది. 48 ఏళ్ల లియాండర్ పేస్, 41 ఏళ్ల కిమ్ శర్మ కలిసి ప్రస్తుతం ఫ్లోరిడాలోని వాల్ట్ డిస్నీ వరల్డ్‌లో చెట్టాపెట్టాలేసుకుని తిరుగుతున్నారు...

214

డిస్నీ వరల్డ్‌లో ఒకే ఐస్‌క్రీమ్‌ను ఇద్దరూ కొరుక్కుతింటూ ఘాటు రొమాన్స్‌లో తేలియాడుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు లియాండర్ పేస్, కిమ్ శర్మ... 

314

భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, బాలీవుడ్ హాట్ బ్యూటీ కిమ్ శర్మ మధ్య నాలుగేళ్ల పాటు ప్రేమాయణం సాగింది. పబ్లిక్‌గా చట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట, 2007లో విడిపోయారు...

414

తెలుగులో ‘ఖడ్గం’, ‘యాగం’ వంటి సినిమాల్లో నటించిన కిమ్ శర్మతో నాలుగేళ్ల పాటు డేటింగ్ చేశాడు యువరాజ్ సింగ్. ఈ ఇద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి...

514

యువీ తల్లిదండ్రులతో కూడా కిమ్ శర్మ చనువుగా ఉండడంతో వీరి పెళ్లి ఖాయమనుకున్నారంతా. అయితే ఏమైందో ఏమో వీరిద్దరికీ 2007లో బ్రేకప్ అయిపోయింది...

614

మూడేళ్ల పాటు ఒంటరిగా ఉన్న కిమ్ శర్మ, ఆ తర్వాత కెన్యా బిజినెస్‌మ్యాన్ అలీ పుంజానీని పెళ్లాడింది. అయితే ఈ వివాహ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు...

714

కిమ్‌శర్మను ఆర్థికంగా కూడా వాడుకున్న అలీ పుంజనీ, ఆమెను అన్నివిధాలుగా దెబ్బతీశాడు. దీంతో 2016లో అతనితో విడాకులు తీసుకుంది కిమ్ శర్మ...

814

కిమ్‌శర్మ విడాకులు తీసుకున్న సమయంలోనే ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్ యువరాజ్ సింగ్, హీరోయిన్ హజెల్ కీచ్‌ను పెళ్లాడడం విశేషం...

914

అలీతో విడాకులు తీసుకున్న తర్వాత కిమ్ శర్మ... అర్జున్‌ రాంపాల్, హర్షవర్థన్ రాణేలతో డేటింగ్ నడిపిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడీ లిస్టులోకి టెన్నిస్ మాజీ ప్లేయర్ లియాండర్ పేస్ వచ్చాడు...

1014

ఒలింపిక్స్‌లో పతకం సాధించిన చివరి భారత టెన్నిస్ ప్లేయర్‌గా ఉన్న లియాండర్ పేస్, ఇప్పటికే ముగ్గురు హీరోయిన్‌లతో ప్రేమాయణం నడిపాడు...

1114

‘పర్‌దేశీ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సెన్సేషనల్ హీరోయిన్ మహీమా చౌదరితో 2000 నుంచి 2003 దాకా డేటింగ్ నడిపించాడు లియాండర్ పేస్. అయితే వీరి బంధం మూడేళ్లలోనే వీగిపోయింది..

1214

ఆ తర్వాత సంజయ్ దత్ మాజీ భార్య రియా పిల్లాయ్‌తో లియాండర్ పేస్‌కి అనుబంధం కుదిరింది. 2005 నుంచి 9 ఏళ్ల పాటు ఈ ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. ఈ రిలేషన్‌షిప్ కారణంగా ఈ ఇద్దరికీ ఓ కూతురు కూడా జన్మించింది...

1314

అయితే 2014లో రియాతో కూడా విడిపోయాడు లియాండర్ పేస్. ఏడేళ్ల పాటు ఒంటరిగా ఉన్న లియాండర్ పేస్, ప్రస్తుతం కిమ్ శర్మతో ఎంజాయ్ చేస్తున్నాడు...

1414

గోవాలోని రెస్టారెంట్లలో కలిసి ఆరగిస్తూ, బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ, రిస్టార్లలో తిరుగుతూ ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి, రచ్చ చేసిన ఈ జోడీ... ఇప్పుడు ఫ్లోరిడాలో ప్రత్యక్షమైంది.... 

click me!

Recommended Stories