Tilak Varma : టీ20 సెంచ‌రీ కొట్టిన యంగెస్ట్ ప్లేయ‌ర్ గా తిల‌క్ వ‌ర్మ రికార్డు

First Published | Nov 13, 2024, 11:14 PM IST

IND vs SA - Tilak Varma : మూడో టీ20 మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై తెలుగు తేజం తిల‌క్ వ‌ర్మ సూపర్ సెంచ‌రీతో అద‌ర‌గొట్టాడు. సెంచ‌రీ కొట్టిన యంగెస్ట్ ప్లేయ‌ర్ గా ఘనత సాధించాడు.

IND vs SA - Tilak Varma : సౌతాఫ్రికాతో జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్ లో మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్ వర్మ ప్రోటీస్ జ‌ట్టు బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు. ఫోర్లు, సిక్సర్లు బాది కెరీర్‌లో తొలి అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. 51 బంతుల్లో సెంచ‌రీ కొట్టాడు. 

Tilak Varma

తిలక్ వ‌ర్మ త‌న సెంచ‌రీ ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. 107 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్ లో సెంచ‌రీ కొట్టిన తొలి తెలుగు ప్లేయ‌ర్ గా నిలిచాడు. అలాగే, టీ20 క్రికెట్ లో భార‌త్ త‌ర‌ఫున‌ సెంచ‌రీ కొట్టిన తొలి తెగులు ప్లేయ‌ర్ గా నిలిచాడు. అలాగే, సెంచ‌రీ కొట్టిన తెలుగు యంగెస్ట్ ప్టేయ‌ర్ గా ఘ‌న‌త సాధించాడు. 

తిల‌క్ వ‌ర్మ భార‌త్ త‌ర‌ఫున సెంచ‌రీ కొట్టిన రెండో యంగెస్ట్ ప్లేయ‌ర్ గా నిలిచాడు. తిలక్ వ‌ర్మ‌కు టీ20 కెరీర్ లో ఇదే అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోర్ కావ‌డం విశేషం. తిలక్ వ‌ర్మ దక్షిణాఫ్రికాపై T20I సెంచరీ చేసిన యంగెస్ట్ ప్లేయ‌ర్ గా నిలిచాడు. 2010లో రైనా సాధించిన రికార్డును బ్రేక్ చేశాడు. సెంచూరియ‌న్ లో తిల‌క్ వ‌ర్మ‌ అద్భుత‌మైన సెంచ‌రీతో భార‌త జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 219 ప‌రుగులు చేసింది.


Tilak Varma

భారత్ తరపున T20I సెంచరీలు సాధించిన యంగెస్ట్ ప్లేయ‌ర్లు వీరే 

21 ఏళ్ల‌ 279 రోజులు - యశస్వి జైస్వాల్ 100 ప‌రుగులు vs నేపాల్, హాంగ్జౌ 2023
22 ఏళ్ల 5 రోజులు - తిలక్ వర్మ 100* ప‌రుగులు vs సౌతాఫ్రికా, సెంచూరియన్ 2024
23 ఏళ్ల‌ 146 రోజులు శుభ్ మాన్ గిల్ 126 ప‌రుగులు vs న్యూజిలాండ్ అహ్మ‌దాబాద్ 2023
23 ఏళ్ల 156 రోజులు - సురేష్ రైనా 101 ప‌రుగులు, సౌతాఫ్రికా, గ్రాస్ ఐలెట్ 2010

Tilak Varma

త‌న సెంచ‌రీపై తిలక్ వర్మ మాట్లాడుతూ.. త‌న గాయం నుంచి కోలుకుని వ‌చ్చిన త‌ర్వాత సెంచ‌రీ చేయ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని తెలిపాడు.  "గాయం నుండి తిరిగి వ‌చ్చిన త‌ర్వాత ఈ సెంచ‌రీ రావ‌డం అద్భుతమైన అనుభూతి. ప్రారంభంలో సవాలుగా ఉంది. కొంత స‌మ‌యం త‌ర్వాత బ్యాటింగ్ కు అనుకూలించింది. షాట్లు ఆడుతున్నప్పుడు నేను దానిని ఎంజాయ్ చేశాను. వికెట్లు ప‌డిన త‌ర్వాత మేమిద్దరం (అతను అభిషేక్ శర్మ) ఒత్తిడిలో ఉన్నాం. నేటి నాక్స్ మాకు ముఖ్యమైనవి. మన స్పిన్నర్లు బాగా బౌలింగ్ చేస్తున్నారు. 200-210 స్కోర్ కోసం ప్ర‌య‌త్నం చేశాం. దానిని అందుకున్నాం. త‌ప్ప‌కుండా దీనిని రక్షించుకోగ‌ల‌మ‌ని ఆశిస్తున్నామని" చెప్పాడు.

Tilak Varma

కాగా, సంజూ శాంస‌న్ ఔట్ అయిన త‌ర్వాత భార‌త స్కోర్ బోర్డును అభిషేక్ శ‌ర్మ‌తో క‌లిసి ముందుకు న‌డిపించాడు తిల‌క్ వ‌ర్మ‌. సంజూ శాంసన్ వికెట్ తర్వాత, తిలక్ వర్మ, అభిషేక్ శర్మలు ఫిఫ్త్ గేర్‌లో బ్యాటింగ్ చేసి స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించారు. ఇద్దరు ఆటగాళ్లు 27 బంతుల్లో 56 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌కు ప్రాణం పోశారు. ఈ క్ర‌మంలోనే 107 పరుగుల వద్ద టీమ్ ఇండియాకు రెండో ఎదురుదెబ్బ తగిలింది. పేలుడు బ్యాటింగ్ కు దిగిన అభిషేక్ శర్మ ఫిఫ్టీ కొట్టిన వెంటనే ఔటయ్యాడు. అతను 25 బంతుల్లో 50 పరుగుల వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 

Latest Videos

click me!