సెంచూరియ‌న్ లో తెలుగోడి దెబ్బ‌.. సౌతాఫ్రికాపై తిల‌క్ వ‌ర్మ సూపర్ సెంచ‌రీ

First Published | Nov 13, 2024, 10:28 PM IST

IND vs SA - Tilak Varma : మూడో టీ20 మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టు రెండో బంతికే టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చింది. మార్కో జాన్సన్ చేతిలో సంజూ శాంసన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే, ఆ త‌ర్వాత తెలుగు ప్లేయ‌ర్ తిలక్ వర్మ, అభిషేక్ శర్మలు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చారు.
 

Tilak Varma

IND vs SA - Tilak Varma: సెంచూరియ‌న్ జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్ లో తెలుగోడి దెబ్బ‌కు సౌతాఫ్రికాకు దిమ్మ‌తిరిగిపోయింది. తిల‌క్ వ‌ర్మ ఫోర్లు, సిక్స‌ర్ల‌తో సౌతాఫ్రికా బౌల‌ర్ల‌ను చెడుగుడు ఆడుకున్నాడు. సూప‌ర్ సెంచ‌రీతో త‌న బ్యాట్ ప‌వ‌ర్ ఏంటొ చూపించాడు. దీంతో భార‌త జ‌ట్టు మూడో టెస్టులో 200 ప‌రుగుల మార్కును అందుకుంది. 

Tilak Varma

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా 

సెంచూరియన్‌లోని సూప‌ర్ స్పోర్ట్స్ పార్క్ వేదిక‌గా భార‌త్-సౌతాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య మూడో టీ20 మ్యాచ్ జ‌రిగింది. ఇప్పటివరకు రెండు టీ20ల్లోనూ దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మూడో టెస్టులో కూడా ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు టాస్ గెలిచి బౌలింగ్  ఎంచుకుంది. దీంతో భారత జట్టు మరోసారి తొలుత‌ బ్యాటింగ్‌కు దిగింది. భారత జట్టు ప్లేయింగ్ XIలో రమణదీప్ సింగ్ అరంగేట్రం చేశాడు.

గత మ్యాచ్ లాగే దక్షిణాఫ్రికా జట్టు శుభారంభం చేసింది. రెండో బంతికే టీమ్ ఇండియాకు భారీ షాక్ తగిలింది. మార్కో జాన్సన్ చేతిలో సంజూ శాంసన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ సిరీస్ లో తొలి  మ్యాచ్ లో సెంచ‌రీ కొట్టిన సంజూ.. త‌ర్వాతి రెండు మ్యాచ్ ల‌లో నిరాశ‌ప‌రిచాడు. ఆ త‌ర్వాత తిలక్ వర్మ, అభిషేక్ శర్మలు భార‌త స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించారు. 

Latest Videos


Tilak Varma

తిల‌క్ వ‌ర్మ సూప‌ర్ సెంచ‌రీ

సంజూ శాంస‌న్ ఔట్ అయిన త‌ర్వాత భార‌త స్కోర్ బోర్డును అభిషేక్ శ‌ర్మ‌తో క‌లిసి ముందుకు న‌డిపించాడు తిల‌క్ వ‌ర్మ‌. సంజూ శాంసన్ వికెట్ తర్వాత, తిలక్ వర్మ, అభిషేక్ శర్మలు ఫిఫ్త్ గేర్‌లో బ్యాటింగ్ చేసి స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించారు. ఇద్దరు ఆటగాళ్లు 27 బంతుల్లో 56 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌కు ప్రాణం పోశారు. ఈ క్ర‌మంలోనే 107 పరుగుల వద్ద టీమ్ ఇండియాకు రెండో ఎదురుదెబ్బ తగిలింది. పేలుడు బ్యాటింగ్ కు దిగిన అభిషేక్ శర్మ ఫిఫ్టీ కొట్టిన వెంటనే ఔటయ్యాడు. అతను 25 బంతుల్లో 50 పరుగుల వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 

Tilak Varma

మరో ఎండ్‌లో తిలక్ వర్మ త‌న అద్భుత‌మైన ఆట‌తో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేశాడు. ఆ త‌ర్వ‌త త‌న బ్యాట్ ప‌వ‌ర్ ను చూపిస్తూ బౌండ‌రీల వ‌ర్షం కురిపించాడు. త‌న‌ అద్భుతంగా బ్యాటింగ్ చేసి తన T20 అంతర్జాతీయ కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో తిలక్ సెంచరీ పూర్తి చేశాడు. అతను సెంచరీ సాధించడానికి 51 బంతులు మాత్రమే తీసుకున్నాడు. ఈ సెంచరీలో అతను 8 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. దీంతో భారత్ స్కోరు 200 ప‌రుగులు దాటింది.

మరోవైపు అరంగేట్రం ఆటగాడు రమణదీప్ సింగ్ కూడా తన బ్యాట్‌తో తొలి బంతికే సిక్సుతో అద్బుత అరంగేట్రం చేశాడు. భార‌త్ జ‌ట్టు 6 వికెట్లు కోల్పోయి 219 ప‌రుగులు చేసింది. అభిషేక్ శర్మ 25 బంతుల్లో మూడు ఫోర్లు, 5 సిక్సర్ల సహాయంతో 50 పరుగులు చేశాడు. అరంగేట్రం ఆటగాడు రమణదీప్ సింగ్ 6 బంతుల్లో 15 పరుగులు చేశాడు. హార్దిక్ 18 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా తరఫున ఆండిలే సిమెలనే అత్యధికంగా రెండు వికెట్లు పడగొట్టాడు.

click me!