వాళ్లదే ది బెస్ట్ బౌలింగ్, ఎన్నో కష్టాలను అనుభవించి... సౌతాఫ్రికా బ్యాటర్ కీగన్ పీటర్సన్...

First Published Jan 18, 2022, 2:02 PM IST

30 ఏళ్లల్లో సాధ్యం కాని సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ గెలవాలనే భారత జట్టు కలను ఈసారి కూడా నెరవేరకుండా చేసిన ఘనత సఫారీ బ్యాట్స్‌మెన్ కీగన్ పీటర్సన్‌కే దక్కుతుంది. అటు బ్యాటింగ్‌లో, ఇటు ఫీల్డింగ్‌లో దుమ్మురేపి సౌతాఫ్రికా టెస్టు సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు కీగన్ పీటర్సన్...

భారత జట్టుతో జరిగిన టెస్టు సిరీస్‌లో 46.0 సగటుతో 276 పరుగులు చేసిన కీగన్ పీటర్సన్, కేప్ టౌన్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 82 పరుగులు చేసి సౌతాఫ్రికాకి అద్భుత విజయాన్ని అందించాడు... 

సిరీస్‌లో మూడు హాఫ్ సెంచరీలు చేసిన కీగన్ పీటర్సన్, మూడో టెస్టులో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు కూడా గెలిచాడు...

రెండో ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్‌తో ఛతేశ్వర్ పూజారాని అవుట్ చేసిన కీగన్ పీటర్సన్, భారత జట్టు భారీ స్కోరు చేయకుండా నిలువరించడంలో తన వంతు పాత్ర పోషించాడు...

‘భారత బౌలింగ్ అటాక్, నా కెరీర్‌లో ఎదుర్కొన్న ది బెస్ట్ బౌలింగ్... ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కానీ, ఫ్రాంఛైజీ క్రికెట్‌లో కానీ ఇలాంటి బౌలింగ్ ఎదుర్కోలేదు...

అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు నేను చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నాకు క్రికెట్ తప్ప మరోటి తెలీదు. అందుకే క్రికెటర్ కావాలనేది ఒక్కటే లక్ష్యంగా పెట్టుకుని, సాధించాను... 

నా క్రికెట్ ప్రయాణం చాలా ప్రత్యేకమైనది.  కేప్ టౌన్ టెస్టులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలవడం నమ్మలేకపోయాను...

నేను, నా కుటుంబం, నాతో సన్నిహితంగా ఉండే ప్రతీ ఒక్కరూ ఈ విషయం తెలిసి ఎంతగానో సంతోషించారు. ఎందుకంటే వరల్డ్ క్లాస్ బౌలింగ్ అటాక్‌ను ఎదుర్కొంటూ నేను చేసిన పరుగులు సంతృప్తినిచ్చాయి...’ అంటూ కామెంట్ చేశాడు కీగన్ పీటర్సన్...

28 ఏళ్ల కీగన్ పీటర్సన్, వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా ఆరంగ్రేటం చేశాడు. ఆ సిరీస్‌లో పెద్దగా పరుగులు చేయకపోయినా, భారత్‌తో సిరీస్‌లో చోటు దక్కించుకుని సత్తా చాటాడు...

click me!