కౌంటీలలో పట్టపగ్గాల్లేని పుజారా.. మరో సెంచరీ బాదిన నయావాల్..

Published : Jul 20, 2022, 12:33 PM IST

Cheteshwar Pujara: టీమిండియా నయావాల్ ఛటేశ్వర్ పుజారా కౌంటీలలో తన విశ్వరూపాన్ని చూపెడుతున్నాడు. ఏడు మ్యాచులాడిన పుజారా అందులో ఐదు సెంచరీలు చేయడం విశేషం.   

PREV
16
కౌంటీలలో పట్టపగ్గాల్లేని పుజారా.. మరో సెంచరీ బాదిన నయావాల్..

భారత జట్టు నయావాల్ గా గుర్తింపుపొందిన పుజారా.. కౌంటీలలో తన భీకర ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్ లో భాగంగా ససెక్స్ తరఫున ఆడుతున్న పుజారా.. మంగళవారం  మిడిల్ సెక్స్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ బాదాడు.

26

ఈ సీజన్ లో పుజారా కు ఇది ఐదో సెంచరీ. లార్డ్స్ వేదికగా మిడిల్ సెక్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో  పుజారా.. 144 బంతుల్లో సెంచరీ సాధించాడు. అతడితో పాటు టామ్ అల్సప్ కూడా సెంచరీ బాదడంతో తొలి రోజు ఆటముగిసే సమయానికి ససెక్స్ 4 వికెట్ల నష్టానికి  328 పరుగులు చేసింది.

36

ఇక ఈ సీజన్ లో ఏడు మ్యాచులాడిన పుజారాకు ఇది ఐదో సెంచరీ కావడం విశేషం.  ఇందులో రెండు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. డెర్బీషైర్ తో జరిగిన మ్యాచ్ లో పుజారా.. 6, 201 నాటౌట్ చేశాడు. అనంతరం వర్సెస్టర్షైర్ తో మ్యాచ్ లో 109, 12 బాదాడు. 

46

డర్హమ్ తో జరిగిన మ్యాచ్ లో 203 పరుగులు చేసిన పుజారా.. మిడిల్ సెక్స్ తో జరిగిన మ్యాచ్ లో తొలి  ఇన్నింగ్స్ లో 16 పరుగులే చేసిన రెండో ఇన్నింగ్స్ లో మాత్రం 170 రన్స్ సాధించి నాటౌట్ గా నిలిచాడు. 

56

అనంతరం లీస్టర్షైర్ తో జరిగిన మ్యాచ్ లో 3, 46 పరుగులే చేసి నిరాశపరిచిన అతడు మళ్లీ తాజాగా  మిడిల్ సెక్స్ తో మ్యాచ్ లో సెంచరీ చేసి శభాష్ అనిపించుకున్నాడు. 

66

ఈ ఛాంపియన్షిప్ మధ్యలో ఇండియా-ఇంగ్లాండ్ మధ్య ఎడ్జబాస్టన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పుజారా.. తొలి ఇన్నింగ్స్ లో 13పరుగులే చేసి ఔటయ్యాడు. కానీ రెండో ఇన్నింగ్స్ లో 66పరుగులు చేసి ఫర్వాలేదనపించాడు. 

click me!

Recommended Stories