Virat Kohli: జింబాబ్వేతో వన్డే సిరీస్ కు కోహ్లీ..? అనామక జట్టుతో ఆడితే అయినా ఫామ్ లోకి వస్తాడేమో అని..!

Published : Jul 20, 2022, 11:58 AM IST

Virat Kohli: కోహ్లీ తన ఫామ్ ను తిరిగి పొందడానికి సెలక్టర్లు ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. ప్రపంచ నెంబర్ వన్ బౌలర్లను సైతం వణికించిన అతడిని జింబాబ్వే టూర్ కు పంపనున్నారు. అక్కడైనా కోహ్లీ మునపటి ఆటను అందిపుచ్చుకుంటాడని...!

PREV
19
Virat Kohli: జింబాబ్వేతో వన్డే సిరీస్ కు కోహ్లీ..? అనామక జట్టుతో ఆడితే అయినా ఫామ్ లోకి వస్తాడేమో అని..!

ఏం హాలత్ అయిపోయింది..? ఎసొంటి ఆటగాడికి ఏం గతి పట్టింది..? ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ వంటి  అత్యుత్తమ జట్లపై వాళ్ల దేశాలకు వెళ్లి  అక్కడ ప్రపంచ భీకర బౌలర్లను గడగడలాడించిన ఆటగాడు ఇప్పుడు  ఫామ్ కోసం అనామక జట్టుతో ఆడాల్సి వస్తుంది. ఇది విధిరాత అనుకోవాలా..? కర్మ అనుకోవాలా..? 

29

అవును.. ప్రపంచ నెంబర్ వన్ బౌలర్లను సైతం వణికించిన టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఇప్పుడు  ఫామ్ కోల్పోయి నానా తంటాలు పడుతున్నాడు. గడిచిన మూడేండ్లుగా సెంచరీ లేక.. కొద్దిరోజులుగా అసలు క్రీజులో నిలవలేక కెరీర్ లోనే అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటున్నాడు. 

39

దీంతో అతడు తన ఫామ్ ను తిరిగి పొందడానికి సెలక్టర్లు ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. ఇంగ్లాండ్  తో సిరీస్ లో కోహ్లీ ఫామ్ అందుకుంటాడని.. ఇరగదీస్తాడని, ఇక రికార్డులు  బద్దలే అని  అతడి  అభిమానులు  నానా  హంగామా చేశారు. కానీ  కోహ్లీ మాత్రం వాళ్ల ఆశల్ని  అడియాసలు చేస్తూ ఒక్క మ్యాచ్ లో కూడా 25 పరుగుల కంటే  ఎక్కువ చేయలేదు.  ఈ పర్యటనలో ఓ టెస్టు, రెండు టీ20లు, రెండు వన్డేలు ఆడిన అతడు.. మొత్తం కలిపి చేసింది 80 పరుగుల లోపే..

49

విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ తో సిరీస్ ముగిశాక ప్రస్తుతం అక్కడే ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంగ్లాండ్ తో సిరీస్ అనంతరం భారత జట్టు వెస్టిండీస్ కు వెళ్లినా అతడు మాత్రం రెస్ట్ తీసుకున్నాడు. విండీస్ తో వన్డేలతో పాటు ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో కూడా కోహ్లీ విశ్రాంతి కోరాడు. 

59
Image credit: Getty

అయితే ఈ సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టు జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు ఆ దేశం వెళ్లనుంది. జింబాబ్వేతో కూడా భారత్.. జూనియర్ ఆటగాళ్లతో కూడిన రెండోస్థాయి జట్టునే ఎంపిక చేసే అవకాశముంది.  ఈ సిరీస్ కూ శిఖర్ ధావన్ సారథ్యం వహించనున్నాడు. 

69
Image credit: Getty

తాజాగా బోర్డు వర్గాల సమాచారం ప్రకారం.. విండీస్ తో సిరీస్ కు విరామం తీసుకున్న కోహ్లీని జింబాబ్వే సిరీస్ లో ఆడాలని సెలక్టర్లు కోరుతున్నారని సమాచారం. అనామక జట్టుగా పేరున్న జింబాబ్వేతో ఆడితే అయినా కోహ్లీ తన పూర్వపు ఫామ్ ను అందుకుంటాడని సెలక్టర్లు భావిస్తున్నారు. 
 

79

గతంలో సౌరవ్ గంగూలీ కూడా ప్రస్తుతం కోహ్లీ ఎదుర్కున్న దశనే అనుభవించాడు. కానీ అతడు జింబాబ్వేతో సిరీస్ లో మళ్లీ తన ఫామ్ ను అందుకున్నాడు. ఆ సిరీస్ లో దాదా సెంచరీ చేశాక మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు.

89

ఇప్పుడు కోహ్లీ కూడా జింబాబ్వేతో ఆడి ఫామ్ ను పొందితే అంతకంటే కావాల్సిందేముంటుందని  బీసీసీఐ వర్గాల భోగట్టా.  అదీగాక ఈ సిరీస్ తర్వాత జరుగబోయే ఆసియా కప్ కు ముందు కోహ్లీ ఫామ్ లోకి వస్తే అది టీమిండియా కు బోనస్ కిందే లెక్క అని సెలక్టర్లు భావిస్తున్నారు.  కోహ్లీని నేరుగా ఆసియాకప్ లో ఆడించడం కంటే జింబాబ్వే టూర్ కు పంపించడమే బెటరనే అభిప్రాయంలో సెలక్టర్లు ఉన్నట్టు తెలుస్తున్నది. 

99

మరి ఈ టూర్ కు కోహ్లీ వెళ్తాడా..?   అంత చిన్న జట్టుతో ఆడటమెందుకని లండన్, పారిస్ లో అనుష్కశర్మతోనే ఎంజాయ్ చేస్తాడా..? అనేది త్వరలో తేలనుంది. ఆగస్టు 18 నుంచి  22 వరకు భారత జట్టు జింబాబ్వే టూర్  లో మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. ఆగస్టు 27 నుంచి ఆసియా కప్  ప్రారంభం కావాల్సి ఉంది. 

Read more Photos on
click me!

Recommended Stories